వాట్సాప్ ద్వారా సెక్స్ బానిసలను అమ్మేస్తోన్న ఐసిస్

Subscribe to Oneindia Telugu

ఇరాక్ : ప్రపంచవ్యాప్తంగా నరమేథం సృష్టిస్తోన్న ఐసిస్ మహిళల పట్ల అమానుష చర్యలకు పాల్పడుతోంది. ఓవైపు ఉగ్ర పంజా విసురుతూనే మహిళలపై దారుణమైన అఘాయిత్యాలకు తెగబడుతోంది. తమవద్ద బంధీలుగా ఉన్న మహిళలను సెక్స్ బానిసలుగా వాడుకుంటూ చిత్రవధకు గురిచేస్తోన్న ఐసిస్ ఆ తర్వాత వారిని అమ్మకానికి పెడుతోంది.

ఫేస్ బుక్, వాట్సాప్ వంటి సోషల్ మీడియాలను తమ ఉగ్ర కార్యకలాపాలకు ఎప్పటినుంచో అడ్డాగా మార్చుకున్న ఐసిస్, అమ్మాయిల అమ్మకానికి సంబంధించి కూడా ఇవే మాధ్యమాలను వాడుకుంటోంది. తాజాగా ఐసిస్ నుంచి 'అమ్మాయిల అమ్ముతున్నాం.. కొనుక్కోండి' అంటూ వాట్సాప్, టెలిగ్రామ్ ద్వారా మెసేజ్ లు వస్తుండడంతో ప్రపంచవ్యాప్తంగా ఇస్లామిక్ ఉగ్రవాదుల చర్యలు మరోసారి చర్చనీయాంశం అయ్యాయి.

Islamic State terrorists use WhatsApp, Telegram to sell women, girls as sex slaves

ఐసిస్ నుంచి వస్తోన్న మెసేజ్ లను పరిశీలిస్తే.. 'మా దగ్గర ఓ 12 ఏళ్ల కన్నెపిల్ల అమ్మకానికి సిద్దంగా ఉంది. అందమైన ఆ అమ్మాయికి ఇప్పటికే రూ.9 లక్షల రేటు పలుకుతోంది, రేటు మరింత పెరిగే అవకాశాలు కూడా ఉన్నాయి. త్వరపడి అమ్మాయిని సొంతం చేసుకోండి' అంటూ సోషల్ మీడియా ద్వారా మెసేజ్ లను చేరవేస్తున్నారు ఇస్లామిక్ ఉగ్రవాదులు.

ఇదిలా ఉంటే తమ వద్ద బంధీలుగా ఉన్న వేలమంది యాజీదీ మహిళల్లో ఇప్పటికే 3వేల మంది మహిళలను ఐసిస్ అమ్మేసినట్టు తెలుస్తోంది. తమవద్ద బంధీలుగా ఉన్న ప్రతీ యాజీదీ మహిళ వివరాలను సంక్షిప్తంగా రికార్డు చేసుకుంటున్న ఐసిస్ ఎవరైనా తప్పించుకునే ప్రయత్నం చేస్తే అత్యంత పాశవికంగా హత్యలకు తెగబడుతోంది.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
The advertisement on the Telegram app is as chilling as it is incongruous: A girl for sale is "Virgin. Beautiful. 12 years old.... Her price has reached $12,500 and she will be sold soon."

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి