ఒళ్లు గగుర్పొడిచే వీడియో: జర్నలిస్ట్‌ గొంతు కోశారు

ISIS Says It Killed Steven Sotloff After U.S. Strikes in Northern Iraq
ఇరాక్: ఇరాక్ దేశంలో ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఇరాక్ అండ్ సిరియా (ఇసిస్) తీవ్రవాదులు తమ చెరలో ఉన్న మరో అమెరికా జర్నలిస్ట్‌ను గొంతు కోసి చంపుతున్నట్లుగా ఉన్న వీడియోను మంగళవారం సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఆ జర్నలిస్ట్ పేరు స్టీవెన్ సోల్టాఫ్‌.

‘ఎ సెకెండ్‌ మెసేజ్‌ టు అమెరికా'పేరుతో విడుదలైన ఈ వీడియోలో ఇరాక్‌ విషయంలో అమెరికా అనవసర జోక్యానికి సాట్లాఫ్‌ మూల్యం చెల్లించుకుంటున్నట్లు పేర్కొన్నారు. శిక్షను అమలు చేస్తున్నప్పుడు తీసిన వీడియోగా పేర్కొన్నారు.

తమ చెరలో ఉన్న మరో బ్రిటిష్ జర్నలిస్ట్ డేవిడ్ హేనిస్ కూడా చంపేస్తామని మిలిటెంట్లు ఈ వీడియోలో హెచ్చిరించారు. ఈ వీడియో ప్రపంచ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ఈ వీడియోపై స్పందించిన అమెరికా ఇది నిజమో, కాదో తమ నిఘావర్గాలు తేలుస్తాయని ప్రకటించింది.

<center><iframe width="100%" height="360" src="//www.youtube.com/embed/GdIB1p-n1Lc?feature=player_detailpage" frameborder="0" allowfullscreen></iframe></center>

ఇరాక్‌లో కారు బాంబు పేలి 13 మంది మృతి

ఇరాక్ రాజధానిలో ఆత్మాహుతి దాడులు సాధారణమైపోయాయి. ఇరాక్ రాజధాని బాగ్దాద్‌లో ఓ కారు బాంబు పేలుడు ఘటన జరిగింది. ఈ పేలుడులో 13 మంది మరణించగా 45 మంది తీవ్రంగా గాయపడ్డారు. పేలుళ్ల ధాటికి సమీపంలోని పలు భవనాలు, వాహనాలు కుప్పకూలాయి. 1370 మంది గాయపడ్డారు. కాగా కారుబాంబు పేలుడులో గాయపడిన వారిని సహాయక సిబ్బంది ఆస్పత్రికి తరలించారు. వీరిలో కొందరి పరిస్థితి విషమంగా ఉందని పోలీసులు తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+