ఐఎస్ఐఎస్: సిగరేట్లు తాగారని.. చిత్రహింసలు పెట్టారు(వీడియో)

బాగ్దాద్: మానవ మృగాలైన ఐఎస్ఐఎస్ ఉగ్రవాదులు తమ సొంత జిహాదీలనే చావగొట్టారు. వారు చేసిన నేరం సిగరేట్లు తాగడమే. ఐఎస్ఐఎస్ నిబంధనల ప్రకారం.. తమ జిహాదీ గ్రూపులోని ఎవరూ కూడా సిగరేట్లు తాగకూడదు.

ఈ నిబంధనను ఉల్లంఘించి సిగరేట్లు తాగారని పలువురు జిహాదీలను సహచర జిహాదీ ఉగ్రవాదులు చిత్రహింసలకు గురిచేశారు. రక్తం వచ్చేలా కాళ్లతో తన్నుతూ, తుపాకీలతో కొట్టారు. ఈ దారుణ వీడియోను ఐఎస్ఐఎస్ ఉగ్రవాదులు విడుదల చేశారు.

ఆ వీడియోలు చూపించిన ప్రకారం సిగరెట్ తాగిన కొందరు సొంత ఉగ్రవాదులనే వరుసగా ఓ గోడకు ఎదురుగా కూర్చోబెట్టి ఉంచారు.

కొందరు ముసుగు ధరించిన ఉగ్రవాదులు వారిపై కాళ్లు పెట్టి ఎక్కుతూ దిగుతూ కనిపించారు. అంతేకాకుండా వారి చేతుల్లోని తుపాకీ బ్యారెల్‌తో చితక్కొట్టుడు కొట్టారు.

IS terrorists punish own fighters for smoking

మరొకరినైతే ఏకంగా తల బద్ధలయ్యేలా బాదారు. పిడిగుద్దులు కురిపించారు. పొగతాగడం ఇస్లాం నిబంధనలకు వ్యతిరేకమని, పొగతాగడమంటే మెల్లగా ఆత్యహత్య(స్లో స్యూసైడ్)కు పాల్పడటమేనని వారు భావిస్తారట.

ఇకపై ఎవరు ఎలాంటి దిక్కార చర్యలకు దిగకూడదని వారిని క్రూరంగా హింసించినట్లు ఆ ఉగ్రవాద సంస్థ పేర్కొంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+