లండన్ దాడి మా పనే: ఇస్లామిక్ స్టేట్ ప్రకటన

Posted By:
Subscribe to Oneindia Telugu

లండన్: లండన్ పార్లమెంటు వద్ద ఉగ్రదాడికి ఇస్లామిక్ స్టేట్ బాధ్యత వహించింది. ఈ దాడికి పాల్పడిన వ్యక్తి తమవాడేనని ఐసిస్ తెలిపింది. ఐసిస్ మౌత్ పీస్ 'అమాక్' ద్వారా ఈ ప్రకటన చేసింది.

బ్రిటన్ పార్లమెంట్‌పై ఉగ్రగురి: బీభత్సం, 4గురు మృతి, దుండగుడి కాల్చివేత

బుధవారం బ్రిటన్ పార్లమెంటు ఎదుట జరిగిన కాల్పుల ఘటన కలకలం రేపిన విషయం తెలిసిందే. ఈ ఘ‌ట‌న జ‌రిగిన వెంటనే లండన్‌లో హై అల‌ర్ట్ ప్ర‌క‌టించిన భ‌ద్రతా బ‌ల‌గాలు అక్క‌డి కీలక ప్రాంతాల్లో భద్రతను కట్టుదిట్టం చేశారు.

Islamic State claims responsibility for London attack

అడుగడుగునా తనిఖీలు నిర్వహించి ప‌లువురిని అరెస్టు చేశారు. ఆ దాడుల‌కు సంబంధించి ఏడుగురు అనుమానితులను అరెస్టు చేశామని చెప్పారు. బ్రిట‌న్ పార్ల‌మెంట్ ద‌గ్గ‌ర దుండ‌గుడు జ‌రిపిన కాల్పుల్లో ఓ పోలీస్ ఆఫీస‌ర్ తో పాటు మరో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు.

అనంత‌రం థేమ్స్ బ్రిడ్జ్‌పై కారుతో బీభ‌త్సం సృష్టించిన ఘ‌ట‌న‌లో మ‌రో 40 మందికి గాయాల‌య్యాయని, వారికి చికిత్స అందిస్తున్నామ‌ని అక్క‌డి అధికారులు తెలిపారు. లండ‌న్‌తో పాటు బ‌ర్మింగ్‌హామ్ సిటీలో జ‌రిగిన త‌నిఖీల్లో ఈ అరెస్టులు జ‌రిగాయి.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
The Islamic State has claimed responsibility for the London attack. The IS through its various channels has claimed that the attacker was their soldier. The claim was made through their mouthpiece Amaq.
Please Wait while comments are loading...