Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Joe Biden Cancer : నాకు క్యాన్సర్-జో బైడెన్ షాకింగ్ ప్రకటన- వైట్ హౌస్ క్లారిటీ

అంతర్జాతీయంగా పలు దేశాల్లో పెరిగిపోతున్న కర్గన ఉద్గారాలు, వాటివల్లచోటు చేసుకుంటున్న వాతావరణ మార్పులపై మాట్లాడుతూ అమెరికా అధ్యక్షుడు ఓ సంచలన ప్రకటన చేశారు. తనకు క్యాన్సర్ ఉన్నట్లు ప్రకటించారు. అయితే దానిపై ఇతర వివరాలేవీ బయటపెట్టలేదు. దీంతో అమెరికాతో పాటు పలుదేశాల్లో దీనిపై వెంటనే చర్చ మొదలైంది.

అమెరికా అధ్యక్షుడికి క్యాన్సర్ వచ్చిదంటూ వివిధ దేశాల్లో పలువురు నేతలు చర్చించుకోవడం మొదలుపెట్టారు. అమెరికాలోనూ అధ్యక్షుడి ఆరోగ్యంపై ఆరా తీయడం మొదలుపెట్టారు. తాజాగా గ్లోబల్ వార్మింగ్, తాను పెరిగిన పరిసరాల్లోని చమురు శుద్ధి కర్మాగారాల నుండి వెలువడే ఉద్గారాల గురించి మాట్లాడుతున్నప్పుడు అమెరికా అధ్యక్షుడు చేసిన ప్రకటనలో క్యాన్సర్ గురించి చేసిన ప్రస్తావన ఇందుకు కారణమైంది.

యూఎస్ ప్రెసిడెంట్ జో బిడెన్ ఇవాళ తనకు క్యాన్సర్ ఉందని చేసిన ప్రకటనతో కలకలం రేగింది. దీనిపై సోషల్ మీడియాలోనూ చర్చ సాగుతోంది. చాలా మంది బైడెన్ త్వరగా కోలుకోవాలని ప్రార్ధనలు కూడా చేయడం మొదలుపెట్టారు. ఈ నేపథ్యంలో వైట్ హౌస్ వివరణ ఇచ్చుకోవాల్సి వచ్చింది. బైడెన్ గత సంవత్సరం పదవీ బాధ్యతలు స్వీకరించడానికి ముందు తాను చేయించుకున్న చర్మ క్యాన్సర్ చికిత్స గురించి ప్రస్తావిస్తూ ఈ ప్రకటన చేశారని అధ్యక్ష నివాసం ఆ తర్వాత స్పష్టత ఇచ్చింది.

joe bidens i have cancer comments gone viral, white house clarified

వాస్తవంగా బైడెన్ చేసిన వ్యాఖ్యలు ఇవి. "మా అమ్మ మమ్మల్ని ఎంతో కష్టపడి పెంచింది. ఇప్పుడు అసలు ఏం జరుగుతుందో తెలుసా? మీరు మీ విండ్‌షీల్డ్ వైపర్‌లను ధరించాలి, ఆయిల్ స్లిక్‌ని కిటికీ నుండి తీయాలి. అందుకే నేను, నేను పెరిగిన చాలా మంది ఇతర వ్యక్తులకు క్యాన్సర్ ఉంది. చాలా కాలంగా, డెలావేర్ లో అత్యధిక క్యాన్సర్ రేటు ఉంది"అని మసాచుసెట్స్‌లోని మాజీ బొగ్గు గని ప్లాంట్‌ను సందర్శించిన సందర్భంగా బిడెన్ చెప్పారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+