పేరెంట్స్‌కు క్షమాపణ చెప్పిన జిహాదీ జాన్, రక్కాలో ఆ ముగ్గురు గర్ల్స్
సిరియా: యావత్ ప్రపంచాన్ని వణికిస్తున్న ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదుల్లో అత్యంత కిరాతకుడిగా పేరు గాంచిన జిహాదీ జాన్ (మహమ్మద్ ఎంవాజీ) తన కుటుంబ సభ్యులకు క్షమాపణలు చెప్పాడు. అతను తన సందేశాన్ని సిరియా నుండి మూడో వ్యక్తి ద్వారా తన కుటుంబ సభ్యులకు పంపించాడు. తాను ఎలా ఉంటానో తెలియడం వల్ల సమస్యలు వస్తే.. అందుకు క్షమాపణలు కోరాడు.
అయితే, తన క్రూర చర్యలకు అతను ఏమాత్రం పశ్చాత్తాపం వ్యక్తం చేయడం లేదు. అంతేకాకుండా, ఐసిస్ మరికొందరు హోస్టేజిలను బలి తీసుకోవడానికి సిద్ధంగా ఉంది. ఇతను కువాట్లో జన్మించాడు. ఇతను క్రూరచర్యలకు పాల్పడుతున్నాడు. ఇతని గుర్తింపు (ఫేస్ గుర్తింపు) పది రోజుల క్రితం జరిగింది.

ఇదీ మహమ్మద్ ఎవాంజీ జీవితం:
1988లో కువైట్‌లో జన్మించి 1994లో యుకేకు వెళ్లాడు. 2009లోయూనివర్సిటీ ఆఫ్ వెస్ట్ మినిస్టర్‌లో కంప్యూటింగ్ డిగ్రీ పూర్తి. ఆగస్టు 2009లో సఫారీ కోసం ఇద్దరు స్నేహితులతో టాంజానియా ట్రావెల్స్ కానీ దార్ ఎస్ సలామ్ వద్ద ప్రవేశం నిరాకరించారు. అమస్టర్‌డ్యాం విమానంలో వెళ్లాడు. అక్కడా ప్రశ్నించడంతో డోవర్‌కు తిరగి వచ్చాడు.
సెప్టెంబర్ 2009లో తండ్రితో కలిసి ఉండాలని కువైట్‌కు బయలుదేరాడు. జులై 2010లో కొన్ని రోజులు యుకేలో ఉండేందుకు రావడం, వీసా నిరాకరించడంతో కువైట్ వెళ్లనని చెప్పాడు.
2012లో సెల్టా ఇంగ్లీషు లాంగ్వేజీ కోర్సు పాసయ్యాడు. 2013లో దస్తావేజు ద్వారా పేరు మార్పు. కువైట్ వెళ్లేందుకు ప్రయత్నించడంతో అడ్డుకున్నారు. తల్లిదండ్రులు కనిపించడం లేదంటూ రిపోర్టు. నాలుగు నెలల తర్వాత అతను సిరియా వెళ్లినట్లు పోలీసులు తల్లిదండ్రులకు చెప్పారు.
ఆ ముగ్గురు యువతులు ఇస్లామిక్ స్టేట్ కంట్రోల్లో...
బ్రిటిష్‌కు చెందిన ముగ్గురు స్కూల్ గర్ల్స్ ఐసిస్‌లో చేరేందుకు వెళ్లిన విషయం తెలిసిందే. వారు ఐసిస్ కంట్రోల్లోకి వెళ్లారని తెలుస్తోంది. షమీమ్ బేగమ్ (15), కడిజా సుల్తానా (16), అమిరా ఆబాసే (15)లు సిరియాలు పారిపోయారు. వారు రక్కాలో ఉంటున్నట్లుగా తెలుస్తోంది. వీరి ముగ్గురే కాకుండా దాదాపు 22 మంది యువతులు ఐసిస్‌లో చేరేందుకు సిరియా వెళ్లినట్లుగా భావిస్తున్నారు.
-
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000 -
Tamil Nadu Polls: సర్వేల షాక్ తో విజయ్ బిగ్ టర్న్..! తుది దశలో తాజా ప్లాన్..! -
ఎన్నికల వేళ విజయ్ సమర్థతను తేల్చేసిన పవన్..!! -
ఇలా చేస్తే అమరావతి గొడవ క్లోజ్..! మావిగన్ వేళ చంద్రబాబుకు సాయిరెడ్డి ఐడియా..! -
Amaravati: సాయిరెడ్డి సలహాపై స్పందించిన టీడీపీ..! బహిరంగ లేఖ..! -
ఆర్టీసీ బస్సు ఛార్జీల్లో మార్పులు, కొత్త రేట్లు ఇలా..!! -
అలిపిరి నుంచిప్రత్యేకంగా 11 లేన్ల రహదారి- టోల్ గేట్ సమూల పునరుద్ధరణ? -
పసిడికి భారీ డిమాండ్: కుప్పలు తెప్పలుగా -
రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్, పథకాలు ఇక నుంచి..!! -
సమ్మర్ లో ఈ హిల్ స్టేషన్ కు వెళ్తే.. మళ్లీ తిరిగి రావాలనిపించదు..! -
US Blockade: అమెరికాకు బిగ్ షాక్..! తేలిపోయిన హార్ముజ్ దిగ్బంధం..! -
జగన్, షర్మిల సహా వారికి చంద్రబాబు లేఖ - కీలక విజ్ఞప్తి..!!












Click it and Unblock the Notifications