ట్రంప్ టారిఫ్‌లకు చెక్: భారత్‌లో రూ.5.6 లక్షల కోట్ల పెట్టుబడులు

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్‌పై 50 శాతం సుంకాలు విధించడంతో తలెత్తిన ఆర్థిక ఒత్తిడిని తగ్గించేందుకు భారత్ వివిధ ప్రత్యామ్నాయాలపై దృష్టి సారించింది. ఈ క్రమంలో జపాన్ భారత ఆర్థిక వ్యవస్థకు భారీ ఊతమిచ్చే కీలక ప్రకటన చేసింది. రాబోయే 10 సంవత్సరాల్లో 10 ట్రిలియన్ యెన్(దాదాపు రూ.5.6 లక్షల కోట్లు లేదా 68 బిలియన్ల డాలర్లు) పెట్టుబడులు పెడతామని జపాన్ ప్రకటించిది. ఈ శుభవార్తతో ట్రంప్ సుంకాల ప్రభావం తగ్గుతుందని భావిస్తున్నారు.

ప్రధాని జపాన్ పర్యటనలో ప్రకటన
ప్రధాని నరేంద్ర మోదీ ఆగస్టు 29వ తేదీన జపాన్ వెళ్లనున్నట్లు విదేశాంగ శాఖ ప్రతినిధి విక్రమ్ మిస్త్రీ వెల్లడించారు. ఆయన రెండు రోజుల పాటు జపాన్లో పర్యటించనున్నారు. జపాన్ ప్రధాని షిగేరు ఇషిబా, భారత ప్రధాని నరేంద్ర మోదీతో జరగబోయే శిఖరాగ్ర సమావేశంలో ఈ భారీ పెట్టుబడుల ప్రకటన చేయనున్నట్లు తెలిసింది. ఈ సమావేశంపై ప్రపంచ దేశాలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి. ఈ పర్యటనలో రెండు దేశాలు 17 సంవత్సరాల తర్వాత తొలిసారిగా భద్రతా సహకారంపై సంయుక్త ప్రకటనను సవరించనున్నాయి. ఇది ఇరు దేశాల వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేస్తుందని భావిస్తున్నారు.

Japan to Invest Rs 5 6 Lakh Crore in India Amid Trump Tariff Pressures

పెట్టుబడులు పెట్టే ప్రధాన రంగాలు ఇవే..
జపాన్ పెట్టుబడులు ప్రధానంగా 8 కీలక రంగాలపై దృష్టి పెడతాయి. ముఖ్యంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI), సెమీకండక్టర్లు, మొబిలిటీ, పర్యావరణం, ఆరోగ్యం వంటి రంగాల్లో ఈ పెట్టుబడులు రానున్నాయి. దీని ద్వారా ఇండస్ట్రియల్, టెక్నికల్ సహకారం పెరుగుతుందని నిక్కీ ఏషియా నివేదిక పేర్కొంది.

తెలంగాణ స్టార్టప్‌లకు ఊతం
జపాన్ ప్రభుత్వం భారతీయ స్టార్టప్‌లలో, ముఖ్యంగా హైదరాబాద్‌లోని ఐటీ హబ్‌లకు ప్రసిద్ధి చెందిన తెలంగాణలో పెట్టుబడులు పెంచడానికి ప్రణాళికలు వేస్తోంది. జపాన్ ఇంటర్నేషనల్ కోఆపరేషన్ ఏజెన్సీ (JICA) ఇప్పటికే ఈ ప్రాంతంలోని సంస్థలకు సహకరించడానికి యెన్ రుణాలను అందిస్తోంది.

జపాన్‌లో భారతీయ నిపుణులకు ఉద్యోగాలు
పెట్టుబడులతో పాటు జపాన్ మరో కీలక నిర్ణయం కూడా తీసుకుంది. జపాన్‌లో ఉన్న నైపుణ్యం కలిగిన కార్మికుల కొరతను తీర్చడానికి, వచ్చే ఐదేళ్లలో భారతీయ నిపుణుల సంఖ్యను రెట్టింపు చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. 2030 నాటికి జపాన్‌లో కార్మికుల కొరత 7.9 లక్షలకు చేరుకుంటుందని అంచనా. జపాన్ లోని సోంపో కేర్, సెకిషో వంటి ప్రముఖ కంపెనీలు భారతీయ కార్మికుల కోసం శిక్షణ, ఉద్యోగ అవకాశాల కార్యక్రమాలను ప్రారంభించనున్నాయి. ఈ కార్యక్రమాల్లో భాషా శిక్షణ, ఉద్యోగ కల్పన సేవలు కూడా ఉంటాయి. ఇది భారతీయులకు ఉపాధి అవకాశాలను పెంచుతుంది. జపాన్‌కు వలస వెళ్లే వారికి భాషా సమస్యలను తగ్గించి, జపాన్ కంపెనీల్లో సులభంగా కలిసిపోయేలా ఇది సహాయపడుతుందని ఆశిస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+