యుఎస్ వైమానిక దాడి: ఐఎస్ డిప్యూటీ లీడర్ అంతం

వాషింగ్టన్: ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులలో నెంబర్ -2 గా ఇంతకాలం రాజ్యమేలిన ఫాదిల్ అహమ్మద్ అల్-హయాలీ అలియాస్ మాజీ ముతాజ్ ను అమెరికా సైన్యం అంతం చేసింది. అతను ప్రయాణిస్తున్న వాహనంపై వైమానిక దాడులు జరిపి హతమార్చింది.

ఫాదిల్ అహమ్మద్ అల్-హయాలీ వైమానిక దాడులలో అంతం అయ్యాడని అమెరికా వైట్ హౌస్ అధికార ప్రతినిధి నెడ్ ఫ్రైస్ ఓ ప్రకటనలో తెలిపారు. ఈనెల 18వ తేదిన ఇరాక్ లోని మోసూల్ సమీపంలో ఓ వాహనంలో వెళుతున్న సమయలో తమ సైన్యం దాడి చేసిందని అన్నారు.

అమెరికా వైమానిక దాడులలో ఫాదిల్ అహమ్మద్ తో పాటు అబూ అబ్దుల్లా అనే మరో ఉగ్రవాది అంతం అయ్యాడని ఫ్రైస్ స్పష్టం చేశారు. ఇస్లామిక్ స్టేట్ తీవ్రవాద సంస్థలో ఫాదిల్ అహమ్మద్ రెండో ముఖ్య నాయకుడు.

Islamic State deputy leader killed in sir strike in Iraq

ఇతను ఆయుధాలు, పేలుడు పదార్థాలు, వాహనాలను ఇరాక్-సిరియా దేశాల మధ్య తరలించడంలో కీలకంగా వ్యవహరించేవాడు. అంతే కాకుండ ఇస్లామిక్ స్టేట్ అగ్రనాయకుడు అబూబకర్ ఆల్ బాగ్దాదీకి అత్యంత సన్నిహితుడు.

ఇరాక్, సిరియా దేశాలలో ఐఎస్ఐఎస్ ఉగ్రవాద కార్యకలాపాలకు ఇన్ చార్జ్ గా వ్యవహరించేవాడని అమెరికా ప్రతినిధి నెడ్ ఫ్రైస్ తెలిపారు. ఫాదిల్ అహమ్మద్ గతంలో ఆల్ ఖైదాలో పని చేశాడని చెప్పారు. 2014 జూన్ నెలలో మోసూల్ నగరాన్ని ఇస్లామిక్ స్టేట్ తీవ్రవాదులు స్వాధీనం చేసుకునే సమయంలో ఇతను కీలకపాత్ర పోషించాడని అమెరికా అధికారులు తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+