క్రీస్తు జన్మస్థానంలో నరమేథానికి ప్లాన్: పాలస్తీనా గ్రూపులే టార్గెట్‌గా 21 రాకెట్స్: ఇజ్రాయెల్ దాడి.
జెరూసలేం: ఇజ్రాయెల అనూహ్య నిర్ణయాన్ని తీసుకుంది. పాలస్తీనియన్ ఇస్లామిక్ జిహాద్ సంబంధించిన ఆత్మాహూతి దళ స్థావరాలపై విరుచుకుపడింది. రాకెట్లను ప్రయోగించింది. గాజాలను వదిలి పెట్టలేదు. గాజాలో జిహాదీ గ్రూపులు ఏర్పాటు చేసుకున్న ఉగ్రవాద శిబిరాలపై రాకెట్ల వర్షాన్ని కురిపించింది. స్థానిక కాలమనం ప్రకారం.. ఆదివారం రాత్రి చోటు చేసుకున్న ఈ వైమానిక దాడుల్లో ఎంతమంది మరణించారనేది ఇంకా తెలియరాలేదు.
పాలస్తీనియన్ ఇస్లామిక్ గ్రూపులపై
సిరియా రాజధాని డమాస్కస్ సహా గాజా స్ట్రిప్ వెంట కొత్తగా వెలిసిన పాలస్తీనియన్ ఇస్లామిక్ జిహాదీ గ్రూపులను లక్ష్యంగా చేసుకుని రాకెట్లను సంధించింది. డమాస్కస్, గాజా స్ట్రిప్‌లల్లో ఏర్పాటు చేసుకున్న స్థావరాలు, శిబిరాల్లో ఆత్మాహూతి దళాలను సిద్ధం చేస్తున్నట్లు పక్కా సమాచారం అందడం, వారి లక్ష్యం మొత్తం తమ దేశంలో నరమేథాన్ని సృష్టించడమేనంటూ తెలియడంతో ఇజ్రాయెల్ ఈ అనూహ్య దాడికి దిగింది.
ఆదివారం అర్ధరాత్రి..
ఆదివారం రాత్రి 11:25 నిమిషాల సమయంలో ఇస్లామిక్ డిఫెన్స్ ఫోర్సెస్ (ఐడీఎఫ్) బలగాలు డమాస్కస్ దక్షిణ ప్రాంతంలోని అల్ అడ్లెయా సహా గాజా స్ట్రిప్‌పై వైమానిక దాడులు చేసిన విషయాన్ని ఇజ్రాయెల్ సైన్యాధికారులు ధృవీకరించారు. పలు రాకెట్లను సంధించినట్లు వెల్లడించారు.ఈ దాడుల్లో ఎంతమంది సంభవించిన ప్రాణ నష్టం గురించి ఇంకా ఎలాంటి వివరాలు అందలేదని ఐడీఎఫ్ ప్రతినిధి స్పష్టం చేశారు. పాలస్తీనా ఇస్లామిక్ జిహాదీ గ్రూపు స్థావరాలను లక్ష్యంగా చేసుకుని దాడులు చేసినట్లు తెలిపారు.
లక్ష్యాలను ధ్వంసం చేశాయంటూ నిర్ధారణ..
తాము ప్రయోగించిన రాకెట్లు, మిస్సైళ్లు లక్ష్యాలను ఛేదించాయని ఐడీఎఫ్ ప్రతినిధి తెలిపారు. గాజా స్ట్రిప్‌లోని బెయిట్ లాహియా డమాస్కస్‌లోని అల్ అడ్లెయా ప్రాంతాల్లో పెద్ద ఎత్తున పాలస్తీయన్ ఇస్లామిక్ జిహాదీ గ్రూపులు మారణ హోమాన్ని సృష్టించడానికి సిద్ధపడ్డాయంటూ తమకు సమాచారం ఉందని తెలిపారు. వారిని లక్ష్యంగా చేసుకుని దాడులు చేశామని, ఆయా స్థావరాలను చాలావరకు ధ్వంసం చేసి ఉండొచ్చని తెలిపారు. పాలస్తీనా ఇస్లామిక్ గ్రూపులు జెరూసలేంపై ఆత్మాహూతి దాడులకు పాల్పడే అవకాశం ఉందని తెలియడం వల్ల దాడులు చేసినట్లు తెలిపారు.
-
కుప్పకూలుతున్న అమెరికా ఫైటర్ జెట్స్.. వెనక్కు తగ్గిన ట్రంప్..!! -
ఇరాన్ అధ్యక్షుడికి ప్రధాని మోదీ ఫోన్.. కీలక విషయాలపై చర్చ -
ఇజ్రాయెల్ కు షాకిచ్చిన ట్రంప్, ఇప్పుడు ఏం చేద్దాం? -
ఇరాన్ కు జి7 దేశాల తీవ్ర హెచ్చరిక! -
నతాంజ్ అణు కేంద్రంపై బాంబుల వర్షం.. భారీ పేలుళ్లతో దద్దరిల్లిన ఇరాన్! -
ఇరాన్ ను లేపేద్దాం రండి: ప్రపంచ దేశాలకు నెతన్యాహు పిలుపు -
40 ఏళ్లలో లేని అతిపెద్ద పసిడి పతనం. 1983 సీన్ రిపీట్! -
పాతాళానికి బంగారం ధరలు- రంజాన్ పండగ వేళ -
తమిళనాడులో ఆ పార్టీదే అధికారం: విజయ్ రాకతో మారిన ఈక్వేషన్లు -
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం











Click it and Unblock the Notifications