షరీఫ్ ఆహ్వానం మంచి స్టెప్: మోడీపై జాన్ కెర్రీ ప్రశంసలు
వాషింగ్టన్: భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పైన అమెరికా విదేశాంగ శాఖ మంత్రి జాన్ కెర్రీ ప్రశంసల వర్షం కురిపించారు. తన ప్రమాణ స్వీకారోత్సవానికి మోడీ పాకిస్తాన్ ప్రధాని నరేంద్ర మోడీని ఆహ్వానించడాన్ని ఆయన కితాబిచ్చారు. అన్ని దేశాలతో మోడీ సంబంధాలను కోరుకుంటున్నట్లుగా అర్థమవుతోందన్నారు.
నవాజ్ షరీఫ్‌ను ఆహ్వానించడం ద్వారా రెండు దేశాల మధ్య మోడీ మంచి సంబంధాలను ఆయన కోరుకుంటున్నట్లుగా అర్థమవుతోందన్నారు. షరీఫ్‌ను ఆహ్వానించడం ద్వారా మోడీ మంచి స్టెప్ తీసుకున్నారన్నారు. మోడీ, షరీఫ్ ఇద్దరు కూడా వారి వారి ప్రజల కోసం అవకాశాలను సృష్టించాలనుకునే బిజినెస్‌మెన్ అన్నారు.

భారత్ పర్యటన అనంతరం తాను షరీఫ్‌తో మాట్లాడానని కెర్రీ చెప్పారు. ఆయన వ్యాఖ్యల్లో ఆనందం, పాజిటివ్ కనిపించాయన్నారు. రెండు దేశాలు విజయం సాధించాలన్నారు. అభివృద్ధి ప్రణాళికలో భాగంగా మోడీ ఎన్నికల ప్రచారంలో తీసుకొచ్చిన "సబ్ కా సాత్, సబ్ కా వికాస్" బాగుందన్నారు.
కొత్త ప్రభుత్వంతో కలసి పనిచేసేందుకు అమెరికా సిద్ధంగా ఉందన్నారు. ఇదే సందర్భంలో మోడీ అభివృద్ధి అజెండా "సబ్ కా సాత్, సబ్ కా వికాస్" నినాదానికి తాము మద్దతు పలుకుతామన్నారు. ఇదొక గొప్ప విజన్ అని నమ్ముతున్నామన్నారు. భారత ఆర్ధికవృద్ధి పునరుద్ధరణకు తోడ్పడేందుకు యూఎస్ ప్రైవేట్ సెక్టార్ ఆసక్తితో ఉందన్నారు. కాగా, విదేశాంగ మంత్రి సుష్మాస్వరాజ్‌తో ఐదవ వార్షిక భారత్-యుఎస్ వ్యూహాత్మక చర్చల కోసం ఈ వారంలో కెర్రీ భారత్ రానున్నారు.












Click it and Unblock the Notifications