వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఉక్రెయిన్‌పై ర‌ష్యా వార్ : రసాయన, జీవ ఆయుధాలను ప్రయోగించేందుకు పుతిన్ వ్యూహం : జో బైడెన్ కీలక వ్యాఖ్యలు

|
Google Oneindia TeluguNews

రష్యా బాంబుల దాడులతో ఉక్రెయిన్ దద్దరిల్లుతోంది. ఏ నగరంలో చూసినా భయానక పరిస్థితులే కన్పిస్తున్నారు. భవనాలన్నీ ధ్వంసమైయాయి. ప్రజల ఆర్తనాదాలు వినిపిస్తున్నాయి. బాంబుల భయంతో పౌరులు పరుగులు పెడుతున్నారు. పొరుగు దేశాలకు పారిపోతున్నారు. భీకర యుద్ధపోరుతో ప్రజలు బెంబెలెత్తిపోతున్నారు. ఒక్కో నగరాన్ని స్వాధీనం చేసుకుంటున్న రష్యా బలగాలు ఉక్రెయిన్‌పై దాడులను మరింత ముమ్మరం చేసింది.

జీవ ఆయుధాలను ఉపయోగించేందుకు పరిశీలన..

జీవ ఆయుధాలను ఉపయోగించేందుకు పరిశీలన..

ఈ నేపథ్యంలో రష్యాపై అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఉక్రెయిన్ సేనల నుంచి తీవ్ర ప్రతిఘటనలు ఎదుర్కొంటోందని పేర్కొన్నారు. మాస్కోకు ఈ యుద్ధంలో పరాభవం తప్పదని హెచ్చరించారు. ఇప్పటికే 15 వేల మందికి పైగా రష్యా సైనికులను ఉక్రెయిన్ ఆర్మీ హతమార్చిందన్నారు. యుద్ధ విమానాలు, యుద్ధ ట్యాంకులు, సామాగ్రీని ధ్వంసం చేసిందని తెలిపారు. యుద్ధభేరిలో పరాభవం ఎదుర్కొంటున్న రష్యా .. రసాయన, జీవ ఆయుధాలను ఉపయోగించేందుకు పరిశీలిస్తున్నట్లు బైడెన్ కీలక వ్యాఖ్యలు చేశారు. అటు అమెరికన్లపై మాస్కో సైబర్ దాడులక దిగే అవశాశం ఉందని .. అప్రమత్తంగా ఉండాలని జో బైడెన్ హెచ్చరించారు.

రంగంలోకి హైప‌ర్ సోనిక్ క్షిప‌ణులు

రంగంలోకి హైప‌ర్ సోనిక్ క్షిప‌ణులు

ఉక్రెయిన్‌పై దురాక్రమణకు దిగిన పుతిన్ యుద్ధనేరస్తుడంటూ అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ చేసిన వ్యాఖ్యలపై రష్యా ఆగ్రహం వ్యక్తం చేసింది. రష్యాలో ఉన్న అమెరికా రాయబారి జాన్ సులివాన్‌ను పిలిచి వివరణ కోరింది. జో బైడెన్ వ్యాఖ్యలు సరికాదని పేర్కొంది. ఆయన వ్యాఖ్యలు ఇరుదేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలను విచ్ఛిన్నం చేసేలా ఉన్నాయని తెలిపింది. అటు ఉక్రెయిన్‌లో తమ దాడులను తీవ్రతరం చేసినట్లు రష్యా తెలిపింది. తమ నిర్దిష్ట లక్ష్యాలను ధ్వంసం చేసేందుకు అత్యాధునిక కింజాల్ హైపర్ సోనిక్ క్షిపణుల్ని వినియోగిస్తామని వెల్లడించింది. సుమారు 2వేల కి.మీ పరిధిలో ఉన్న లక్ష్యాన్ని ఇవి సమర్థవంతంగా పూర్తి చేస్తాయని చెప్పింది.

Recommended Video

Russia వ్యతిరేక కూటమిలో India ను మినహాయించినట్టే..! - Joe Biden| Oneindia Telugu
 ఆహారం, నీరు కొర‌త.. చిన్నారులు మృతి

ఆహారం, నీరు కొర‌త.. చిన్నారులు మృతి


మరియుపోల్‌లో రష్యా దళాలు క్షిపణులు, బాంబులతో విరుచుకుపడుతున్నాయి. ఈ నగరాన్ని స్వాధీనం చేసుకునేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తోంది. రష్యా సేనల దాడులను దాడులను ఉక్రెయిన్ ఆర్మీ సమర్ధవంతంగా ప్రతిఘటిస్తోంది. గత 27 రోజులుగా రష్యా సేనలు బాంబులతో విరుచుకుపడుతున్నా.. ఆశించిన స్థాయిలో పురోగతి సాధించలేకపోతోంది. దీంతోదాడులను మరింత తీవ్రతరం చేసింది రష్యా. మరియపోల్‌లో చిన్నపిల్లలకు కనీసం ఆహారం , నీరు కూడా దొరక్క తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కొందరు చిన్నారుల డీహైడ్రేషన్ తో చనిపోతున్నారని ఉక్రెయిన్ అధికారులు వెల్లడించారు.

English summary
Joe Biden says Putin was considering the use of chemical and biological weapons in the face of fierce resistance from Ukrainian forces.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X