వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అతి కిరాతకంగా బందీల తల నరికే ఐసీస్ ఉగ్రవాది... ఎవరీ 'జిహాదీ జాన్' (ఫోటోలు)

By Nageswara Rao
|
Google Oneindia TeluguNews

సిరియా: యావత్ ప్రపంచాన్ని వణికిస్తోన్న ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదుల్లో అత్యంత కిరాతకుడిగా పేరుగాంచిన వ్యక్తి పేరుని ప్రపంచ దర్యాప్తు సంస్ధలు బయట పెట్టాయి. అమెరికా జర్నలిస్ట్ జేమ్స్ ఫోలీని అతి కిరాతకంగా తల నరికి ఉగ్రవాదే ఈ జిహాదీ జాన్. గత ఏడాది ఆగస్టులో అమెరికా జర్నలిస్ట్‌ని చంపిన వీడియోను యూట్యూబ్‌లో పోస్టు చేశాడు.

వీడియోని వీక్షించిన యావత్ ప్రపంచం నివ్వెర పోయింది. జర్నలిస్ట్‌ ఫొలీతో పాటు ఐసీస్ వద్ద బందీలుగా వున్న అనేకమందిని అత్యంత క్రూరంగా చంపాడు. ఇంగ్లీషు అనర్గళంగా మాట్లాడుతున్న ఇతను ఏ దేశానికి చెందిన వాడన్న విషయాన్ని కనిపెట్టేందుకు ప్రపంచంలోని పలు దర్యాప్తు సంస్ధలు పరిశోధనలు జరిపాయి.

'Jihadi John' named as Mohammed Emwazi from London

చివరకు జిహాది జాన్ అసలు పేరు మహమ్మద్‌ ఎంవాజీగా గుర్తించారు. స్వదేశం కువైట్. తన చిన్నతనంలోనే ఇంగ్లాండ్‌లో స్ధిరపడినట్లు పేర్కొన్నాయి. పూర్వ కాలంలో బ్రిటిష్ సెక్యూరిటీ సర్వీసెస్‌గా పేరుగాంచిన వెస్ట్ లండన్‌లో ఇతని బాల్యం గడిచింది. వీడియోలో కనిపించే ప్రతిసారీ నల్లని ముసుగు ధరించి కనిపిస్తున్న విషయం తెలిసిందే.

కేవలం కళ్లు మాత్రమే కనిపించే విధంగా ముసుగు ధరిస్తాడు. ఈ నెల మొదటి వారంలో జపనీస్ జర్నలిస్ట్ కెంజ్ గోటో తల నరికిన సందర్భంలో కూడా ఇలాంటి ముసుగే ధరించాడు. ఐసీస్ ఉగ్రవాదుల చెర నుంచి తప్పించుకున్న బందీలు తెలిపిన సమాచారం ప్రకారం అక్కడున్న ముగ్గురు బ్రిటీష్ జిహాదీలలో కెల్లా అత్యంత క్రూరుడు ఈ జిహాది జాన్. వీరిని 'ద బీట్లెస్' అని పిలుస్తుంటారు.

'Jihadi John' named as Mohammed Emwazi from London

జిహాది జాన్‌ను ఆచూకీ కోసం అమెరికాకు చెందిన ఎఫ్‌బీఐ, యూకేకు చెందిన ఎం15, స్కాట్లాండ్‌కు చెందిన స్కాట్లాండ్‌ యార్డు పోలీసులు గాలిస్తున్నారు. అయితే ఐఎస్‌ఐఎస్‌ ప్రభావం ఎక్కువగా ఉన్న ఇరాక్, సిరియాల్లో జాన్ ఉండటంతో పట్టుకోవడం పెద్ద సమస్యగా మారింది.

ఐఎస్ఐఎస్ ఉగ్రవాదుల చేతుల్లో బందీలుగా ఇప్పటి వరకు చాలా మంది మరణించారు. వీరిలో అత్యంత క్రూరంగా చంపబడ్డవారిలో అమెరికాకు చెందిన జర్నిలిస్ట్ జేమ్స్ ఫోలీ, అబ్దుల్ రహ్మాన్ (పీటర్) కస్సాంగ్, అలెన్ హెన్నింగ్, కెంజ్ గోటో, స్టీవెన్ స్కోటాల్ఫ్‌లు ఉన్నారు.

మహమ్మద్ ఎవాంజీ జీవితం:

* 1988: కువైట్‌లో జన్మించి 1994లో యుకేకు వెళ్లాడు.

* 2009: యూనివర్సిటీ ఆఫ్ వెస్ట్ మినిస్టర్‌లో కంప్యూటింగ్ డిగ్రీ పూర్తి.

* ఆగస్టు 2009: సఫారీ కోసం ఇద్దరు స్నేహితులతో టాంజానియా ట్రావెల్స్ కానీ దార్ ఎస్ సలామ్ వద్ద ప్రవేశం నిరాకరించారు. అమస్టర్‌డ్యాం విమానంలో వెళ్లాడు. అక్కడా ప్రశ్నించడంతో డోవర్‌కు తిరగి వచ్చాడు.

* సెప్టెంబర్ 2009: తండ్రితో కలిసి ఉండాలని కువైట్‌కు బయలుదేరాడు.

* జులై 2010: కొన్ని రోజులు యుకేలో ఉండేందుకు రావడం, వీసా నిరాకరించడంతో కువైట్ వెళ్లనని చెప్పాడు.

* 2012: సెల్టా ఇంగ్లీషు లాంగ్వేజీ కోర్సు పాసయ్యాడు.

* 2013: దస్తావేజు ద్వారా పేరు మార్పు. కువైట్ వెళ్లేందుకు ప్రయత్నించడం. అడ్డుకున్నారు. తల్లిదండ్రులు కనిపించడం లేదంటూ రిపోర్టు. నాలుగు నెలల తర్వాత అతను సిరియా వెళ్లినట్లు పోలీసులు తల్లిదండ్రులకు చెప్పారు.

Source: లండన్ ఆధారిత క్యాంపెన్ గ్రూప్ (Cage)

English summary
The masked Islamic State militant known as "Jihadi John", who has been pictured in the videos of the beheadings of Western hostages, has been named.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X