ఐఎస్ఐఎస్ మరో ఘాతుకం: ఇమామ్ పీక కోసి చంపారు
న్యూఢిల్లీ: ఇస్లామిక్ స్టేట్ ఆప్ ఇరాక్ అండ్ సిరియా (ఐఎస్ఐఎస్) మరో దురాగతానికి ఒడిగట్టింది. సిరియా ఈశాన్య ప్రాంతంలో అబుఖుయుత్ అనే గ్రామంలో ఐఎస్ఐఎస్ మిలిటెంట్లు ఓ ఇమామ్‌ను పీక కోసి చంపారు.
పాఠకుల కోసం ఫేస్‌బుక్ ద్వారా ఎప్పటికప్పుడు తాజా వార్తలు... లైక్ చేయండి.

దైవదూషణ చేశాడన్న నెపంతో అతడిని చంపినట్లు తెలుస్తోంది. ఈ ఇమామ్ ముగ్గురు కుమారులు కూడా ఐఎస్ఐఎస్ మిలిటెంట్లే. వారిలో ఒక వ్యక్తి ఇటీవలే మరణించాడు. గత కొంతకాలంగా ఐఎస్ఐఎస్ మిలిటెంట్లు చేస్తున్న మారణహోమం గురించి ఇమామ్... మిలిటెంట్లను బహిరంగంగానే దూషించాడు.
ఐఎస్ఐఎస్ మిలిటెంట్లు మిలిటెంట్లను చంపి వీడియోల రూపంలో ఇంటర్నెట్లో పెడుతున్న విషయం తెలిసిందే. ఐఎస్ఐఎస్ మిలిటెంట్లను దూషించాడనే కారణం చేత ఆయనను మిలిటెంట్లు నిర్బంధంలోకి తీసుకున్నారు. గురువారం నాడు ఆయన్ని చంపి వేశారు.












Click it and Unblock the Notifications