ఇజ్రాయెల్‌, హమాస్‌ పోరుకు బ్రేక్‌- కాల్పుల విరమణకు అంగీకారం- ఈజిప్ట్‌ దౌత్యంతో

11 రోజులుగా ఇజ్రాయెల్‌ దళాలు పాలస్తీనాపై సాగిస్తున్న యుద్దానికి తాత్కాలిక బ్రేక్ పడింది. హమాస్‌పై ఇజ్రాయెల్‌ చేస్తున్న దాడుల్లో పాలస్తీనాలోని అమాయక పౌరులు చనిపోతున్న నేపధ్యంలో ప్రపంచవ్యాప్తంగా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఓవైపు అమెరికా మద్దతిస్తున్నా అంతర్జాతీయంగా విమర్శలు వెల్లువెత్తడంతో ఇజ్రాయెల్‌ ఇరుకునపడింది. ఈ సమయంలో అరబ్‌ దేశాల తరఫున ఈజిప్ట్‌ నెరిపిన దౌత్యం ఫలించడంతో ఇరు వర్గాలు కాల్పుల విరమణ ప్రకటించాయి.

Recommended Video

    Israel-Hamas ఇజ్రాయెల్‌ VS పాలస్తీనా యుద్దానికి తాత్కాలిక బ్రేక్ | Palestinians | Oneindia Telugu
     ఇజ్రాయెల్‌, హమాస్‌ పోరుకు బ్రేక్‌

    ఇజ్రాయెల్‌, హమాస్‌ పోరుకు బ్రేక్‌

    11 రోజులుగా పాలస్తీనాలోని గాజా స్ట్రిప్‌తో పాటు హమాస్ తలదాచుకుంటున్న భూగర్బ బంకర్లను లక్ష్యంగా చేసుకుని ఇజ్రాయెల్‌ దళాలు భారీ ఎత్తున దాడులకు దిగాయి. ఇందులో దాదాపు 250 మంది చిన్నారులు, మహిళలతో పాటు సాధారణ పాలస్తీనా పౌరులు మృత్యువాత పడ్డారు. దీంతో ప్రపంచవ్యాప్తంగా విమర్శలు వెల్లువెత్తాయి. చివరికి అమెరికా సూచనలు, గల్ఫ్‌ దేశాల దౌత్యంతో ఇజ్రాయెల్‌ వెనక్కి తగ్గింది. హమాస్‌తో కాల్పుల విరమణకు అంగీకరించింది.

     ఫలించిన ఈజిప్ట్‌ దౌత్యం

    ఫలించిన ఈజిప్ట్‌ దౌత్యం

    నిన్నఅర్ధరాత్రి జరిగిన సెక్యూరిటీ కేబినెట్ సమావేశం తర్వాత ఈజిప్ట్‌ ప్రతిపాదన ప్రకారం హమాస్‌తో కాల్పుల విరమణకు అంగీకరిస్తున్నట్లు ఇజ్రాయెల్‌ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు కార్యాలయం అధికారిక ప్రకటన విడుదల చేసింది. మిలటరీ ఛీఫ్‌తో పాటు ఇతర రక్షణ నిపుణుల సూచనల ఆధారంగా ఈ ప్రతిపాదనకు అంగీకారం తెలుపుతున్నట్లు ఈ ప్రకటనలో వెల్లడించింది. 11 రోజుల పాటు సాగిన పోరులో హమాస్‌పై పైచేయి సాధించినట్లు పేర్కొంది. ఈ ప్రకటన వెలువడిన మూడు గంటల తర్వాత అంటే అర్ధరాత్రి 2 గంటల నుంచి కాల్పుల విరమణ అమల్లోకి వచ్చిందని ఈజిప్ట్‌ ప్రభుత్వ ఛానల్ మేనా న్యూస్ ప్రకటించింది.

     హమాస్‌ కీలక ప్రకటన

    హమాస్‌ కీలక ప్రకటన

    అటు హమాస్‌ కూడా కాల్పుల విరమణకు అంగీకరిస్తున్నట్లు ఓ ప్రకటన విడుదల చేసింది. దీనికి ఇజ్రాయెల్‌ కట్టుబడి ఉన్నంత వరకూ ఈ ఒప్పందం అమల్లో ఉంటుందని పేర్కొంది. ఈ మేరకు హమాస్‌ అధికార ప్రతినిధి తాహెర్‌ నౌనౌ ఓ ప్రకటన చేశారు. దీంతో అధికారికంగా కాల్పుల విరమణ అమల్లోకి వచ్చింది. గతంలో 2014లో 50 రోజుల పాటు ఇజ్రాయెల్‌, హమాస్‌ మద్య పోరు సాగింది. ఆ తర్వాత నుంచీ ఇరువైపుల నుంచీ కవ్వింపు చర్యలు సాగుతూనే ఉన్నాయి. తాజాగా మే 10న జెరూసలేం వైపు హమాస్‌ రాకెట్లు వదలడంతో మొదలైన పోరు ఈ కాల్పుల విరమణతో ముగిసింది.

     అంతర్జాతీయ ఒత్తిడితో తగ్గిన ఇజ్రాయెల్‌

    అంతర్జాతీయ ఒత్తిడితో తగ్గిన ఇజ్రాయెల్‌

    హమాస్‌కు వ్యతిరేకంగా చేపట్టిన ఆపరేషన్లో భాగంగా ఇజ్రాయెల్ వందలాది వైమానిక దాడులు చేసింది. హమాస్ సైనిక మౌలిక సదుపాయాలు, విస్తారమైన సొరంగం నెట్‌వర్క్‌ లక్ష్యంగా చేసుకుని ఈ దాడులు చేసింది. అదే సమయంలో ఇజ్రాయెల్ నగరాలపై హమాస్, ఇతర మిలిటెంట్ గ్రూపులు 4,000 రాకెట్లను వదిలాయి. ఇందులో వందలాది మంది చనిపోయారు. గాజా ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకారం, 65 మంది పిల్లలు మరియు 39 మంది మహిళలతో సహా కనీసం 230 మంది పాలస్తీనియన్లు ఈ పోరులో చనిపోయారు.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+