Israel-Palestine : ఇజ్రాయెల్ పై పాలస్తీనా మెరుపుదాడులు-కౌంటర్ అటాక్ ప్రారంభం

ఇజ్రాయెల్, పాలస్తీనా మధ్య దశాబ్దాలుగా సాగుతున్న పోరు ఇవాళ మరో మలుపు తిరిగింది. తాజాగా గాజా స్ట్రిప్ నుంచి దాదాపు 5 వేల రాకెట్లు ఇజ్రాయెల్ పై విరుచుకుపడటం, మిలిటెంట్ల చొరబాట్లతో ఆ దేశం తీవ్రంగా స్పందించింది. పాలస్తీనాపై యుద్ధం ప్రకటన చేసింది. పాలస్తీనా మిలిటెంట్ల చొరబాటుతో పాటు తెల్లవారుజామున డజన్ల కొద్దీ రాకెట్లను ప్రయోగించడంతో ఒక మహిళ మృతిచెందింది.

పాలస్తీనా నుంచి తీవ్రమైన రాకెట్ దాడుల నేపథ్యంలో దేశంలో యుద్ధ ప్రకటన చేసిన ఇజ్రాయెల్ తమ పౌరుల్ని ఇళ్లలోనే ఉండాలని కోరింది. పాలస్తీనా నుంచి చాలా మంది ఉగ్రవాదులు ఇజ్రాయెల్ భూభాగంలోకి చొరబడ్డారని సైన్యం పేర్కొంది. జెరూసలేంలో వైమానిక దాడి సైరన్‌లు మోగడంతో గాజా స్ట్రిప్‌లోని లక్ష్యాలను ఛేదిస్తున్నట్లు అది పేర్కొంది. ఇజ్రాయెల్ సరిహద్దు పట్టణమైన స్డెరోట్‌లో యూనిఫాం ధరించిన ముష్కరులుగా కనిపించిన వీడియోలు కలకలం రేపాయి. ఈ వీడియోలలో కాల్పుల శబ్దం వినబడుతోంది.

Israel declares war against Palestine after 5,000 rocket attacks from gaza

ఈ తెల్లవారుజామున 30 నిమిషాలకు పైగా సాగిన దాడుల్లో గాజాలో 70 కిలోమీటర్ల దూరంలో ఉన్న టెల్ అవీవ్ వరకు గాలిలో రాకెట్ల శబ్దాలు వినిపించాయి, అలాగే సైరన్‌లు కూడా వినిపించాయి. దక్షిణ ఇజ్రాయెల్‌లోని ఓ భవనంపై రాకెట్ పడటంతో 70 ఏళ్ల మహిళ తీవ్రంగా గాయపడినట్లు ఇజ్రాయెల్ వార్తా ఏజెన్సీ తెలిపింది. ఇజ్రాయెల్‌ను వ్యతిరేకిస్తున్న హమాస్ సైనిక విభాగ నాయకుడు మొహమ్మద్ డీఫ్.. ఇజ్రాయెల్‌పై కొత్త సైనిక చర్యను ప్రారంభించినట్లు చెప్పారు.

Israel declares war against Palestine after 5,000 rocket attacks from gaza

"ఆపరేషన్ అల్-అక్సా స్టార్మ్" ప్రారంభించడానికి శనివారం తెల్లవారుజామున ఇజ్రాయెల్‌పై 5 వేల రాకెట్లను ప్రయోగించామని మహమ్మద్ డీఫ్ చెప్పారు. ఇజ్రాయెల్‌ను ఎదుర్కోవాలని పాలస్తీనియన్లందరినీ కోరారు. అనేక ఇజ్రాయెల్ హత్య ప్రయత్నాల నుండి బయటపడిన డీఫ్ సాధారణంగా బయట కనిపించరు. ఇప్పుడు కూడా ఆయన సందేశం రికార్డ్ విడుదల చేశారు.గాజాతో ఇజ్రాయెల్ సరిహద్దులో వారాలపాటు తీవ్ర ఉద్రిక్తతలు, ఇజ్రాయెల్ ఆక్రమిత వెస్ట్ బ్యాంక్‌లో భారీ పోరాటాల తర్వాత ఈ రాకెట్ ప్రయోగాలు చోటు చేసుకున్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+