ఇటలీ మతగురువుపై ఐఎస్ఐఎస్ కాల్పులు
ఢాకా: బంగ్లాదేశ్ లో పలు ప్రాంతాలలో విదేశీయులపై ఉగ్రవాదులు తుపాకులతో దాడులు చేస్తున్నారు. తాజాగా ఇటలీకి చెందిన ఓ మతగురువు మీద ముగ్గురు ఉగ్రవాదులు కాల్పులు జరిపి హత్య చెయ్యడానికి ప్రయత్నించారని బంగ్లాదేశ్ పోలీసులు అన్నారు.
తూర్పు బంగ్లాదేశ్ లో బుధవారం ఉదయం ఇటలీకి చెందిన మత గురువారం పీరో అనే మతగురువు మీద హత్యాయత్నం జరిగిందని, ఆయన ఆసుపత్రిలో మృత్యువుతో పోరాటం చేస్తున్నారని ఇన్స్ పెక్టర్ రోబియల్ అలామ్ తెలిపారు.
ఇన్స్ పెక్టర్ రోబియల్ అలామ్ తెలిపిన వివరాల ప్రకారం దినాజ్ పూర్ పట్టణంలో డాక్టర్ పీరో సైకిల్ మీద వెళుతున్న సమయంలో ముగ్గురు ఉగ్రవాదులు ఆయన మీద అతి సమీపం నుంచి కాల్పులు జరిపారని అన్నారు.

ఇస్లామిక్ స్టేట్ (ఐఎస్ఐఎస్) ఉగ్రవాదులు పీరోను హత్య చెయ్యడానికి ప్రయత్నించారని ఇన్స్ పెక్టర్ రోబియల్ అలామ్ చెప్పారు. ఉగ్రవాదుల కోసం గాలిస్తున్నామని అన్నారు. ఇటలీకి చెందిన పీరో క్యాథలిక్ సంస్థలో కొంత కాలం డాక్టర్ గా పని చేశారని మరో మతగురువు ఆంథోని సెన్ చెప్పారు.
అదే విధంగా బంగ్లాదేశ్ లో బుధవారం మరో రెండు ప్రాంతాలలో విదేశీయులను లక్ష్యంగా చేసుకుని ఉగ్రవాదులు కాల్పులు జరిపారని, అయితే ఈ దాడిలో ఎవ్వరూ గాయపడలేదని పోలీసు అధికారులు తెలిపారు. ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులే కాల్పులు జరిపారని పోలీసు అధికారులు అంటున్నారు.












Click it and Unblock the Notifications