ఏకంగా అధ్యక్షుడి భవనంపైనే మెరుపుదాడి
Israel: గాజాలో హమాస్, లెబనాన్‌లో హెజ్బొల్లా మిలిటెంట్ గ్రూపులపై వరుసబెట్టి దాడులు సాగిస్తూ వచ్చిన ఇజ్రాయెల్ మరో అడుగు ముందుకేసింది. ఇప్పుడు తాజాగా సిరియాను లక్ష్యంగా చేసుకుంది. ఏకంగా ఆ దేశాధ్యక్షుడి భవనంపైనే మెరుపుదాడికి దిగింది. ఈ ఘటనతో డమాస్కస్‌లో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
రెండున్నర సంవత్సరాలుగా ప్రతీకారదాడులతో ఏడాదిన్నర కాలంగా మధ్య తూర్పు దేశాలు భగ్గుమంటోన్న విషయం తెలిసిందే. రోజుల తరబడి దాడులు ప్రతిదాడులు కొనసాగుతోన్నాయి. ఈ రీజియన్ చల్లారట్లేదు. ఇజ్రాయెల్, గాజా, లెబనాన్ రోజూ పరస్పర దాడులకు దిగుతోన్నాయి.

గాజాలో హమాస్, లెబనాన్‌లో హెజ్బొల్లా మిలిటెంట్ గ్రూపులను లక్ష్యంగా చేసుకుని ఇజ్రాయెల్ మిస్సైళ్లు, రాకెట్లను సంధిస్తూ వస్తోంది. ఈ దాడుల్లో ఈ రెండు గ్రూప్‌లకు చెందిన పెద్ద తలకాయలు తెగిపడ్డాయి. హసన్ నస్రల్లా, యాహ్యా సిన్వర్, ఇస్మాయిల్ హనియె, సమీ తాలెబ్ అబ్దల్లా, ఫతా షరీఫ్, మర్వాన్ ఇసా, ఇబ్రహిం వకీల్, అహ్మద్ వహ్బీ.. వంటి సీనియర్ నాయకులు, కమాండర్లు హతం అయ్యారు. హషెమ్ షఫియొద్దీన్, హుస్సేన్ అలీ హజీమాను మట్టుపెట్టింది ఇజ్రాయెల్.
ఇప్పుడు సిరియాను లక్ష్యంగా చేసుకోవడం ప్రాధాన్యతను సంతరించుకుంది. డమాస్కస్‌లోని అధ్యక్ష భవనం సమీపంలో ఈ దాడి సంభవించింది. ఈ విషయాన్ని ఇజ్రాయెల్ ప్రధాన మంత్రి బెంజమిన్ నెతన్యాహు స్వయంగా ప్రకటించారు. ఈ తెల్లవారుజామున ఆయన ఓ వీడియో విడుదల చేశారు.
డ్రూజ్ కమ్యూనిటీ సభ్యులను రక్షించుకోవడంలో భాగంగా ఈ దాడిని చేపట్టినట్లు వివరించారు. వారి ప్రాణరక్షణకు తాము కట్టుబడి ఉన్నామని బెంజమిన్ నెతన్యాహు పునరుద్ఘాటించారు. డ్రూజ్ సామాజికవర్గం.. సిరియా, లెబనాన్, ఇజ్రాయెల్‌లలో విస్తరించివుంది. సిరియా, లెబనాన్‌లల్లో ఇజ్రాయెల్‌కు అనుకూలంగా పని చేస్తోందనే గుర్తింపు ఉంది.
గత ఏడాది డిసెంబర్‌లో బషర్ అల్-అసద్‌ను పడగొట్టిన సున్నీ ఇస్లామిస్టులు డ్రూజ్ సామాజిక వర్గాన్ని లక్ష్యంగా చేసుకోవడం పట్ల ఇజ్రాయెల్ అభ్యంతరం వ్యక్తం చేసింది. దీనికి తగిన మూల్యాన్ని చెల్లించుకోక తప్పదనీ హెచ్చరించింది. దీనికి అనుగుణంగా ఇప్పుడు ఇజ్రాయెల్ వైమానిక దళం.. డమాస్కస్‌పై బాంబులతో హోరెత్తించింది. ఏకంగా సిరియా అధ్యక్షుడి భవనాన్ని లక్ష్యంగా చేసుకుంది.
అదే సమయంలో డ్రూజ్ సామాజిక వర్గానికి చెందిన సెల్ఫ్ డిఫెన్స్ ఫైటర్లు.. సున్నీ ఇస్లామిస్టులపై ఎదురుదాడికి దిగారు. సహ్నాయా టౌన్‌లో భారీ ఎత్తున ఈ దాడులు- ఎదురుదాడులు కొనసాగుతున్నాయి. ప్రస్తుతానికి పరిస్థితి అదుపులో ఉందని సిరియా అంతర్గత వ్యవహారాల శాఖ వెల్లడించింది.
-
1967 తర్వాత తొలిసారి.. ‘ఈద్’ ప్రార్థనలు బంద్! -
రంజాన్ వేళ జెరుసలేమ్ పై ఇరాన్ క్షిపణి దాడి..వీడియో -
పాతాళానికి బంగారం ధరలు- రంజాన్ పండగ వేళ -
తమిళనాడులో ఆ పార్టీదే అధికారం: విజయ్ రాకతో మారిన ఈక్వేషన్లు -
పల్నాడు, సింహాద్రి ప్రయాణీకులకు రైల్వే గుడ్ న్యూస్, ఇక నుంచి..!! -
3000 ఏళ్ల సంప్రదాయం.. యుద్ధం మధ్యే నూతన సంవత్సరం -
విడాకులపై మెగా డాటర్ "నిహారిక" కామెంట్స్.. అసలు కాంటాక్ట్ కూడా లేదు ?? -
40 ఏళ్లలో లేని అతిపెద్ద పసిడి పతనం. 1983 సీన్ రిపీట్! -
ఏప్రిల్ నెలలో సింహరాశి, కన్యారాశి జాతక ఫలం -
'దురంధర్ 2' ఓ చెత్త సినిమా: స్టార్ హీరోయిన్ -
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
కొత్త పెన్షన్లు, మహిళలకు కొత్త వరాలు - రైతు భరోసా ఇక నుంచి..!!












Click it and Unblock the Notifications