వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

‘గే’ అంటూ 10 మందిని చంపేసిన ఇస్లామిక్ స్టేట్

|
Google Oneindia TeluguNews

బీరూట్: ఇస్లామిక్ స్టేట్ (ఐఎస్ఐఎస్) ఉగ్రవాదులు మరో దారుణానికి తెగబడింది. సిరియాలో గేలు అనే అనుమానంతో 10 మందిని అతి దారుణంగా కాల్చి చంపేశారు. అందరూ చూస్తున్న సమయంలో 10 మంది హత్యకు గురైనారు.

తొమ్మిది మంది పురుషులు, ఒక బాలుడిని చంపేశారని సిరియన్ అబ్జర్వేటరీ ఫర్ హ్యూమన్ రైట్స్ అనే సంస్థ తెలిపింది. హోమ్స్ రాష్ట్రంలోని రస్తాన్ అనే పట్టణంలో ఈ 10 మందిని తీసుకు వచ్చి హోమోసెక్యువల్స్ అంటు నినాదాలు చేసి చంపేశారు.

Islamic State executes 10 people accused of being gay in Syria'

వీరిని చంపే సమయంలో ఎవ్వరూ వీడియోలు, ఫోటోలు తియ్యకుండా ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులు తగిన జాగ్రతలు తీసుకున్నారని, ముందుగానే అక్కడ ఉన్న వీడియో కెమెరాలు, మొబైల్స్ ధ్వంసం చేశారని ఆ సంస్థ వెల్లడించింది.

సిరియా అధ్యక్షుడు బషర్ అల్ అసద్ కు విశ్వాసులుగా ఉండటం, స్వలింగ సంపర్కం, చేతబడి చెయ్యడం ఇస్లామిక్ స్టేట్ అధిపత్యం ఉన్న ప్రాంతాలలో నేరం. అలా చేసిన వారికి బహిరంగంగా మరణ శిక్ష విధిస్తారు. గతంలో స్వలింగ సంపర్కులను పెద్ద పెద్ద భవనాల మీద నుంచి కిందకు పడేసి తుపాకులతో కాల్చి చంపిన విషయం తెలిసిందే.

English summary
The Islamic State (IS) jihadist group executed nine men and a boy it accused of being gay in central and northern Syria.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X