స్పెషల్ ప్యాకేజ్- రాజధాని ప్రాంతాన్ని ఖాళీ చేయించనున్న ప్రభుత్వం..!?
టోక్యో: జపాన్ ప్రభుత్వం సంచలన నిర్ణయాన్ని తీసుకుంది. రాజధాని టోక్యో రీజియన్ ను ఖాళీ చేయించడానికి చర్యలు తీసుకుంది. టోక్యో రీజియన్ నుంచి ఇతర ప్రాంతాలకు తరలి వెళ్లే వారికి ఆర్థిక సహాయాన్ని కూడా ప్రకటించిందక్కడి ప్రభుత్వం. దీనికోసం ప్రత్యేక ఆర్థిక ప్యాకేజీని కూడా ప్రకటించింది. 2023 ఆర్థిక సంవత్సరం నుంచే దీన్ని అమలు చేయడానికి సమాయాత్తమౌతోంది.

జనాభా విపరీతం..
టోక్యో రీజియన్ ను ఖాళీ చేయించడానికి కారణాలు లేకపోలేదు. జనాభా విపరీతంగా పెరిగిపోవడం, మౌలిక వసతులను కల్పించడంలో తీవ్ర ఇబ్బందులు ఎదురుకావడమేనంటూ జపాన్ మీడియా స్పష్టం చేసింది. అభివృద్ధి మొత్తం టోక్యో, దాని పరిసర ప్రాంతాల్లోనే కేంద్రీకరించాల్సి రావడం వల్ల ఇతర ప్రాంతాలు వెనుకంజలో ఉన్నాయని ప్రభుత్వం భావిస్తోంది. టోక్యో నుంచి వెళ్లి స్థిరపడిన వారి నుంచి అందే పన్నులతో వెనుకబడ్డ ప్రాంతాలను అభివృద్ధి చేయవచ్చనే నిర్ణయానికి వచ్చింది.

ఆర్థిక ప్యాకేజీ..
ఆయా ప్రాంతాల్లో జనాభా పెరగడం వల్ల మౌలిక సదుపాయాలను కూడా కల్పించడానికి వీలవుతుందని, ఫలితంగా- అవి కూడా అభివృద్ధి చెందుతాయనే నిర్ణయానికి వచ్చింది. అందుకే టోక్యో నుంచి వెళ్లి ఆయా ప్రాంతాల్లో స్థిరపడే వారికి ప్రత్యేక ఆర్థిక ప్యాకేజీని కూడా ప్రకటించింది. టోక్యో రీజియన్ లోనే పెద్ద సంఖ్యలో ప్రజలు నివాసం ఉండటం వల్ల జనాభాపరంగా అసమతుల్యత ఏర్పడిందని, దీనివల్లే ఈ పరిణామాలు తలెత్తినట్లు అంచనా వేస్తోంది.

వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచే..
టోక్యో మెట్రోపాలిటన్ రీజియన్ లో నివసిస్తోన్న అర్హత ఉన్న కుటుంబాలు వెనుకబడిన ప్రాంతాలకు తరలినట్టయితే 2023-2024 ఆర్థిక సంవత్సరం నుంచి ఈ ఆర్థిక ప్యాకేజీని వర్తింపజేయనుంది. ఒక్కో బిడ్డకు 1 మిలియన్ యెన్.. భారతీయ కరెన్సీలు 7,700 రూపాయలను చెల్లించాలని నిర్ణయించింది. ఇప్పటికే అమలులో ఉన్న 3,00,000 యెన్ ప్రోత్సాహకానికి తాజాగా ప్రకటించిన మొత్తం మూడు రెట్లు ఎక్కువ కావడం ప్రాధాన్యతను సంతరించుకుంది.

పల్లెలు, పట్టణాలు ఖాళీ..
జపాన్ లో జనన రేటు పరిమితంగా ఉంటోంది. యువకుల కంటే వయోధిక వృద్ధుల నిష్పత్తి అధికం. ఉన్న యువత కూడా విద్య, ఉద్యోగ, ఉపాధి అవకాశాల కోసం గ్రామీణ ప్రాంతాలకు దూరమౌతోన్నారు. టోక్య సహా ఇతర మెట్రోపాలిటన్ నగరాల్లో స్థిరపడుతున్నారు. ఫలితంగా పలు గ్రామాలు, మధ్య స్థాయి పట్టణాలు ఖాళీ అవుతున్నాయి. దీని ప్రభావం అక్కడి వసతుల కల్పనపై పడుతోంది. పన్ను రాబడి భారీగా తగ్గుతోంది.

మూడు మిలియన్ యెన్..
తాజాగా సవరించిన ప్రతిపాదనల ప్రకారం.. ఇద్దరు పిల్లలు ఉన్న ఓ కుటుంబం టోక్యో మెట్రోపాలిటన్ రీజియన్ ను విడిచి వెళ్తే ఆ కుటుంబానికి మూడు మిలియన్ యెన్‌ల ఆర్థిక ప్యాకేజీ అందుతుంది. సెంట్రల్ టోక్యో మెట్రోపాలిటన్ ప్రాంతంలో అయిదు సంవత్సరాల పాటు నివసించిన కుటుంబాలు వారు ఇతర ప్రాంతాలకు తరలి వెళ్లొచ్చని తాజా ప్రతిపాదనల్లో పేర్కొంది. అలా వెళ్లిన ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్ ఆప్షన్ ను కల్పించింది. చిన్న లేదా మధ్య తరహా వ్యాపారాన్ని ప్రారంభించడానికి, ఆర్థిక సహాయాన్ని అందిస్తుంది జపాన్ ప్రభుత్వం.
-
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, ఇలా చేయండి.. వెంటనే..!! -
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
తెలంగాణలో కొత్త అసెంబ్లీ సీట్లు ఇవే, కలిసొచ్చేది ఆ పార్టీకే- అసలు లెక్క..!! -
భారీగా బీర్ల ధరలు పెంపు, ఏ బ్రాండ్ ఎంత.!! -
పద్మవ్యూహంలోకి ట్రంప్ ? ఇరాన్ లో భూతల దాడి నరకమేనా ? -
పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గింపు - కేంద్రం అనూహ్య నిర్ణయం, వంట గ్యాస్ రేట్లూ ఇక..!! -
బంగారం ధరల్లో అనూహ్యం- భారీగా రీబౌండ్ -
రామ్‌చరణ్ ‘పెద్ది’ గ్లింప్స్ పై రివ్యూ -
రామ్ చరణ్ బర్త్‌డే గిఫ్ట్ మామూలుగా లేదుగా! -
సమ్మర్ స్పెషల్ 'పెసరపప్పు చారు'.. ఇదొక్కటి యాడ్ చేస్తే టేస్ట్ అద్దిరిపోద్ది..! -
అమెరికన్ కరెన్సీ ఇకపై.. !! -
100 ఏళ్ల రికార్డును తుడిచేస్తున్న గోల్డ్ క్రాష్.. బిట్‌కాయిన్ జేత్రయాత్ర!












Click it and Unblock the Notifications