ఐఎస్ రాక్షసం: బాలుడిని రిమోట్‌తో పేల్చేశారు
లండన్: ఇస్లామిక్ స్టేట్(ఐఎస్ఐఎస్) ఉగ్రవాదులు మరో దారుణానికి పాల్పడ్డారు. ఓ నాలుగేళ్ల బాలుడిని రిమోట్ కంట్రోల్ డివైజ్‌ను ఉపయోగించి పేల్చేశారు. ఈ దారుణం ఇరాక్‌లోని అల్ షిర్కత్ జిల్లాలో చోటు చేసుకుంది.
ఇస్లామిక్ ఉగ్రవాదులు ఆ బాలుడి శరీరానికి బాంబులు అమర్చి పేల్చడంతో అతని శరీర భాగాలు పూర్తిగా విచ్ఛిన్నమైపోయాయి. ఉగ్రవాదులు పేలుడు కోసం రిమోట్ కంట్రోల్ డివైజ్‌ను ఉపయోగించారని డెయిలీ మెయిల్ తన కథనంలో వెల్లడించింది.

ఇటీవల ఇద్దరు ఐఎస్ఐఎస్ ఉగ్రవాదులను హతమార్చిన నేపథ్యంలో ఈ బాలుడిని హతమార్చినట్లు తెలుస్తోంది. ఇంతకుముందు ఆ బాలుడి తండ్రిని చంపేశారు.
ఇసా డేర్ అనే బ్రిటీష్ బాలుడు చంపుతామని బెదిరింపులకు పాల్పడిన ఒక రోజు తర్వాత ఈ బాలుడిని ఉగ్రవాదులు హత్య చేశారు. కాగా, అల్ షిర్కత్ జిల్లా గత జూన్ నుంచి ఉగ్రవాదుల స్వాధీనంలో ఉండిపోయింది. ఇక్కడ ఇప్పటికే పదుల సంఖ్యలో వృద్ధులు, చిన్నారులు ఉగ్రవాదుల చేతిలో హతమయ్యారు.
-
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్‌కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!! -
అమెరికాలో విమాన ప్రమాదం: రన్ వే పై అడ్డంగా -
కొంపలు అంటుకున్నాయ్: 4 నెలల కనిష్టానికి బంగారం ధరలు












Click it and Unblock the Notifications