జాదవ్‌ను బెలూచిస్తాన్‌లో అరెస్ట్ చేయలేదు, పాక్‌లో రహస్య జైళ్లు: బెలూచిస్తాన్ నేత సంచలనం

Posted By:
Subscribe to Oneindia Telugu

న్యూఢిల్లీ: కులభూషణ్ జాదవ్‌ను పాకిస్తాన్ బెలూచిస్తాన్‌లో అరెస్టు చేయలేదని బెలూచ్ నేత హిర్బయేర్ మారీ తెలిపారు. భారత మాజీ నేవీ అధికారి జాదవ్‌ ఓ గూఢచారి అని పాక్ ఆరోపిస్తూ అరెస్టు చేసింది. అతను మరణశిక్షను ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే.

చదవండి: 1962లో భారత్‌పై చైనా యుద్ధానికి షాకింగ్ కారణాలు, నెహ్రూకు ఎంత చెప్పినా నమ్మలేదు!

అక్రమంగా పాక్‌లో అడుగుపెట్టిన జాదవ్‌ను బెలూచిస్థాన్‌లో అరెస్టు చేసినట్లు పాకిస్తాన్ చెబుతోంది. అయితే జాదవ్‌ను అసలు బెలూచిస్థాన్‌లో అరెస్టు చేయనేలేదని ఆ ప్రాంత నేత చెబుతుండటం గమనార్హం. ఇరాన్‌ నుంచి కిడ్నాప్‌ చేసి జాదవ్‌ను పాక్‌ తీసుకొచ్చారని మారీ అన్నారు.

చదవండి: జైల్లో కులభూషణ్ జాదవ్‌కు చిత్రహింసలు? శశిథరూర్‌కూ అనుమానం, ఉగ్రవాదేనని పాక్

బెలూచిస్తాన్‌లో అరెస్ట్ చేయలేదు

బెలూచిస్తాన్‌లో అరెస్ట్ చేయలేదు

భారత్‌కు చెందిన జాదవ్‌ను బలూచిస్థాన్‌లో అరెస్టు చేయనేలేదని, నిజం చెప్పాలంటే పాక్‌కు చెందిన కొన్ని మతపరమైన సంస్థలు అతడిని ఇరాన్‌ నుంచి తీసుకొచ్చి పాక్‌ బలగాలకు అప్పగించాయని, గతంలో కూడా ఇలాంటి ఘటనలు జరిగాయని వారు చెప్పారు.

అప్పుడు తలలు నరికి పంపించేవారు

అప్పుడు తలలు నరికి పంపించేవారు

అఫ్గాన్‌లోని బెలూచ్‌ శరణార్థులను మతపరమైన అతివాదులు అపహరించి ఐసిస్ లేదా పాక్‌ సైన్యానికి అమ్ముతుంటారని చెప్పారు. 1970, 80ల్లో తాలిబన్‌ ఉగ్రవాదులు బెలూచ్‌ శరణార్థులను చంపేసి, వారి తలలను నరికి ఆ ఫొటోలను ఐసిస్ లేదా పాక్‌ సైన్యానికి పంపేవారని, అలా వారి నుంచి ఉగ్రవాదులు డబ్బులు తీసుకునేవారన్నారు.

జాదవ్ ఫ్యామిలీ పట్ల దారుణం, బెలూచ్ స్త్రీలదీ అదే పరిస్థితి

జాదవ్ ఫ్యామిలీ పట్ల దారుణం, బెలూచ్ స్త్రీలదీ అదే పరిస్థితి

ఇక జాదవ్‌, అతడి కుటుంబసభ్యుల భేటీపై స్పందిస్తూ.. ఈ ఘటనతో బెలోచ్‌ మహిళల పట్ల పాక్‌ ఎంత అమానవీయంగా ప్రవర్తిస్తుందో ప్రపంచ దేశాలకు అర్థమవుతోందన్నారు. కన్న కొడుకును చూసేందుకు భారత్‌ నుంచి వచ్చిన ఓ మహిళతోనే పాకిస్తాన్ అలా ప్రవర్తించిందంటే ఇక బెలోచ్‌ ఖైదీలు, మహిళలు, చిన్నారుల పట్ల ఎలా ప్రవర్తిస్తుందో అర్థం చేసుకోవచ్చునని చెప్పారు.

పాక్‌లో రహస్య జైళ్లు, ఎలా మరణిస్తారో కూడా తెలియదు

పాక్‌లో రహస్య జైళ్లు, ఎలా మరణిస్తారో కూడా తెలియదు

ఖైదీలను వేధించేందుకు దేశవ్యాప్తంగా రహస్య జైళ్లు కూడా ఉన్నాయని వారు చెప్పారు. అక్కడ విచారించే సమయంలో చాలా మంది ఖైదీలు చనిపోతారని, కానీ వారు ఎలా మరణిస్తారో ఎవరికీ తెలియదని సంచలన వ్యాఖ్యలు చేశారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Baloch leader Hyrbyair Marri has stated that Kulbhushan Jadhav was "never arrested from Balochistan", in fact he was, "abducted from Iran by Pakistani state-sponsored religious proxies and handed over to Pakistani forces."

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి