పాక్ సైన్యంతో కలిసి కాశ్మీర్ జిహాద్: హఫీజ్ సయీద్
ఇస్లామాబాద్: కాశ్మీరీలకు మద్దతు ఇచ్చే విషయంలో తమ సంస్థ పాకిస్తాన్ సైన్యానికి సహాయం చేస్తుందని నిషేధిత జమాత్ ఉద్ దావా (జెయుడి) చీఫ్ హఫీజ్ సయీద్ అన్నాడు. పాకిస్తాన్ చానెల్ 24తో మాట్లాడుతూ ఆయన ఆ విషయం చెప్పాడు.
లక్షలాది మంది కాశ్మీరీలు స్వాతంత్ర్యం కోసం డిమాండ్ చేస్తున్నారని, భారత ప్రభుత్వం కాల్పులు జరిపితే తాము బలంగా తిప్పికొడుతామని ఆయన అన్నాడు.

తాము పాకిస్తాన్‌కు మద్దతు ఇస్తామని, స్వాతంత్ర్యం కోసం పోరాటం చేస్తున్న కాశ్మీరీలకు పాకిస్తాన్ ప్రభుత్వం, పాకిస్తాన్ సైన్యం సహాయం చేసే ప్రయత్నాలకు తాము ఆ మద్దతు ఇస్తామని, దాన్ని తాము జిహాద్ అంటున్నామని ఆయన వివరించాడు.
కాశ్మీర్ ప్రజలు తమ హక్కులను పొందాలని పాకిస్తాన్, ఆ దేశ ప్రభుత్వం కోరుకుటోందని, దాన్ని సాధించడానికి పాకిస్తాన్ చేసే కృషిని తాము జిహాద్‌గా భావించి మద్దతు ఇస్తామని అన్నాడు.












Click it and Unblock the Notifications