కాశ్మీర్‌లో ఉగ్ర కుట్రలు: ఆఫ్ఘాన్ తాలిబన్లతో పాకిస్థాన్ జేషే మొహమ్మద్ చీఫ్ మసూద్ అజహర్ భేటీ
న్యూఢిల్లీ/కాబూల్: ఆప్ఘనిస్థాన్‌లో తాలిబన్ల రాజ్యం మొదలైన నాటి నుంచి ఉగ్రవాదులంతా మరోసారి తమ కార్యకలాపాలను విస్తృతం చేసేందుకు సిద్ధమవుతున్నట్లుగా కనిపిస్తోంది. ఆప్ఘనిస్థాన్‌ను తమ ఆధీనంలోకి తీసుకున్న తర్వాత తాలిబన్లు పలు జైళ్లలో ఖైదీలుగా ఉన్న అనేకమంది ఉగ్రవాదులను విడిపించడం గమనార్హం. అంటే, తాలిబన్లు ఇతర ఉగ్రవాదులతో కలిసి పనిచేసేందుకు సుముఖంగా ఉన్నట్లు అర్థమవుతోంది.

తాలిబన్లతో పాక్ ఉగ్ర నేత చర్చలు
ఈ క్రమంలో తాలిబన్ల ఆధీనంలో ఉన్న ఆప్ఘనిస్థాన్‌ను పాకిస్థాన్ తర్వాత మరో నివాసంగా చేసుకునేందుకు ఐఎస్, లష్కరే తొయిబా లాంటి ఉగ్రవాద సంస్థలు సిద్దమవుతున్నాయి. ఇక ఇప్పుడు పాకిస్థాన్ ప్రేరేపిత ఉగ్రవాదులకు ఆప్ఘనిస్థాన్ కేంద్రంగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీంతో భారత్‌కు ఉగ్రముప్పు పొంచివున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే పాకిస్థాన్‌కు చెందిన ఉగ్రవాద సంస్థ జేషే మొహమ్మద్ చీఫ్ మౌలానా మసూద్ అజహర్.. ఆప్ఘన్ తాలిబన్లతో కలవడం కలకలం రేపుతోంది. మౌలానా మసూద్ అజహర్ జమ్మూకాశ్మీర్‌లో ఉగ్రవాద కార్యకలాపాలను విస్తృతం చేసేందుకు తాలిబన్ల సాయం కోరినట్లుగా తెలుస్తోంది.

కాశ్మీర్ వ్యాలీలో ఉగ్ర కార్యకలాపాలే లక్ష్యం..
తాలిబన్ పొలిటికల్ కమిషన్ అధిపతి ముల్లా అబ్దుల్ ఘనీ బరాదర్ తోపాటు పలువురు తాలిబన్ నేతలను కాందహార్ చేరుకున్న మసూద్ అజహర్ కలిసినట్లు సమాచారం. కాశ్మీర్ వ్యాలీలో జైషే మొహ్మద్ కార్యకలాపాలను విస్తృతం చేసేందుకు తాలిబన్ల సహకారం కావాలని వారిని కోరినట్లు తెలిసింది. ఆగస్టు 15న కాబూల్ తోపాటు మొత్తం ఆప్ఘనిస్థాన్‌ను తాలిబన్లు ఆక్రమించుకోవడం తమకు ఎంతో ఆనందంగా ఉందని ఆ సమయంలో మసూద్ అజహర్ ప్రకటించడం గమనార్హం. తాలిబన్లు అమెరికా మద్దతుతో నడుస్తున్న ఆప్ఘన్ ప్రభుత్వంపై విజయం సాధించారని హర్షం వ్యక్తం చేశారు. అంతేగాక, పాకిస్థాన్ కేంద్ర కార్యాలయం నుంచి మసూద్ అజహర్ శుభాకాంక్షలు కూడా తెలియజేశారు.

