అబూ బకర్ పిరికివాడిలా చచ్చాడు: డేంజరస్ ఆపరేషన్ అంటూ డొనాల్డ్ ట్రంప్
Recommended Video
వాషింగ్టన్: ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఇరాక్ అండ్ సిరియా(ఐఎస్ఐఎస్) అగ్రనేత అబూ బకర్ అల్ బాగ్దాదీ మరణించినట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ధృవీకరించినట్లు బాగ్దాదీని అమెరికా దళాలు ఆదివారం హతమార్చినట్లు వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ట్రంప్ అధికారిక ప్రకటన చేశారు.

ఏడుస్తూ పరుగెత్తాడు..
బాగ్దాదీ తనంతట తానే పేల్చుకుని మృతి చెందినట్లు డొనాల్డ్ ట్రంప్ స్పష్టం చేశారు. భద్రతా దళాలు బాగ్దాదీని వెంబడించిన సమయంలో అతడు ఏడుస్తున్నట్లు గమనించాయని పేర్కొన్నారు. బాగ్దాదీ తన ముగ్గురు పిల్లలను చంపి తాను ఆత్మాహుతికి పాల్పడినట్లు ట్రంప్ తెలిపారు.

చివరకు పిరికివాడిలా..
వేలమంది అమాయకులను తన ఉగ్రదాడులతో చంపిన బాగ్దాదీ.. చివరి క్షణాల్లో మాత్రం పిరికివాడిగా మరణించినట్లు ట్రంప్ వెల్లడించారు. అమెరికా సేనలు దాడి చేసేలోగానే అతడు ఆత్మాహుతికి పాల్పడినట్లు తెలిపారు.

డేంజరస్ ఆపరేషన్..
బాగ్దాదీని మట్టుబెట్టేందుకు కొన్ని వారాల నుంచి నిఘా పెట్టామని, రెండు, మూడు మిషన్స్ ఫెయిల్ అయ్యాక.. ఎట్టకేలకు మరో ప్రమాదకర మిషన్ లో అతడు మృతి చెందాడని తెలిపారు. మిషన్ సందర్భంగా అమెరికా వైమానిక సేనలు రష్యా గగనతలంపై నుంచి ఎగిరాయని చెప్పారు.
కంట్రోల్ రూం నుంచే..
అమెరికాలో ఏర్పాటు చేసిన కంట్రోల్ రూం నుంచే ఆపరేషన్ మొత్తాన్ని వీక్షించినట్లు ట్రంప్ తెలిపారు. బాగ్దాదీకి సంబంధించిన కీలక సమాచారాన్ని సిరియన్ కుర్దులు అమెరికాకు ఇచ్చారని చెప్పారు. అమెరికా ఆపరేషన్ కు సహకరించిన రష్యా, సిరియా, ఇరాక్ లకు డొనాల్డ్ ట్రంప్ ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు.












Click it and Unblock the Notifications