ఇరాన్ ఆర్మీ చీఫ్ ఖాసిం మృతిపై ఇరాకీల సంబురాలు..వీడియో పోస్ట్ చేసిన మైక్ పాంపే
Recommended Video
ఇరాన్ పై అమెరికా జరిపిన దాడుల్లో ఇరాన్ సైనికాధిపతి ఖాసిం సులేమని మృతి చెందిన విషయం తెలిసిందే. ఖాసిం మృతి చెందాడన్న విషయాన్ని తెలుసుకున్న పొరుగు దేశం ఇరాక్ సంబురాలు చేసుకుంది. ఇరాకీలు సంబురాలు చేసుకుంటున్న దృశ్యాలు కలిగి ఉన్న వీడియోను అమెరికా సెక్రటరీ ఆఫ్ స్టేట్ మైక్ పాంపే ట్విటర్‌లో పోస్టు చేశారు. ఖాసిం మృతితో ఇరాకీలు ఎలా సంబురాలు చేసుకుంటున్నారో చూడండి అంటూ పోస్టులో రాసుకొచ్చారు. 22 సెకన్ల నిడివి ఉన్న వీడియోలో ఇరాకీలో రోడ్లపై డ్యాన్స్ చేస్తూ సంబరాలు చేసుకుంటున్న దృశ్యాలు ఉన్నాయి.
ఇరాన్ సైనికాధిపతి ఖాసిం మృతి చెందాడని తెలుసుకున్న ఇరాక్ ప్రజలు రోడ్లపైకొచ్చారు. ఇరాక్ జాతీయ జెండాను పట్టుకుని రోడ్లపై కలియతిరిగారు. సంతోషంతో కేకలు వేశారు. అయితే ఇరాక్‌లో ఏ ప్రాంతంలో ఇది జరిగిందో కచ్చితంగా తెలియరాలేదు. భాగ్దాద్ అంతర్జాతీయ విమానాశ్రయంకు సమీపంలో శుక్రవారం ఉదయం అమెరికా జరిపిన దాడుల్లో ఇరాన్ సైనికాధిపతి ఖాసి సులైమని దుర్మరణం చెందారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆదేశాల మేరకే ఈ దాడులు నిర్వహించినట్లు పెంటగాన్ ఆ తర్వాత స్పష్టం చేసింది.
Iraqis — Iraqis — dancing in the street for freedom; thankful that General Soleimani is no more. pic.twitter.com/huFcae3ap4
— Secretary Pompeo (@SecPompeo) January 3, 2020

ఇరాక్‌లో ఉన్న అమెరికా బలగాలను, అమెరికా దౌత్యాధికారులను చంపేందుకు ఖాసిం సులైమని స్కెచ్‌లు వేస్తున్నాడన్న సమాచారం అందడంతోనే దాడులు చేసి అతన్ని మట్టుబెట్టామని పెంటాగన్ తెలిపింది. బాగ్దాద్‌లోని అమెరికా ఎంబసీ వద్ద ఈ వారం ప్రారంభంలో జరిగిన దాడులు ఖాసిం నేతృత్వంలోనే జరిగాయని పెంటాగన్ నిర్థారించింది. ఇదిలా ఉంటే ఖాసిం మృతిని ధృవీకరించిన తర్వాత అమెరికా అధ్యక్షుడు ఆదేశ జెండాను ట్వీట్ చేశారు. బాగ్దాద్ అంతర్జాతీయ విమానాశ్రయంకు సమీపంలో జరిగిన దాడుల్లో డిప్యూటీ చీఫ్ కూడా హతమయ్యారు.












Click it and Unblock the Notifications