ట్రంప్, నెతన్యాహుకు ఉరి లేదా శిలువ..! ఇరాన్ సంచలన ఫత్వా జారీ..!

ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధం ముగిసినా దాని ప్రకంపనలు మాత్రం కొనసాగుతూనే ఉన్నాయి. ముఖ్యంగా ఇరాన్ తో అణు చర్చలు విఫలమయ్యాక ఇజ్రాయెల్ సాయంతో ఆ దేశంపై పరోక్ష యుద్దం ప్రారంభించిన అమెరికా ఆ తర్వాత నేరుగా రంగంలోకి దిగి బాంబులేయడం, దీనికి ప్రతిగా ఇరాన్ కూడా పశ్చిమాసియాలోని అమెరికా స్థావరాల్ని టార్గెట్ చేయటంతో కాల్పుల విరమణకు అమెరికా, ఇజ్రాయెల్ సిద్దం కావడం తెలిసిందే. అయితే ఈ అవమానాన్ని జీర్ణించుకోలేక ట్రంప్ ఇరాన్ పై విమర్శలకు దిగారు.

ఇరాన్ అధ్యక్షుడు ఖమేనీని తాను అవమానకర చావు నుంచి కాపాడానని, అయినా ఆయన కృతజ్ఞత చూపడం లేదంటూ తాజాగా ట్రంప్ చేసిన వ్యాఖ్యలు, త్వరలో జరిగే మరో దఫా చర్చల్లో తమ డిమాండ్లకు అంగీకరించాలంటూ చేస్తున్న డిమాండ్లను ఖమేనీ పట్టించుకోకపోవడం ప్రాధాన్యం సంతరించుకున్నాయి. దీంతో ఇరాన్ పై ఆంక్షలు ఎత్తేయాలని ముందు అనుకున్న ట్రంప్ ఆ తర్వాత ఈ నిర్ణయంపై వెనక్కి తగ్గారు. ఈ నేపథ్యంలో ఇరాన్ కూడా అమెరికా తీరుపై మండిపడుతోంది.

iran s top cleric issued fatwa against Donald trump and Netanyahu termed enemies of god

ఇదే క్రమంలో ఇరాన్‌లోని అగ్రశ్రేణి షియా మతాధికారి గ్రాండ్ అయతుల్లా నాజర్ మకరెం షిరాజీ .. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఇజ్రాయెల్ ప్రధాన మంత్రి బెంజమిన్ నెతన్యాహులపై ఓ ఫత్వా జారీ చేశారు. వీరిద్దరూ "దేవుని శత్రువులు" అని పేర్కొంటూ , ప్రపంచవ్యాప్తంగా ఉన్న ముస్లింలు ఐక్యంగా ఉండి ఇస్లామిక్ రిపబ్లిక్ నాయకత్వాన్ని బెదిరిస్తున్న వీరిద్దరినీ ఓడించాలని పిలుపునిచ్చారు.

తమ ప్రియతమ నేతను లేదా నాయకుడిని బెదిరించే ఏ వ్యక్తి అయినా, ప్రభుత్వమైనా యుద్ద నాయకుడు లేదా మెహరేబ్ గా పరిగణిస్తామని, అంేట దేవునికి వ్యతిరేకంగా యుద్ధం చేసే వ్యక్తి అని తన ఫత్వాలో తెలిపారు. ఇరాన్ చట్టం ప్రకారం, మొహరేబ్‌గా గుర్తించబడిన వారు ఉరిశిక్ష, శిలువ వేయడం, అవయవాలను విచ్ఛేదనం చేయడం లేదా బహిష్కరించబడతారని పేర్కొన్నారు.

iran s top cleric issued fatwa against Donald trump and Netanyahu termed enemies of god

ముస్లింలు లేదా ఇస్లామిక్ దేశాలు ఆ శత్రువుకు అందించే ఏదైనా సహకారం, మద్దతు హరామ్ లేదా నిషిద్ధమని ఫత్వా తెలిపింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ముస్లింలందరూ ఈ శత్రువులు తమ మాటలు, తప్పులకు పశ్చాత్తాపపడేలా చేయడం అవసరమని వెల్లడించింది. తన ముస్లిం విధికి కట్టుబడి ఉండే ముస్లిం తమ ప్రచారంలో కష్టాలను లేదా నష్టాన్ని ఎదుర్కొంటే, వారు దేవుని మార్గంలో పోరాట యోధునిగా, దేవుడు ఇష్టపడితే ప్రతిఫలం పొందుతారని కూడా అది పేర్కొంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+