ఇరీడియం: దీని ధర బంగారం, ప్లాటినం, బిట్‌కాయిన్‌ల కంటే ఎక్కువగా పెరిగింది.. ఈ అరుదైన లోహాన్ని ఎందులో వాడతారు?

ఇరీడియం.
ఈ పేరు ఎక్కడో విన్నట్టుంది కదా.
అవును. మహేశ్‌బాబు నటించిన ఖలేజా సినిమా కథ మొత్తం దీని చుట్టూనే తిరుగుతుంది.
ఆ సినిమాలో విలన్‌గా నటించిన ప్రకాశ్‌రాజ్ ఇరీడియం కోసం ఒక గ్రామాన్నే తుడిచిపెట్టాలని ప్రయత్నిస్తారు.
ఇప్పుడు ఇరీడియం మరోసారి వార్తల్లోకి వచ్చింది.
దానికి కారణం దాని ధర.
ఈ ఏడాది ప్రారంభం నుంచి ఇరీడియం ధర 131 శాతం పెరిగింది. బిట్‌కాయిన్ ధర పెరుగుదల (దాదాపు 120శాతం) కంటే ఇది ఎక్కువ.
ఒక ఔన్స్ ఇరీడియం ధర దాదాపు 4 లక్షల 40 వేలు రూపాయలు.
ఒక ఔన్స్ అంటే 28.3495 గ్రాములు.
ఈ లెక్కన చూస్తే ఒక గ్రాము ఇరీడియం ధర 15,520 రూపాయలు.
ఏప్రిల్ 5న గ్రాము బంగారం ధర 4450 రూపాయలు ఉండగా, ప్లాటినం ధర ఒక గ్రాము దాదాపు 3800 రూపాయలుగా ఉంది.
అంటే బంగారం, ప్లాటినం కంటే ఇరీడియం ధర మూడింతల కంటే ఎక్కువ.
- 'నా న్యూడ్ చిత్రాలు గీశాక, నా కాళ్లకు నమస్కరిస్తారు’
- 'మనిషి లాంటి’ చేప: ఇది కేన్సర్‌కి పరిష్కారం చూపుతుందా?
ఇరీడియం ఎందులో వాడతారు
విమానం ఇంజన్లు, కారు కాటలిస్టులు, నీటి లోపల వేసే పైపుల తయారీకి ఇది అత్యంత అవసరం.
స్పార్క్ ప్లగ్గులు, మెడికల్, ఎలక్ట్రానిక్ పరికరాల్లో కూడా దీన్ని వాడతారు.
చివరికి గడియారాలు, దిక్సూచిల్లో కూడా స్వల్ప మోతాదులో ఇరీడియం ఉపయోగిస్తారు.
ఎందుకింత ధర
ఇది పెద్దగా తుప్పు పట్టదు.
ఎంత వేడినైనా తట్టుకుంటుంది.
ఇది అత్యంత అరుదుగా దొరుకుతుంది. పైగా దీనికి డిమాండ్ ఎక్కువ.
ఎలక్ట్రానిక్ డిస్‌ప్లే పరికరాల్లో దీని వినియోగం పెరగడం ఇరీడియం ధర పెరుగుదలకు కారణమని హెరాయస్ గ్రూప్ సంస్థ గణాంకాలు చెబుతున్నాయి.
- ఉత్తర కొరియా మాజీ సైనికురాలు : 'నెలసరి రాదు.. అత్యాచారం చేసినా ఎవరూ చెప్పరు’
- వెనక 40 మంది పురుషులున్నా, నేను ఆ మరకను దాచుకోలేదు

గ్రీన్ ఫ్యాక్టర్
ప్లాటినం, పల్లాడియం మైనింగ్‌లో ఇది ఉప ఉత్పత్తిగా లభిస్తుంది.
సరఫరా తక్కువగా ఉండటంతో ఇదిప్పుడు మరింత విలువైన లోహంగా మారింది.
శిలాజ ఇంధనాల స్థానంలో క్లీన్ ఎనర్జీ ఉత్పత్తికి హైడ్రోజన్ కీలకంగా మారుతోంది.
హైడ్రోజన్ తయారీకి ఇరీడియం వాడకం పెరిగే అవకాశం ఉందని, అంటే డిమాండ్‌తో పాటు ధరలు కూడా ఇంకా పెరగొచ్చని కొందరు అంచనా వేస్తున్నారు.
ప్లాటినం గ్రూప్‌కు చెందిన ఇతర లోహాల ధరలు కూడా పెరుగుతున్నాయి.
అంటే రోడియం, పల్లాడియం లభ్యత కొరతగా ఉండటంతో వాటి ధరలు కూడా భారీగా పెరుగుతున్నాయి.
ఆంగ్లో-అమెరికన్ ప్లాటినమ్.. దక్షిణాఫ్రికాలో నిర్వహించే ఒక ప్రాసెసింగ్ ప్లాంట్ 2020లో చాలాకాలం మూతపడింది. అదే సమయంలో డిమాండ్ పెరిగింది. కానీ దానికి తగ్గట్టుగా సరఫరా లేదు. దాంతో ధర పెరిగింది.
- బంగారం, ప్లాటినం కంటే ఈ లోహం ఖరీదైంది.. దీనికి ఎందుకింత డిమాండ్
- బంగారం ధరలకు, అంతర్జాతీయ సంక్షోభాలకు ఏమిటి సంబంధం...

