విమానం కూల్చివేత: పైలట్ ను బంధించారు
డమాస్కస్: ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఇరాక్ అండ్ సిరియా (ఐఎస్ఐఎస్) ఉగ్రవాదులు సిరియా యుద్ధ విమానాన్ని కూల్చి వేశారు. ఆ విమానం పైలట్ ను బంధించామని, అతను తమ వద్ద ఉన్నాడని శనివారం ఇస్లామిక్ స్టేట్ఉగ్రవాదులు ప్రకటించారు. పైలట్ ను విడిచి పెట్టడానికి వారు ఎలాంటి షరతులు విధించలేదు.
శుక్రవారం సిరియా యుద్ధ విమానం ఎగురుతున్న సమయంలో ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులు దానిని కూల్చివేశారు. ఆ విమానం పైలట్ ఆజామ్ ఇద్ ను ఉగ్రవాదులు బంధించారు. ఈ విషయాన్ని సిరియా మానవ హక్కుల సంస్థ వెల్లడించింది. గత కొద్ది రోజులుగా సిరియా ఉగ్రవాదులు సిరియా యుద్ధ విమానాలను కూల్చి వేస్తున్నారు.

సిరియా మీద కక్ష తీర్చుకోవడానికి ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులు ఎదురు చూస్తున్నారు. వీలుచూసుకుని చాకచక్యంగా సిరియా యుద్ధ విమానాలను కూల్చి వేస్తున్నారు. విషయం తెలుసుకున్న సిరియా అధికారులు పైలట్ ను ప్రాణాలతో విడిపించుకోవడానికి ప్రయత్నిస్తున్నారు.












Click it and Unblock the Notifications