కిమ్‌కు షాక్: జపాన్, అమెరికా జెట్ డ్రిల్స్, తాజా పరిస్థితులపై ట్రంప్ ఆరా

Posted By:
Subscribe to Oneindia Telugu

ప్యాంగ్యాంగ్: ఉత్తరకొరియా 69వ, వార్షికోత్సవాన్ని అంగరంగ వైభవంగా జరుపుకొంటున్న సందర్భంలో తూర్పుచైనా సముద్రంలో జపాన్, అమెరికా సంయుక్తంగా జెట్ విమానాలతో డ్రిల్స్ నిర్వహించాయి.

శాస్త్రవేత్తలకు కిమ్ విందు: అణు పరీక్షల వెనుక ఆ ఇద్దరే!

శనివారం నాడు ఉత్తరకొరియా 69, వార్షికోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించింది. ఈ వేడుకల్లో ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. కొరియాకు చెందిన ప్రముఖులకు దేశ ప్రజలు ఘనంగా నివాళులర్పించారు.

కిమ్‌కు షాక్: సైనిక చర్యకు రెఢీ, ఉ.కొరియాపై ట్రంప్ నిప్పులు

69వ, వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని దేశ వ్యాప్తంగా ప్రజలు పువ్వులు, డ్యాన్సులతో సంబరాల్లో మునిగి తేలారు. మరో వైపు కొరియా అధ్యక్షుడు కిమ్ శాస్త్రవేత్తలతో కలిసి దేశ వార్షికోత్సవ వేడుకల్లో పాల్గొన్నారు.6 అణుపరీక్షలు విజయవంతంగా నిర్వహించిన శాస్త్రవేత్తలకు కిమ్ విందు ఇచ్చారు.

అమెరికా, జపాన్ సంయుక్తంగా జెట్ డ్రిల్స్

అమెరికా, జపాన్ సంయుక్తంగా జెట్ డ్రిల్స్

ఉత్తరకొరియా 69వ, వార్షికోత్సవ వేడుకలను జరుపుకొంటున్న సమయంలో తూర్పు చైనా సముద్రం మీద జపాన్, అమెరికాలు సంయుక్తంగా జెట్ విమానాల డ్రిల్స్ నిర్వహించాయి. ఇటీవల కాలంలో జపాన్‌పై దాడులు చేస్తామని ఉత్తరకొరియా తీవ్ర స్థాయిలో హెచ్చరించింది. ఓ క్షిపణి దాడి చేసింది. అయితే జపాన్‌కు సమీపంలోని సముద్రం వద్ద క్షిపణి బాగాలను జపాన్ అధికారులు గుర్తించారు. ఈ దాడితో జపాన్ తీవ్రంగా భయాందోళనలను వ్యక్తం చేసింది.

కిమ్‌కు ప్రజల మద్దతు

కిమ్‌కు ప్రజల మద్దతు

ఉత్తరకొరియా ప్రజలు ఆ దేశాధ్యక్షుడు కిమ్‌జంగ్‌ఉన్‌కు పూర్తి మద్దతును ప్రకటించారు.ఉత్తరకొరియా అణుశక్తిలో ప్రపంచంలో ఏ దేశానికి తీసిపోని విధంగా తీర్చిదిద్దడంలో కిమ్ కృషిని ఆ దేశ ప్రజలు ప్రశంసిస్తున్నారు. ఉత్తరకొరియాను తలెత్తుకు తిరిగేలా కిమ్ చేశారని పాక్ హ్యాంగ్ ఉన్ మీడియాకు చెప్పారు.

గ్వామ్ నుండి జెట్ మిలటరీ డ్రిల్స్ నిర్వహణ

గ్వామ్ నుండి జెట్ మిలటరీ డ్రిల్స్ నిర్వహణ

ఉత్తరకొరియా కవ్వింపు చర్యలను తాము తిప్పికొట్టేందుకు సిద్దంగా ఉన్నామని జపాన్ ప్రకటించింది. ఈ మేరకు అమెరికాతో కలిసి గ్వామ్‌లో ఉన్న అమెరికా ఎయిర్‌బేస్ నుండి అమెరికా, జపాన్ మిలటరీ జెట్ విమానాలు మిలటరీ డ్రిల్ నిర్వహించాయి.జపాన్‌కు చెందిన రెండు జెట్ ఫైటర్లు, అమెరికాకు చెందిన రెండు బాంబర్ విమానాలు ఈ విన్యాసాలు నిర్వహించాయి.

జపాన్ ప్రధాని, ట్రంప్ ఫోన్ చర్చలు

జపాన్ ప్రధాని, ట్రంప్ ఫోన్ చర్చలు

ఉత్తరకొరియా సరిహద్దుల్లో నెలకొన్న తాజా పరిస్థితులపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్, జపాన్ ప్రధానమంత్రి షీనోజ్ అబే ఫోన్లో చర్చించారు. ఫ్రాన్స్ అధ్యక్షుడు మార్కన్ కూడ ఫోన్లో తాజా పరిస్థితులపై చర్చించారు. ఈ మేరకు ఫ్రాన్స్ అధ్యక్షుడి కార్యాలయం ఈ విషయాన్ని ధృవీకరించింది.ఉత్తరకొరియా అనుసరిస్తున్న వ్యవహరశైలిపై ఫ్రాన్స్ అధ్యక్షుడు మార్కోన్ అభ్యంతరం వ్యక్తం చేశారు. ప్రపంచశాంతికి ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్ విఘాతం కల్గిస్తున్నారని మార్కోన్ అభిప్రాయపడ్డారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
North Korea celebrated its 69th founding anniversary with flowers and music, while Japan marked the occasion with fighter jet drills over the East China Sea.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

X