జాగింగ్ కు వెళ్లిన మహిళ: రేప్, హత్య
న్యూయార్క్: ఒంటరిగా జాగింగ్ కు వెళ్లిన మహిళ హత్యకు గురైన సంఘటన న్యూయార్క్ లో జరిగింది. కత్రినా వెట్రానో (30) అనే మహిళ హత్యకు గురైయ్యింది. సంచలనం రేపిన ఈ సంఘటన వివరాలు ఈ విధంగా ఉన్నాయి.
న్యూయార్క్ లోని హోవార్ట్ బీచ్ కు సమీపంలో కత్రినా వెట్రానో నివాసం ఉంటున్నది. ప్రతి రోజు తండ్రి ఫిలిప్ తో కలిసి జాగింగ్ కు వెలుతుంటుంది. మంగళవారం సాయం 5 గంటలకు తండ్రిని జాగింగ్ కు పిలిచింది.
వెన్ను నొప్పి కారణంగా ఆ రోజు ఫిలిప్ జాగింగ్ కు వద్దని చెప్పారు. అయితే కత్రినా తాను జాగింగ్ కు వెలుతున్నానని తండ్రికి చెప్పింది. ఒంటరిగా వెళ్లోద్దని తండ్రి ఫిలిప్ వారించాడు. అయితే కత్రినా వినకుండా ఒంటరిగా జాగింగ్ కు వెళ్లింది.

రాత్రి 9 గంటలు అయినా కత్రినా ఇంటికి తిరిగిరాలేదు. ఆమె ఫోన్ కు స్పందించకపోవడంతో ఫిలిప్ 911 నంబర్ కు ఫోన్ చేసి విషయం చెప్పారు. పోలీసులు పలు ప్రాంతాల్లో గాలించారు. చివరికి ప్రసిద్ధి చెందిన మార్క్ లాండ్ పార్క్ లోని పొదలలో కత్రినా మృతదేహాన్ని గుర్తించారు.
దుండగులు ఆమె మీద అత్యాచారం చేసి గొంతునులిమి హత్య చేశారని పోలీసులు చెప్పారు. కత్రినాకు తెలిసిన వారు హత్య చేశారా ? దుండగులు హత్య చేశారా ? అని ఆరా తీస్తున్నామని న్యూయార్క్ పోలీసు అధికారులు తెలిపారు.












Click it and Unblock the Notifications