• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

కిమ్‌కు ఏమైంది, 60 రోజులుగా ఏమయ్యాడు: వ్యూహత్మక మౌనమేనా?

By Narsimha
|

ప్యాంగ్యాంగ్: ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్ జంగ్ ఉన్ రెండు మాసాలుగా నోరు మెదపడం లేదు. 60 రోజులుగా ఉత్తరకొరియా ఎలాంటి అణు పరీక్షలు కానీ, క్షిపణుల పరీక్షలు కానీ నిర్వహించడం లేదు. అయితే ఈ నిశ్శబ్దం వెనుక కిమ్ పెద్ద ప్లాన్ వేసి ఉంటారిని అమెరికా నిఘా వర్గాలు అనుమానిస్తున్నాయి.మరో వైపు కిమ్ ఆరోగ్యంపై కూడ అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ విషయమై డైలీ స్టార్ అనే సంస్థ నిర్వహించిన సర్వేలో ఇదే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయని అంటున్నారు.

ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్ జంగ్ ఉన్ కొంత కాలంగా ప్రపంచ దేశాలకు నిద్ర లేకుండా చేశారు. నిత్యం ఏదో ఒక సంచలనానికి కిమ్ జంగ్ ఉన్ కారణంగా మారారు. అంతేకాదు కిమ్ జంగ్ ఉన్ అమెరికాకు సవాల్ విసిరారు.

క్షిపణి పరీక్షలు, అణు పరీక్షలు నిర్వహిస్తూ ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్ జంగ్ ఉన్ జపాన్ కు కంటి మీద కునుకు లేకుండా చేశారు. జపాన్‌ లక్ష్యంగా కూడ క్షిపణి దాడులు చేశారు.

అయితే దక్షిణ కొరియా, జపాన్‌లు కూడ ఉత్తరకొరియాపై దాడికి సిద్దమంటూ సంకేతాలను పంపించాయి. ఆసియా దేశాల పర్యటనలో భాగంగా దక్షిణ కొరియా వేదికగా ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్ జంగ్ ఉన్‌కు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్రమైన హెచ్చరికలు చేశారు.

 60 రోజులుగా కిమ్ ఎందుకు సైలెంటయ్యారు

60 రోజులుగా కిమ్ ఎందుకు సైలెంటయ్యారు

60 రోజులుగా కిమ్ జంగ్ ఉన్ ఎందుకు సైలెంటయ్యారనే విషయమై ప్రస్తుతం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. నిత్యం తాను చేసే పనులతో వార్తల్లో నిలిచే కిమ్ జంగ్ ఉన్ ఎందుకు రెండు మాసాలుగా కనిపించడం లేదనే చర్చ సాగుతోంది. అంతేకాదు అణుపరీక్షలు, క్షిపణి పరీక్షలు కానీ నిర్వహించలేదు. అయితే దక్షిణ కొరియా వేదికగా ట్రంప్ చేసిన వ్యాఖ్యలపై కొరియా అధ్యక్షుడు కిమ్ జంగ్ ఉన్ మాత్రం తిప్పికొట్టారు. అయితే కిమ్ ఇంతకాలం పాటు మౌనంగా ఉండడం వెనుక పెద్ద ప్రణాళికే ఉండొచ్చని అమెరికా నిఘా వర్గాలు అనుమానిస్తున్నాయి. అయితే ఇతరత్రా కారణాలతో కిమ్ జంగ్ మౌనంగా ఉన్నారా అనే అనుమానాలు కూడ లేకపోలేదు.

కిమ్ ఆరోగ్యంపై వదంతులు

కిమ్ ఆరోగ్యంపై వదంతులు

ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్ జంగ్ ఉన్ ఆరోగ్యంపై వదంతులు కూడ ప్రచారంలో ఉన్నాయి.కిమ్ పలు ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నారని అభిప్రాయాలు వెలువడతున్నాయి. ఇటీవలే బయకొచ్చిన కిమ్ ఫోటోలు ఈ వాదనలకు మరింత బలాన్ని చేకూర్చుతున్నాయి. నీరసం, మొహంలో కొంచెం తేడాతో కిమ్ కనిపించారు. ఈ ఆరోగ్యం కారణాల రిత్యానే కిమ్ ఎటువంటి క్షిపణి పరీక్షలను నిర్వహించడం లేదని భావిస్తున్నారు. డైలీస్టార్ అనే సంస్థ నిర్వహించిన సర్వేలో ఇదే అభిప్రాయం వ్యక్తమైంది. కానీ, అసలు ఈ విషయమై స్పష్టత రావాల్సి ఉంది. వాస్తవాలు బయటకు రావాల్సి ఉంది.

 కిమ్‌ది వ్యూహత్మక మౌనమేనా?

కిమ్‌ది వ్యూహత్మక మౌనమేనా?

కిమ్ నిశబ్దాన్ని పాటించడం వెనుక ప్రణాళిక దాగి ఉందని, దాడి చేసే అవకాశాలు తగ్గలేదని అమెరికా నిఘా వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. అసలు కిమ్ రెండు మాసాలుగా మౌనంగా ఉండడం వెనుక బలమైన కారణాలు ఉండి ఉంటాయనే అనుమానాలను అమెరికా నిఘా సంస్థలు వ్యక్తం చేస్తున్నాయి. అయితే ఆ కారణాలు ఏమిటనే విషయమై అమెరికా నిఘా సంస్థలు వెలికితీసేందుకు ప్రయత్నాలు చేస్తున్నాయి.

 కొరియా ద్వీపకల్పంలో ప్రశాంత వాతావరణం

కొరియా ద్వీపకల్పంలో ప్రశాంత వాతావరణం

రెండు నెలలుగా ఉత్తరకొరియా క్షిపణి పరీక్షలు నిర్వహించకపోవడం వల్ల కొరియన్ ద్వీపకల్పంలో ఉద్రిక్తకర వాతావరణం కొద్దిగా చల్లబడింది. అయితే రెండు మాసాలకు ముందు ప్రతి రోజు ఏదో ఒక పరీక్ష నిర్వహిస్తూ కిమ్ జంగ్ ఉన్ వార్తల్లో నిలిచారు. అంతేకాదు ప్రపంచానికి పెను సవాల్ విసిరారు. ఉత్తరకొరియా అధ్యక్షుడు రెండు మాసాలుగా ఎలాంటి పరీక్షలు నిర్వహించకపోవడంతో పాటు ఎలాంటి రెచ్చగొట్టే ప్రకటనలు చేయకపోవడం వల్ల ప్రశాంత వాతావరణం నెలకొంది.

తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Eerie silence has fallen over the Korean Peninsula has not a single weapons test has been launched for more than two months.Spies have warned of imminent launches and detected rockets being moved around, but there has been not a peep from Kim.Questions have been raised about the 33-year-old’s health over the past years, with the North Korean leader's weight rubber banding as he lives a lavish lifestyle.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more