భారత జైలు నుంచి అలా విడుదలైన మసూద్ అజహర్
కాగా, ఆఫ్ఘానిస్థాన్‌లో తాలిబాన్లు అధికారంలో ఉన్నప్పుడు 1999లో ఖాట్మాండ్ నుంచి లక్నోకి బయల్దేరిన ఇండియన్ ఎయిర్ లైన్స్ విమానాన్ని పాకిస్థాన్ టెర్రరిస్టులు హైజాక్ చేసి కాందహార్‌కు తీసుకెళ్లి ప్రయాణికులకు బదులుగా మన దేశంలోని జైలులో శిక్ష అనుభవిస్తున్న జైషే మొహమ్మద్ ఉగ్రసంస్థ చీఫ్ జైషే మొహమ్మద్ చీఫ్ మసూద్ అజహర్ సహా ముగ్గురని ఉగ్రవాదులు విడిపించుకున్న విషయం తెలిసిందే. అయితే రెండు దశాబ్దాల తర్వాత ఇప్పుడు అప్ఘానిస్తాన్ మళ్లీ తాలిబన్ల హస్తగతమైన వేళ.. జైషే మొహమ్మద్ శ్రేణుల్లో సంతోషం వెల్లివిరిస్తోంది. తాలిబాన్ల అండ చూసుకుని కాశ్మీర్ లోయలో ఉగ్రవాద కార్యకలాపాలు పెంచాలని జైషే మొహమ్మద్ భావిస్తోంది.
Recommended Video

తాలిబన్లతో స్నేహంతో భారత్‌లో ఉగ్ర కార్యకలాపాలు
నిఘా వర్గాల సమాచారం ప్రకారం ఆగస్టు మూడో వారంలోనే కాందహార్ చేరుకున్న మసూద్ అజహర్.. తాలిబన్ సహ వ్యవస్థాపకుడు ముల్లా అబ్దుల్ ఘనీ బరాదర్ సహా పలువురు కీలక తాలిబాన్ నేతలను కలిసి కాశ్మీర్ లోయలో ఉగ్రవాదాన్ని ప్రేరేపించడానికి సహకరించాల్సిందిగా కోరారు. తాలిబాన్, జైషే మొహమ్మద్‌లు భావజాల సారూప్యమున్న సంస్థలుగా పేర్కొంటుంటారు. ఇస్లామిక్ చట్టం అయిన షరియాను తమకు తగినట్లుగా అన్వయించుకోవడంలో తాలిబాన్, జైషే మహ్మద్ సైద్ధాంతిక సహచరులుగా పరిగణించబడ్డారు. మసూద్ అజహర్ 1999లో భారత జైలు నుంచి విడుదలైన తర్వాత జైషే మొహమ్మద్ ఉగ్రవాద సంస్థను స్థాపించాడు. జమ్మూకాశ్మీర్‌లో ఉగ్ర కార్యకలాపాలను పెంచేందుకు నాటి నుంచి నేటి వరకు ప్రయత్నాలు కొనసాస్తూనే ఉంది.
-
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
లోకసభ, అసెంబ్లీ స్థానాల పెంపు - ఏపీ..తెలంగాణలో పెరిగేది ఇలా, మహిళల స్థానాలు ఇవే..!! -
PM Modi: ఇరాన్ వార్ తో మనకు కష్టాలే..! సిద్ధంగా ఉండాలన్న మోడీ..! -
కొత్త సినిమాలపై పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం, ఇక నుంచి..!! -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
టీడీపీ కంచుకోటలో వైసీపీ అభ్యర్ధి ఫిక్స్, 2024 నిర్ణయాల దిద్దుబాటు..!! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
వెండి విలయ తాండవం: నిలిచిపోయిన ట్రేడింగ్! -
"ధురంధర్" దెబ్బకి "పాకిస్థాన్" లో కలకలం.. నయా ఆపరేషన్ షురూ..!! -
మీనరాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది కార్యసిద్ధి, ఆర్థిక లాభం.. పూర్తి వివరాలివే! -
అమెరికాకు ఎదురుదెబ్బ? యుద్ధక్షేత్రం నుంచి వైదొలిగిన ఫోర్డ్.. కారణం ఏంటి?












Click it and Unblock the Notifications