చైనా బరితెగింపు! అమెరికాపై దాడికి రిహార్సల్స్? గువామ్ ద్వీపమే లక్ష్యం, రాజుకున్న అగ్గి..!

Posted By:
Subscribe to Oneindia Telugu
  అమెరికా ఉత్తర కొరియా లక్ష్యమా?.. లేక చైనా లక్ష్యమా? దాడికి రిహార్సల్స్? | Oneindia Telugu

  వాషింగ్టన్: 'గువామ్‌'ను నామరూపాల్లేకుండా చేస్తామంటూ ఉత్తర కొరియా అధినేత కిమ్‌ చేసిన ప్రకటనతో అగ్రరాజ్యం అమెరికా ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఈ ప్రకటనతోనే ఉత్తరకొరియా, అమెరికా మధ్య విభేదాలు యుద్ధపుటంచులకు చేరుకున్నాయి.

  ట్రంపా.. మజాకా? ఆయన పర్యటన కూడా.. చిన్నసైజు యుద్ధమే! ఏ దేశమైనా తలవంచాల్సిందే..

  ఉత్తరకొరియా కిమ్ రాజభోగాలు, ఇదీ ఆ దేశం సత్తా, అణుయుద్ధం వస్తే మాత్రం...

  భారత్‌పై పాక్ భారీ కుట్ర! ఉగ్రవాదులతో ఐఎస్ఐ చీఫ్ భేటీ, జీవాయుధాలతో దాడికి ప్లాన్?

  కానీ, ప్రస్తుతం ఓ ఆశ్చర్యకర ఘటన వెలుగులోకి వచ్చింది. దీంతో అమెరికా కూడా షాక్ తింది. డ్రాగన్ కంట్రీ చేస్తున్న పనులు చూసి అమెరికా సైతం విస్తుపోతోంది. ఇంతకీ గువామ్‌ దీవి ఉత్తర కొరియా లక్ష్యమా?.. లేక చైనా లక్ష్యమా? అనే డైలమాలో పడింది.

  కిమ్ జాంగ్ ఉన్ వెనుక చైనా ఉందా? ఉత్తరకొరియా వెనుక చైనా ఉందా?

  కిమ్ జాంగ్ ఉన్ వెనుక చైనా ఉందా? ఉత్తరకొరియా వెనుక చైనా ఉందా?

  ఇన్నాళ్లూ ఉత్తర కొరియా అధినేత కిమ్ జాంగ్ ఉన్ కు అగ్రరాజ్యం అమెరికాను సైతం ఎదిరించేంత ధైర్యం ఎలా వచ్చిందో అర్థం కాక అమెరికా బుర్ర బద్దలు చేసుకుంటోంది. అసలు ఉత్తరకొరియా లాంటి చిన్న దేశానికి అంతటి శక్తిమంతమైన ఆయుధాలు, అణు సాంకేతికత ఎలా వచ్చిందో అర్థం కాక కొట్టుమిట్టాడుతోంది. ఒకవేళ మిత్రదేశం చైనా ఏమైనా రహస్యంగా ఉత్తరకొరియాకు సహాయం చేస్తోందా? ఈ ప్రశ్న అమెరికాను పట్టిపీడిస్తోంది. తాజా ఘటనతో ఈ అనుమానాలు మరింత బలపడ్డాయి.

  గువామ్ దీవిపై దాడికి దిగనున్న చైనా?

  గువామ్ దీవిపై దాడికి దిగనున్న చైనా?

  అమెరికా రక్షణ శాఖ అధికారులు మంగళవారం ఓ సంచలన ప్రకటన చేశారు. చైనా యుద్ధవిమానాలు అమెరికాకు చెందిన గువామ్‌ దీవిపై ఏ విధంగా దాడిచేయాలి అనే అంశంపై తీవ్రంగా సాధన చేస్తున్నాయని పేర్కొన్నారు. ఇప్పటికే దక్షిణ చైనా సముద్రం విషయంలో చైనా-అమెరికాలు తలపడుతున్న సమయంలో ఈ ప్రకటన ఇరుదేశాల మధ్య ఉద్రిక్తతలను మరింత పెంచింది.

  హెచ్‌-6కే బ్యాడ్జర్‌ యుద్ధవిమానాలు...

  హెచ్‌-6కే బ్యాడ్జర్‌ యుద్ధవిమానాలు...

  ఇటీవల చైనాకు చెందిన హెచ్‌-6కే బ్యాడ్జర్‌ యుద్ధవిమానాలు తమ విన్యాసాలు మొదలుపెట్టాయి. సాధారణంగా ఈ విమానాలను చైనా బయటకు తీయదు. దీంతో అనుమానం వచ్చిన అమెరికా రక్షణ శాఖ అధికారులు ఈ విమానాలపై నిఘాపెట్టారు. ఆ తరువాత విషయం అర్థమై నివ్వెరపోయారు. అమెరికాకు చెందిన గువామ్‌ ద్వీపంపై ఏ విధంగా దాడి చేయాలనే విషయమై చైనా యుద్ధవిమానాలు సాధన చేస్తున్నట్లు అమెరికా గుర్తించింది.

  డౌట్ లేదు.. టార్గెట్.. గువామ్ ఐలాండ్..

  డౌట్ లేదు.. టార్గెట్.. గువామ్ ఐలాండ్..

