గ్రహాంతర వాసులు ఉన్నారా?: నాసా సంచలన ఫోటో..
వాషింగ్టన్: గ్రహాంతరవాసులు నిజంగా ఉన్నారా? లేరా? అన్నది నేటికీ మిలియన్ డాలర్ల ప్రశ్న. కానీ అందుకు ఊతమిచ్చేలా ఏదో అంశం తెరపైకి రావడం.. దాని చుట్టూ చర్చ జరగడం ఏళ్లుగా జరుగుతున్నదే. తాజాగా నాసా మార్స్ రోవర్ అంగారకుడిపై తీసిన ఓ ఛాయాచిత్రం మరోసారి ఈ చర్చకు తావిచ్చింది.

ఫోటోను నిశితంగా పరిశీలిస్తే.. అదొక మహిళా యోధురాలి శిల్పాన్ని తలపిస్తోన్న రాయిగా కనిపిస్తోంది. ఈజిప్టు కళాకృతిని తలపించేలా ఆ శిల్పం ఉండటంతో.. ఆ విగ్రహం ఆ దేశానికే చెందినదై ఉంటుందని భావిస్తున్నారు. అయితే అది అంగారకుడి మీదకు ఎలా వెళ్లిందన్నది ఇప్పుడు ఆసక్తిని రేకెత్తిస్తోన్న అంశం. ఈ నేపథ్యంలో దీని వెనకాల గ్రహాంతర వాసులు ఉన్నారా? అన్న ప్రశ్న రేకెత్తుతోంది.












Click it and Unblock the Notifications