బిడెన్ బోణి: డిక్స్ విల్లెలో విజయం, మిస్ ఫీల్డ్‌లో ట్రంప్ విక్టరీ..
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో జో బిడెన్ బోణీ చేశారు. న్యూ హ్యంప్ షైర్‌లో గల డిక్స్‌విల్లే నాచ్‌లో గెలిచారు. ఐదు చోట్ల విజయం సాధించారు. మంగళవారం వయోజనులు ఓటు హక్కు వినియోగించుకున్న తర్వాత.. లెక్కింపు ప్రక్రియ చేపట్టారు.
డిక్స్ విల్లెలో గల బాల్సమన్ రిసార్ట్‌లో ప్రజలు బ్యాలెట్ పద్దతిలో ఓటు వేశారు. రహస్య బ్యాలెట్ పద్దతిలో ఓటింగ్ జరిగింది. ఓటు హక్కు వినియోగించుకునే ప్రక్రియ త్వరగానే ముగిసింది. వెంటనే పరిశీలకులు ఓట్ల లెక్కింపు ప్రక్రియను చేపట్టారు. తర్వాత బిడెన్ వర్గం గెలిచారని మీడియాకు తెలియజేయగా.. రిపోర్ట్ చేసింది.

2016లో మాత్రం హిల్లరీ క్లింటన్- ట్రంప్ హోరా హోరీగా ప్రచారం చేశారు. కానీ ఎట్రంప్ గెలుచుకున్నారు. ఈ సారి బిడెన్ బోణీ చేయడంతో ఏం జరుగుతుందోననే ఉత్కంఠ నెలకొంది. సర్వేలు చెబుతోన్న అంశాలు నిజమవుతాయా..? లేదంటే బిడెన్ గెలిచి చరిత్ర సృష్టిస్తారో చూడాలి మరీ.
డిక్స్ విల్లెలో 2010 జనాభా లెక్కల ప్రకారం కేవలం 12 మంది మాత్రమే ఉన్నారు. సమీపంలో గల మిస్ ఫీల్డ్‌లో కూడా ఓట్ల లెక్కింపు పూర్తయ్యింది. అక్కడ ట్రంప్ బిడెన్‌పై 16-5 ఓట్ల తేడాతో విజయం సాధించారు.












Click it and Unblock the Notifications