వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సూసైడ్ డ్రోన్స్ : ఇరాన్ అమ్ములపొదిలో కొత్త అస్త్రం

|
Google Oneindia TeluguNews

ఇరాన్ : రక్షణ అవసరాల కోసం ఆయా దేశాలు కొత్త కొత్త ఆవిష్కరణలకు నాంది పలుకుతున్నాయి. ఈ నేపథ్యంలోనే తాజాగా ఇరాన్ ఆత్మాహుతి డ్రోన్స్ ను తయారు చేసింది. సూసైడ్ డ్రోన్స్ గా పరిగణించబడే ఈ డ్రోన్స్.. అవసరమైతే తమను తాము పేల్చేసుకుని శత్రు శిబిరాన్ని వినాశనం చేయగలవు.

Iran Revolutionary Guard Unveils Maritime 'Suicide' Drone

ఇరాన్ అభివృద్ధి చేసిన ఈ సూసైడ్ డ్రోన్స్.. ఉపరితలంపైనే గాక నీటిపై ఉన్న లక్ష్యాలను కూడా పేల్చివేసే సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి. నీటిపై కేవలం రెండంటే రెండడుగుల ఎత్తులో ఎగురుతూ 250 కి.మీ వేగంతో ప్రయాణించగల సామర్థ్య ఈ డ్రోన్స్ సొంతమని ఇరాన్ రివల్యూషనరీ గార్డ్స్ వెల్లడించింది. 250కి.మీ నుంచి అత్యధికంగా 3వేల కి.మీ వరకు ఎగరగలిగే ఈ డ్రోన్స్ కు పగలే కాకుండా, రాత్రి పూట కూడా స్పష్టంగా చూడగలిగే ఆత్యాధునిక కెమెరాలను అమర్చారు.

నిర్దేశించిన లక్ష్యం కమాండ్ సెంటర్ అయినా, లేక నౌక లాంటిదైనా సరే ఈ డ్రోన్స్ ద్వారా నేరుగా ఢీకొట్టి ధ్వంసం చేయవచ్చు. ప్రాథమికంగా తీరా ప్రాంత నిఘా కోసమే వినియోగించే ఈ డ్రోన్స్ అత్యవసరమైతే ఆత్మాహుతి కోసం కూడా వినియోగించువచ్చునని రివల్యూషనరీ గార్డ్స్ ప్రకటించింది.

English summary
Iran's paramilitary Revolutionary Guard has unveiled a new drone for use by its naval units, suggesting it could be a "suicide drone" that would crash into ships.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X