మా ఫింగర్స్ ట్రిగ్గర్ పైనే ఉన్నాయి.. ఏ క్షణమైనా : ఇరాన్ సంచలన వార్నింగ్
పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు తగ్గేలా ఏమాత్రం కనిపించడం లేదు. ఇరాన్- అమెరికా మధ్య కాల్పుల విరమణ జరిగినప్పటికీ అక్కడి పరిస్థితి యుద్ధ వాతావరణాన్నే తలపిస్తోంది. లెబనాన్ పై ఇజ్రాయెల్ దాడులు ముమ్మరం చేయడంతో పరిస్థితి మళ్లీ మొదటికి వచ్చింది. అయితే లెబనాన్ పై ఇజ్రాయెల్ దాడుల్ని ఇరాన్ తీవ్రంగా ఖండించింది. ఈ దాడులు సీజ్ ఫైర్ ఉల్లంఘన కిందకు వస్తాయని స్పష్టం చేసింది. ఈ మేరకు ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్ సంచలన వార్నింగ్ ఇచ్చారు. తమ ఫింగర్స్ ట్రిగ్గర్ పైనే ఉందన్నారు. లెబనాన్ ను ఒంటరిగా వదిలేయమని తేల్చి చెప్పారు. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా పోస్టు పెట్టారు.
" లెబనాన్ పై ఇజ్రాయెల్ దాడులు ప్రస్తుతం ఉన్న కాల్పుల విరమణ ఒప్పందానికి తూట్లు పొడిచినట్టే. ఇది ఓ క్రూరమైన చర్యకు నాంది. భవిష్యత్తులో జరగనున్న చర్చలకు ఈ దాడులు విఘాతం కలిగిస్తాయి. ఇరు దేశాల మధ్య చర్చలకు ఈ దాడులు అడ్డంగా మారాయి. ఇక చర్చలు చేయడానికి అర్థం ఏం ఉంటుంది. మా ఫింగర్స్ ట్రిగ్గర్ పైనే ఉన్నాయి. లెబనాన్ లోని సోదరసోదరీమణులను ఇరాన్ ఒంటరిగా వదిలేయదు" అని ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్ సంచలన వార్నింగ్ ఇచ్చారు.
అలాగే ఇరాన్ పార్లమెంట్ స్పీకర్ మహమ్మద్ భాగేర్ సైతం ఇజ్రాయెల్ కు వార్నింగ్ ఇచ్చారు. కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తే తర్వాత పర్యవసానాలు దారుణంగా ఉంటాయని హెచ్చరించారు. తమ సరిహద్దు దేశాలను కాపాడుకోవడంలో ఇరాన్ పాత్ర చాలా ఉంటుందని పేర్కొన్నారు. సీజ్ ఫైర్ కిందకు లెబనాన్ కూడా వస్తుందని తెలిపారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా మహమ్మద్ భాగేర్ పోస్టు పెట్టారు.
تجاوز دوباره رژیم صهیونیستی به لبنان نقض آشکار توافق اولیه آتشبس است. این نشانه خطرناکی از فریب و عدم پایبندی به توافقات احتمالی است. تداوم این اقدامات، مذاکره را بیمعنا خواهد کرد. دستهای ما بر ماشه باقی است. ایران هرگز خواهران و برادران لبنانی را تنها نخواهد گذاشت. https://t.co/T3Wy3qBqcE
— Masoud Pezeshkian (@drpezeshkian) April 9, 2026
ఇక లెబనాన్ పై ఇజ్రాయెల్ వరుసబెట్టి దాడులు చేస్తోంది. తాజాగా గురువారం చేపట్టిన దాడుల్లో లెబనాన్ లో దాదాపు 250 మందికి పైగా మృతి చెందినట్లు సమాచారం. మరోవైపు ఇజ్రాయెల్ ప్రధాని బెంజిమన్ నెతన్యాహు మాట్లాడుతూ.. హెజ్ బొల్లా పై మిలిటరీ దాడులు కొనసాగుతూనే ఉంటాయని స్పష్టం చేశారు. హెజ్ బొల్లాపై కచ్చితత్వమైన మిలిటరీ దాడులను ఇజ్రాయెల్ సైన్యం చేస్తుందని తెలిపారు. తమ సందేశం ఒకటేనని.. ఎవరైతే ఇజ్రాయెల్ ప్రజలకు వ్యతిరేకంగా ఉంటారో వారిపై దాడులు చేస్తామని తేల్చి చెప్పారు. అలాగే ఇజ్రాయెల్ ఎప్పుడనుకుంటే అప్పుడు హెజ్ బొల్లాపై దాడులకు పాల్పడుతుందని స్పష్టం చేశారు.

ఇక ఇరాన్- అమెరికా మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదిరిన వెంటనే లెబనాన్ పై ఇజ్రాయెల్ సైన్యం భీకర దాడులు చేసింది. వందలాది ఫైటర్ జెట్స్ తో లెబనాన్ పై విరుచుకుపడింది. కేవలం 10 నిమిషాల్లోనే 100 కు పైగా లక్ష్యాలను ఛేదించింది.. ఇది హెజ్ బొల్లాకు ఊహించని దెబ్బ అని ఇజ్రాయెల్ సైన్యం స్పష్టం చేసింది. ఈ దాడుల్లో లెబనాన్ లో దాదాపు 200 మందికి పైగా మరణించినట్లు సమాచారం.
-
జేడీ వాన్స్ అవుట్..? ట్రంప్ ఊహించని షాక్..?? -
మీ చావు మీరు చావండి: అన్ని గేట్లు మూసేసిన ఇరాన్.. -
"ఈ రాత్రితో ఇరాన్ నాగరికత సమాప్తం"-ఐరాస హెచ్చరికల్నీ లెక్కచేయని ట్రంప్..! -
ప్రపంచ చరిత్రలోనే ఈ రాత్రి కీలకం: ట్రంప్ సంచలనం -
జాక్ పాట్ కొట్టిన భారత్.. భారీగా బయటపడ్డ చమురు నిక్షేపాలు.. 19 బావుల్లో.. -
అమెరికా అణు కమాండ్ సెంటర్ వద్ద ట్రంప్ 'డూమ్స్‌డే ప్లేన్' చక్కర్లు.. -
ట్రంప్ డెడ్ లైన్ ముగుస్తున్న వేళ రోడ్లపైకి ఇరాన్ ప్రజలు- ఏం చేస్తున్నారంటే ? -
Iran War: సీజ్ ఫైర్ బ్రేక్-మళ్లీ హార్ముజ్ మూసేసిన ఇరాన్..! -
భారతీయులకు గండం! కేంద్రం రెడ్ అలర్ట్. రంగంలోకి ఎంబసీ. -
US Iran: గెలుపు ఎవరిది? అసలు ఇస్లామాబాద్‌లో ఏం జరగబోతోంది? -
ఇరాన్ పోరాటం భారత్ కు నేర్పుతున్న పాఠం..! టీఎంసీ ఎంపీ కీలక వ్యాఖ్యలు..! -
కోడిగుడ్డు అక్షరాల రూ.25 వేలు..?












Click it and Unblock the Notifications