80 నుంచి 85 శాతం దక్షిణాఫ్రికా నుంచే..
ప్రపంచ ఇరీడియం ఉత్పత్తిలో 80 నుంచి 85 శాతం దక్షిణాఫ్రికా నుంచే వస్తుంది.
ఇరీడియాన్ని సాధారణంగా స్పార్క్ ప్లగ్గుల్లో ఎక్కువగా వాడుతుంటారు.
కానీ ఇతర పరిశ్రమల్లో కూడా దీనికి డిమాండ్ పెరుగుతోంది.
ఇది చాలా చిన్న మార్కెట్. అందుకే ఇరీడియం సరఫరాలో ఏ చిన్న అంతరాయం కలిగిన దానిధరపై చాలాపెద్ద ప్రభావం కనిపిస్తుంది.
కొన్ని పెద్ద పెద్ద కంపెనీలు మాత్రమే ఇరీడియం కొంటూ, అమ్ముతూ ఉంటాయి.
- సిపాయిల తిరుగుబాటు: పబ్‌లో ఉన్న పుర్రెలో 1857 నాటి చరిత్ర
- 1971లో భారత్‌పై పాకిస్తాన్ దాడి చేయబోతోందన్న విషయం RAW కి ముందే ఎలా తెలిసింది?

ఉల్కల్లో పుష్కలంగా దొరుకుతుంది
ఇరీడియం వెండిలా తెల్లగా.. కొద్దిగా పసుపు రంగులో ఉంటుంది.
దీన్ని గ్రహాంతర లోహంగా భావిస్తారు.
ఎందుకంటే ఉల్కల్లో ఇది పుష్కలంగా ఉంటుంది.
భూమిపై ఉపరితలంలో ఇది దొరకడం చాలా అరుదు.
ఇరీడియాన్ని 1803లో కనిపెట్టారు.
సహజ ప్లాటినం ముడి లోహంలో దీన్ని గుర్తించారు.
ఇది భూమిపై అత్యంత అరుదుగా లభించే లోహం.

ఏడాదికి మూడు టన్నులే
సంవత్సరానికి దాదాపు మూడు టన్నుల ఇరీడియం మాత్రమే వెలికితీస్తారు.
ఎలక్ట్రానిక్, టెలికమ్యూనికేషన్ వ్యవస్థలో సింథటిక్ క్రిస్టల్స్ పెరగడానికి ఉష్ణోగ్రతను నిరోధించే క్రూసిబుల్స్ వాడతారు.
వాటిలో ఇరీడియాన్ని తక్కువ పరిమాణంలో ఉపయోగిస్తారు. కానీ ఇది చాలా అత్యంత అవసరం.
ఇక డిమాండ్ పరంగా చూస్తే గతేడాది ఎలక్ట్రిసిటీ రంగం నుంచి 31శాతం, ఎలక్ట్రో కెమికల్ రంగం నుంచి 26శాతం, ఆటోమోటివ్ రంగం నుంచి 13శాతం, మిగిలింది ఇతర పరిశ్రమల నుంచి వచ్చిందని ఎస్అండ్‌పీ గ్లోబల్ అనే కన్సల్టింగ్ సంస్థ చెబుతోంది.
5జీ స్మార్టు ఫోన్ల అభివృద్ధి, OLED తెరలుండే పరికరాల తయారీతో ఇరీడియానికి డిమాండ్ మరింత పెరగొచ్చని చెబుతున్నారు.
ఇవి కూడా చదవండి:
- అంగారకుడి మీద ఒకప్పుడు ప్రవహించిన నీరంతా ఆ గ్రహం పైపొరలోనే బందీగా ఉందా?
- ఆఫ్రికా నుంచి హబ్సిగూడకు.. బానిసలుగా వచ్చి బాద్‌షాలయ్యారు
- యాంటీకిథెరా: రెండు వేల ఏళ్ల కిందటి 'పురాతన కంప్యూటర్'.. గుట్టు వీడబోతోందా
- సముద్రపు చేపలా, చెరువు చేపలా... ఏవి తింటే ఆరోగ్యానికి మంచిది?
- మహానగరం మధ్యలో అభయారణ్యం... అందులో రహస్య గిరిజన గ్రామం
- 18 ఏళ్ల క్రితం పోలీసులు తనను మెట్ల మీద నుంచి ఈడ్చుకుంటూ తీసుకెళ్లినపుడు మమతా బెనర్జీ ఏమని శపథం చేశారు
- 1988లో భారత సైన్యం మాల్దీవులలో అడుగు పెట్టినపుడు ఏం జరిగింది?
- బంగారు నగలకు 'హాల్‌మార్క్' తప్పనిసరి చేసిన కేంద్రం... అసలు ఈ మార్క్ ఎందుకోసం?
- మీతో అధికంగా ఖర్చు చేయించే బిజినెస్ ట్రిక్... దాదాపు అందరూ ఈ 'వల'లో పడే ఉంటారు
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)