Pakistan Train Hijack: పాకిస్తాన్ లో రైలు హైజాక్-బందీలుగా 100 మంది..!
పాకిస్తాన్ లో ఇవాళ ఓ అరుదైన ఘటన చోటు చేసుకుంది. ఇప్పటివరకూ విమానాల హైజాక్ చూస్తుంటాం. కానీ ఇవాళ పాకిస్తాన్ లో ఓ ఎక్స్ ప్రెస్ రైలును తీవ్రవాదులు అపహరించుకుపోయారు. స్వతంత్ర బలోచిస్తాన్ కోసం పోరాడుతున్న బలోచ్ విముక్తి సైన్యం ఇవాళ జాఫర్ ఎక్స్ ప్రెస్ రైలును హైజాక్ చేసింది. ఈ సందర్భంగా ఎదురు తిరిగిన ఆరుగురు ప్రయాణికుల్ని కాల్చిచంపినట్లు తెలుస్తోంది. అలాగే మరో 100 మంది ప్రయాణికుల్ని బందీలుగా చేసుకుంది.
జాఫర్ ఎక్స్‌ప్రెస్‌ను హైజాక్ చేసింది తామేనని బలూచ్ లిబరల్ ఆర్మీ బాధ్యత ప్రకటించుకుంది. ఈ మేరకు విడుదల చేసిన ప్రకటనలో .. పాకిస్తాన్ రైల్వేలు నడుపుతున్న రైలును హైజాక్ చేసినట్లు తెలిపింది. ఇందులో దాదాపు 100 మంది ప్రయాణికులను బందీలుగా ఉంచినట్లు తెలుస్తోంది. ఈ ఉగ్రవాద సంస్థ రైలును తన ఆధీనంలోకి తీసుకుని కనీసం ఆరుగురు సైనిక సిబ్బందిని కాల్చి చంపినట్లు తెలుస్తోంది. ఈ ఆపరేషన్‌ను BLA మజీద్ బ్రిగేడ్ ఫతే స్క్వాడ్, STOS నిర్వహిస్తున్నాయని ఆ బృందం ప్రతినిధి వెల్లడించారు. ఏదైనా సైనిక చర్యకు ప్రయత్నిస్తే బందీలందరినీ చంపేస్తామని బీఎల్ఏ హెచ్చరించింది.

The Baloch Liberation Army hijacked the Pakistan Jaffar Express train and took more than around 500 passengers hostage.#FailedStatePakistan #TNLiquorScam #AskMalavika
— PRAJAKTA SINGH (@Prajakta_Singh2) March 11, 2025
#BamBamBhole #BaidaTrailer #RashmikaMandanna #HrithikRoshan #SalmanKhan pic.twitter.com/0ZIzjIq2Gg
ఆక్రమిత దళాలు ఏదైనా సైనిక చర్యకు ప్రయత్నిస్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని బలోచ్ ఆర్మీ సంస్ద హెచ్చరించింది. వందలాది మంది బందీలను ఉరితీస్తామని, ఈ రక్తపాతానికి బాధ్యత పూర్తిగా ఆక్రమిత దళాలదే అని ఉగ్రవాద సంస్థ తెలిపింది. దీంతో పాకిస్తాన్ ప్రభుత్వం ఇరుకునపడింది. బందీల్ని సురక్షితంగా విడిపించేందుకు ప్రధాని సహా మంత్రులు అధికారులతో చర్చిస్తున్నారు. కొంతకాలంగా సాగుతున్న బలోచిస్తాన్ విముక్తి ఆందోళనలకు పరాకాష్టగా ఈ ఘటన చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది.












Click it and Unblock the Notifications