ఐఎస్ ఆత్మాహుది దాడులు: 213మంది మృతి

Subscribe to Oneindia Telugu

బాగ్దాద్‌: ఇస్లామిక్ స్టేట్(ఐఎస్) ఉగ్రవాదులు మరోసారి దాడికి తెగబడ్డారు. ఇరాక్‌ రాజధాని బాగ్దాద్‌లో వరుస పేలుళ్లతో మారణకాండ సృష్టించారు. ఉగ్రదాడిలో సుమారు 120మంది ప్రాణాలు వదిలారు. రద్దీ ప్రదేశాల్లో జరిగిన ఈ బాంబు మరో 130 మందికిపైగా గాయపడ్డారు.

స్థానిక అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. బాగ్దాద్ నగరంలోని రద్దీ ప్రాంతాలైన కరాదా, షల్లాల్‌ మార్కెట్‌ వద్ద ఉగ్రవాదులు పేలుళ్లకు తెగబడ్డారు. తొలుత కరాదా వద్ద కారులో వచ్చిన ఓ వ్యక్తి తనను తాను పేల్చుకుని ఆత్మాహుతి దాడికి పాల్పడ్డాడు.

Iraq violence: IS bombing kills at least 80 in Baghdad

ఈ ఘటన జరిగిన కొద్ది సేపటికే షల్లాల్‌ మార్కెట్లో మరో పేలుడు సంభవించింది. రంజాన్‌ మాసం సందర్భంగా.. ముస్లింలు భోజనాలు చేస్తున్న సమయంలో ఈ దాడులు జరిగాయి. ఘటనలో 120 మంది వరకు చనిపోయి ఉంటారని బాగ్దాద్‌ అధికారులు వెల్లడించారు.

కాగా, దాడి పాల్పడింది తామేనంటూ ఇస్లామిక్‌ స్టేట్‌ ఉగ్రవాద సంస్థ ప్రకటించుకుంది. ఇస్లామిక్‌ ఉగ్రవాదుల అధీనం నుంచి ఫలూజా నగరాన్ని ఇరాకీ భద్రతాదళాలు వెనక్కి తీసుకున్న వారం రోజులకే ఈ దాడులు జరగడం గమనార్హం. క్షతగాత్రులను అధికారులు ఆస్పత్రులకు తరలించారు. పేలుళ్లతో అక్కడ భయానక వాతావరణం నెలకొంది.

213కు చేరిన మృతుల సంఖ్య

బాగ్దాద్‌లో జరిగిన పేలుళ్ల ఘటనలో మృతుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. ఆదివారం వరకు 120మంది మృతి చెందినట్లు తెలిపిన అధికారు.. సోమవారం ఈ సంఖ్యగా భారీగా పెరినట్లు చెప్పారు. ఈ బాంబు దాడిలో మృతుల సంఖ్య 213కు చేరినట్లు ఇరాక్‌ అధికారులు సోమవారం వెల్లడించారు. ఘటనాస్థలంలో సహాయక చర్యలు కొనసాగిస్తున్నట్లు తెలిపారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
At least 80 people have been killed and 131 injured in an explosion claimed by the Islamic State group in Baghdad, Iraqi police say.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి