ఇజ్రాయెల్-హమాస్ రాజీ ఒప్పందం-కాల్పులకు నాలుగురోజుల బ్రేక్-బందీల విడుదల..
పశ్చిమాసియాలో శాంతి దిశగా మరో అడుగు పడింది. దాదాపు నెలన్నర రోజులుగా దాడులు చేసుకుంటున్న ఇజ్రాయెల్-హమాస్ ఎట్టకేలకు నాలుగు రోజుల సంధికి అంగీకరించాయి. దీని ప్రకారం పాలస్తీనా అక్టోబర్ 7న బందీలుగా చేసుకున్న వారిని విడుదల చేస్తుంది. అలాగే ఇజ్రాయెల్ కూడా 150 మంది పాలస్తీనా బందీల్ని విడుదల చేయనుంది. ఈ మేరకు ఇరువర్గాలు ప్రకటన చేశాయి. దీంతో గాజాలో తాత్కాలికంగా శాంతియుత పరిస్ధితులు నెలకొనబోతున్నాయి.
ఇజ్రాయెల్ ప్రధాన మంత్రి బెంజమిన్ నెతన్యాహు క్యాబినెట్ దాదాపు రాత్రంతా సమావేశం తర్వాత ఈ ఒప్పందాన్ని ఆమోదించింది. ఇదే కఠినమైన నిర్ణయమని, కానీ సరైన నిర్ణయమని కేబినెట్ భేటీలో నెతన్యాహు తన మంత్రులకు తెలిపారు.ఈ ఒప్పందం ప్రకారం కనీసం 50 మంది ఇజ్రాయెల్, విదేశీ బందీలను , మహిళలు, పిల్లలను విడుదల చేస్తారు. ప్రతిగా సైనిక కార్యకలాపాలలో నాలుగు రోజుల విరామం ఇస్తారు.

విడుదలైన ప్రతి 10 మంది అదనపు బందీలకు, ఒక అదనపు రోజు సంధి ఉంటుంది. హమాస్ మానవతా సంధిని స్వాగతిస్తూ ఒక ప్రకటన విడుదల చేసింది. ఇజ్రాయెల్ జైళ్ల నుండి 150 మంది పాలస్తీనియన్లు కూడా విడుదల కానున్నారు. ఈ లెక్కన దాదాపు ఏడు వారాల తర్వాత మొత్తం యుద్ధం నిలిచిపోవాలి. ఈ సంధిలో భూమిపై పూర్తి కాల్పుల విరమణ, దక్షిణ గాజాపై ఇజ్రాయెల్ వైమానిక కార్యకలాపాలలో విరామం ఉంటుంది.
ఖతార్ మధ్యవర్తిత్వంతో ఇజ్రాయెల్, పాలస్తీనా ఈ ఒప్పందం చేసుకున్నట్లు తెలుస్తోంది. ఈ ఒప్పందంలో ఇజ్రాయెల్ సైనికుల విడుదలను కూడా చేర్చాలని, ఒప్పందానికి వ్యతిరేకంగా తాను ఓటు వేస్తానని జాతీయ భద్రత కోసం కరడుగట్టిన మంత్రి ఇతామర్ బెన్-గ్విర్ తెలిపారు. అక్టోబర్ 7న హమాస్ దాడుల్లో సుమారు 1,200 మందిని చనిపోయారు. అలాగే 240 మంది బందీలుగా హమాస్ పట్టుకుపోయింది. దాదాపు నెలన్నర రోజుల పోరాటం తర్వాత ఇప్పుడు ఈ సంధి చేసుకున్నారు.












Click it and Unblock the Notifications