జో బైడెన్ టీంకు విషెస్ చెప్పిన ఇవాంకా ట్రంప్: తండ్రి చివరి స్పీచ్ వింటూ కన్నీరు!
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కుమార్తె ఇవాంకా ట్రంప్.. కాబోయే అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌కు శుభాకాంక్షలు తెలిపారు. బైడెన్ ప్రభుత్వం విజయవంతం కావాలని అన్నారు. అధికారిక సలహదారు హోదాలో ఇవాంకా.. దేశ ప్రజలకు వీడ్కోలు సందేశాన్నిచ్చారు.
అధ్యక్షుడు జో బైడెన్, ఉపాధ్యక్షురాలు కమలా హ్యారీస్, వారి సిబ్బందికి ప్రజా సేవకు సంసిద్ధులను చేసే శక్తి సామార్థ్యాలను ప్రసాదించాల్సిందిగా భగవంతుడిని కోరుకుంటున్నట్లు ఇవాంకా తెలిపారు. అధ్యక్షుడి సలహాదారుగా వ్యవహరించడం తనకు జీవిత కాలంలో దక్కిన అపూర్వమైన గౌరవమని ఇవాంకా పేర్కొన్నారు.

తాను అమెరికా ప్రజల తరపున నిలిచి పోరాడేందుకు వైట్‌హౌస్‌కు వచ్చానని, ఆ పనిలో విజయవంతమైనట్లే భావిస్తున్నానని 39ఏళ్ల ఇవాంకా ట్రంప్ వ్యాఖ్యానించారు. కాగా, అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ దేశ ప్రజలకు చివరి సందేశం ఇచ్చిన సమయంలో ఇవాంకా కన్నీటిపర్యంతమయ్యారు.
అమెరికా 46వ అధ్యక్షుడాయన. ప్రమాణ స్వీకార కార్యక్రమం క్షణాలు సమీపిస్తోన్న వేళ.. డొనాల్డ్ ట్రంప్.. తన అధికారిక నివాసం వైట్‌హౌస్‌ను వీడారు. భార్య మెలానియాతో కలిసి ఎయిర్‌ఫోర్స్ వన్‌లో ఫ్లోరిడాకు బయలుదేరి వెళ్లారు. ఆయన
ఫ్లోరిడా పామ్ బీచ్ సమీపంలోని మార్-ఎ-లాగోలో ఆయన నివసించనున్నారు. ఇక ఆయన కేరాఫ్ అడ్రస్ అదే కాబోతోంది. డొనాల్డ్ ట్రంప్.. వైట్‌హౌస్‌ను వీడిన వెంటనే జో బిడెన్ ఓ ట్వీట్ చేశారు. ఫ్లోరిడా దిశగా ఎయిర్‌ఫోర్స్ వన్ టేకాఫ్ తీసుకున్న వెంటనే జో బిడెన్ ఈ ట్వీట్ చేయడం ప్రాధాన్యతను సంతరించుకుంది. అమెరికాలో నేడు కొత్త రోజు అంటూ ట్వీట్ చేశారు.
కాస్సేపట్లో అధ్యక్షుడిగా బాధ్యతలను స్వీకరించబోతోన్న జో బిడెన్‌కు మాజీ అధ్యక్షుడు, డెమొక్రటిక్ పార్టీ నేత బరాక్ ఒబామా శుభాకాంక్షలు తెలిపారు. ఇక అమెరికాలో జో బిడెన్ టైమ్ ప్రారంభమైందనే సందేశాన్ని ఇచ్చారాయన. తన స్నేహితుడు జో బిడెన్‌కు శుభాకాంక్షలు చెబుతున్నానంటూ ట్వీట్ చేసిన ఆయన.. ఇక జో బిడెన్ సమయం వచ్చిందని పేర్కొన్నారు. దిసీజ్ యువర్ టైమ్.. అంటూ కామెంట్ చేశారు.
-
షాకింగ్ వీడియో: అమెరికా F-15 ఫైటర్ జెట్ ను పేల్చేసిన ఇరాన్ -
భారత్ కు బిగ్ షాక్- హార్ముజ్ జలసంధి పూర్తిగా మూసివేయనున్న ఇరాన్ -
డొనాల్డ్ ట్రంప్ సడన్ యూటర్న్- యుద్ధ విరామం -
40 ఏళ్లలో లేని అతిపెద్ద పసిడి పతనం. 1983 సీన్ రిపీట్! -
పాతాళానికి బంగారం ధరలు- రంజాన్ పండగ వేళ -
తమిళనాడులో ఆ పార్టీదే అధికారం: విజయ్ రాకతో మారిన ఈక్వేషన్లు -
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
త్వరలో తిరుపతి, హైదరాబాద్‌కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు!












Click it and Unblock the Notifications