వైమానిక దాడులు: 30 మంది ఐఎస్ ఉగ్రవాదులు అంతం
సిరియా: ఇస్లామిక్ స్టేట్ తీవ్రవాదులను అంతం చెయ్యడానికి అమెరికా బలగాలు రంగం సిద్దం చేస్తున్నాయి. ఇప్పటికే పలు సార్లు వైమానిక దాడులు జరిపి అనేక మంది ఐఎస్ఐఎస్ తీవ్రవాదులను అంతం చేశారు. శుక్రవారం జరిగిన వైమానిక దాడులలో 30 మంది తీవ్రవాదులు అంతం అయ్యారు.
శుక్రవారం అమెరికా వైమానిక దళాలు అలెప్పోకు సమీపంలోని రెండు ఉగ్రవాద స్థావరాల మీద బాంబుల వర్షం కురిపించాయి. ఒక స్థావరంలో ఉన్న 18 మంది, ఇంకోక స్థావరంలో ఉన్న 12 మంది ఐఎస్ఐఎస్ తీవ్రవాదులు అంతం అయ్యారు. పలువురు స్థానికులు గాయపడ్డారు.

బాంబుల దాడులు జరుగుతున్న సమయంలో స్థానికంగా నివాసం ఉంటున్న వారు ఇండ్ల నుండి బయటకు వచ్చి పరుగు తీశారు. ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని నిర్జనప్రదేశంలోకి వెళ్లారు. అత్యాచారాలు, శిరచ్చేదనాలు, లూటీలు, బాంబు దాడులు చేస్తున్న ఐఎస్ఐఎస్ అగడాలకు అడ్డు అదుపు లేకుండ పోయింది.
డమాస్కస్ సమీపంలోని రెండు వేల సంవత్సరాల చరిత్ర ఉన్నపల్ మీరా నగరాన్ని ఐఎస్ఐఎస్ తీవ్రవాదులు స్వాదీనం చేసుకున్నారు. ఈ నగరంలో ఉన్న పురాతన కట్టడాలు, పర్యాటక కేంద్రాలను ద్వంసం చేస్తామని శుక్రవారం ఐఎస్ఐఎస్ తీవ్రవాదులు హెచ్చరించారు.












Click it and Unblock the Notifications