  అసలు విషయం ఏమిటంటే.. సరిగ్గా ఇలాంటి యుద్ధవిమానాలనే చైనా ఇప్పటికే అమెరికాకు చెందిన హవాయి ద్వీపం సమీపంలోకి తరలించిందట. అంతేకాదు, ఆ విమానాలకు ఇటీవలే వెయ్యి కిలోమీటర్ల దూరం ప్రయాణించే క్షిపణులను కూడా అమర్చారట. ఇదంతా గువామ్‌ లక్ష్యంగానే జరుగుతున్నట్లు అమెరికా అధికారులు అనుమానిస్తున్నారు. మరోవైపు 2015లో చైనా పరీక్షించిన మధ్యశ్రేణి ఖండాంతర క్షిపణి డీఎఫ్‌-26ను ‘గువామ్‌ ఎక్స్‌ప్రెస్‌' అని ‘గువామ్‌ కిల్లర్‌ 'అని అప్పట్లో చైనా విశ్లేషకులు పేర్కొనడం కూడా అమెరికా ఇప్పుడు గుర్తుచేసుకుంటోంది.

  చైనా విమానాల చొరబాటు యత్నాలు...

  చైనా విమానాల చొరబాటు యత్నాలు...

  మరోవైపు తూర్పు చైనా, దక్షిణ చైనా సముద్రాల్లో డ్రాగన్‌ కంట్రీ అమెరికాను రెచ్చగొట్టే చర్యలకు దిగుతోంది. దీంతోపాటు జపాన్‌ వంటి దేశాల గగనతలంలోకి దూసుకువెళ్లేందుకు కూడా చైనా విమానాలు కొన్ని వందలసార్లు ప్రయత్నించాయి. గత ఏడాదే సుమారు 900 సార్లు చైనా విమానాలు ఈ రకంగా జపాన్‌ గగనతలం సమీపానికి వెళ్లాయి. దీంతోపాటు పసిఫిక్‌ ప్రాంతంలో కూడా అమెరికా గగనతల పరిధిలోకి చొరబడేందుకు చైనా విమానాలు పలుమార్లు ప్రయత్నించాయి. శత్రుదేశాల నిఘా వ్యవస్థల పరిధిని అంచనా వేసేందుకే చైనా ఇలా చేస్తోందని అమెరికా రక్షణ రంగ నిపుణులు భావిస్తున్నారు.

  అమెరికాకు అత్యంత కీలకమైన దీవి...

  అమెరికాకు అత్యంత కీలకమైన దీవి...

  గువామ్‌, హవాయి ద్వీపాలు అమెరికాకు అత్యంత కీలకమైన దీవులు. అమెరికా వైమానిక, నౌకాదళాల సంయుక్త స్థావరాలు ఈ దీవుల్లోనే ఉన్నాయి. ఇక్కడ లక్షా 60 వేల మంది ప్రజలు ఉన్నారు. వీరిలో 7 వేల మంది సైనిక సిబ్బందే. ఉత్తరకొరియా వంటి అమెరికా లక్ష్యాలకు గువామ్ ద్వీపం చాలా దగ్గరగా ఉంటుంది. ఇక్కడి నుంచి ఉత్తరకొరియా 2,100 మైళ్ల దూరంలో ఉంది. ఇక్కడ అమెరికాకు చెందిన అత్యంత కీలకమైన హెలికాప్టర్ల దళం ఉంది. దీంతోపాటు ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన, అణుయుద్ధం చేయగలిగిన బి-2స్టెల్త్‌ జెట్‌లను కూడా అమెరికా ఈ గువామ్ ద్వీపంలోనే భద్రపరిచింది.

  గువామ్, హవాయి ద్వీపాలపై దాడికి...

  గువామ్, హవాయి ద్వీపాలపై దాడికి...

  వియత్నాంతో యుద్ధసమయంలో కూడా అమెరికా యుద్ధవిమానాలు గువామ్ ద్వీపం నుంచే వియత్నాంకు వెళ్లి దాడులు చేశాయి. భవిష్యత్‌లో ఇక్కడ సైనిక కార్యకలాపాలను మరింత పెంచాలని అమెరికా భావిస్తోంది. అమెరికాకు అత్యంత కీలకమైన ఈ గువామ్ ద్వీపంపై 2013లోనే ఉత్తరకొరియా నియంత కిమ్‌ జాంగ్‌ ఉన్‌ కన్నేశాడు. అప్పట్లోనే గువామ్‌, హవాయి, దక్షిణకొరియాపై దాడికి అసరమైన పథకాలు సిద్ధం చేయాలని కిమ్ తన సైన్యాధికారులను ఆదేశించాడు. తర్వాత ఏమైందోగానీ అతడు తన వ్యూహాన్ని మార్చుకొన్నాడు. తాజాగా ఇప్పుడు చైనా కూడా అమెరికాకు చెందిన గువామ్‌ ద్వీపంపైనే గురిపెట్టినట్లు తేలడంతో ప్రత్యర్థి దేశాలు ఏకమవుతున్నాయా? అనే సందేహాలు అగ్రరాజ్యం అమెరికాకు కలుగుతున్నాయి. మరో వారంలో ట్రంప్‌ ఆసియా పర్యటన ఉండగా.. ఇప్పుడు ఈ విషయం వెలుగులోకి రావడం గమనార్హం.

  ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

  English summary
  Chinese jets have rehearsed bombing raids on Guam, according the US military - which now rates Beijing a bigger threat than North Korea. China's fleet of fighters and bombers conduct a daily "aggressive campaign" of sorties close to the US Pacific territory and incursions into Japanese air space. The news comes as the US and Russia each sent nuclear bombers near North Korea amid rising tensions with tyrant Kim Jong-un. But top brass are said to fear the real threat in the region is from China, which has been testing air defences in hundreds of provocative flights over the East China Sea, South China Sea and out over the Pacific. Chinese H-6K Badger bombers run “not infrequent” flights around Guam - close enough to launch cruise missiles at the US territory. Military officials said China is "practising attacks on Guam,” reports Defence News.

  Oneindia బ్రేకింగ్ న్యూస్
  రోజంతా తాజా వార్తలను పొందండి

  X