భారత్-పాక్ మధ్యవర్తిత్వానికి ఇరాన్ ఆఫర్-సౌదీతో కేంద్రం చర్చలు..!

జమ్మూ కాశ్మీర్ లోని పహల్గాంలో ఉగ్రవాదుల దాడి తర్వాత భారత్-పాకిస్తాన్ మధ్య సంబంధాలు చరిత్రలో ఎన్నడూ లేనంత దారుణంగా పతనం అయ్యాయి. సింధు జలాల ఒప్పందం అమలు నిలిపేస్తున్నట్లు భారత్ ప్రకటిస్తే సిమ్లా ఒప్పందం అమలు చేయబోమని పాకిస్తాన్ ప్రకటించింది. పాకిస్తాన్ పౌరుల్ని భారత్ బహిష్కరిస్తుంటే.. పాకిస్తాన్ కూడా దాదాపు అవే అడుగులు వేస్తోంది. పాకిస్తాన్ పౌరులకు గతంల ఇచ్చిన వీసాల్ని భారత్ రద్దు చేస్తుంటే ఆ దేశ గగనతలంలో భారత్ విమానాలను రానివ్వకుండా ఆంక్షలు విధించారు.

ఈ నేపథ్యంలో అంతకంతకూ పెరిగిపోతున్న ఉద్రిక్తతలు భారత ఉపఖండంలో పరిస్ధితుల్ని యుద్ధం వైపు నడిపించేలా కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో పశ్చిమాసియాలోని భారత్ మిత్ర దేశం ఇరాన్ కీలక ప్రకటన చేసింది. భారత్-పాకిస్తాన్ మధ్య మధ్యవర్తిత్వం వహించేందుకు సిద్ధంగా ఉన్నట్లు ఇరాన్ విదేశాంగశాఖ మంత్రి అబ్బాస్ అరాఘ్చి ఎక్స్ లో పోస్టు చేశారు. భారత్-పాకిస్తాన్ లు ఇరాన్ కు సోదర దేశాలని, వీరిద్దరి మధ్య శతాబ్దాల నాటి సాంస్కృతిక, నాగరిక సంబంధాలు ఉన్నాయని తెలిపారు. తాము కూడా వాటికి అత్యంత ప్రాధాన్యం ఇస్తున్నట్లు తెలిపారు. తద్వారా మధ్యవర్తిత్వానికి అంగీకరించాలని ఇరుదేశాల్ని కోరారు.

iran proposes mediation between india and pakistan amid pahalgam tension centre approaches saudi

పర్షియన్ కవి సాది బోధించిన స్ఫూర్తికి అనుగుణంగా, ఈ క్లిష్ట సమయంలో ఎక్కువ అవగాహనను ఏర్పరచుకోవడానికి ఇస్లామాబాద్ మరియు న్యూఢిల్లీలతో తన సత్సంబంధాలను వాడుకోవడానికి టెహ్రాన్ సిద్దంగా ఉందన్నారు. "మానవులు మొత్తం ఒకే సమూహమని, ఒకే సారాంశం మరియు ఆత్మను సృష్టించడంలోఒక సభ్యునికి బాధ కలిగితే ఇతర సభ్యులు అసౌకర్యంగానే ఉంటారని పేర్కొన్నారు.

మరోవైపు భారత విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ సౌదీ అరేబియా విదేశాంగమంత్రి ఫైసల్ బిన్ ఫర్హాన్ అల్ సౌద్‌తో పహల్గాం ఉగ్రవాద దాడి, పాకిస్తాన్ తో సరిహద్దు సంబంధాల గురించి మాట్లాడారు. తాజా పరిణామాల్ని ఆయన దృష్టికి తీసుకెళ్లారు. అయితే భారత్-పాక్ దేశాల సమస్యకు మధ్యవర్తిత్వం వహించాలని మాత్రం కోరలేదు. దీంతో కేంద్రం అడుగులు ఆసక్తికరంగా మారాయి.

Take a Poll

భారత్-పాకిస్తాన్ వివాదాల్ని ఇరువర్గాలు పరిష్కరించుకోవాలని, మూడో పక్షం జోక్యం కోరరాదని సిమ్లా ఒప్పందంలో ఇరుదేశాలూ అంగీకరించాయి. ఇప్పుడు పాకిస్తాన్ సిమ్లా ఒప్పందం అమలు నిలిపేసిన నేపథ్యంలో ఇరాన్ ఈ మధ్యవర్తిత్వం ఆఫర్ ఇచ్చినట్లు తెలుస్తోంది. అయితే దీనిపై భారత్ ఇప్పటివరకూ స్పందించలేదు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+