వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సెక్స్ వర్కర్లంటూ పాప్ బృందం 15 గంటలు నిర్బంధం

By Nageswara Rao
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: దక్షిణ కొరియాకు చెందిన ప్రముఖ పాప్ సంగీత బృందం 'ఓ మై గర్ల్' కు చెందిన సభ్యులను సెక్స్ వర్కర్లంటూ లాస్ ఏంజిల్స్ విమానాశ్రయ అధికారులు నిర్భంధించారు. వివరాల్లోకి వెళితే, అమెరికాలోని లాస్ ఏంజెల్స్‌లో ఓ ఆల్బం చిత్రీకరణ కోసం విమానాశ్రానికి చేరుకున్నారు.

విమానం దిగిన తర్వాత బృందం సభ్యులు బయటకు వెళ్లే సమయంలో 'ఓ మై గర్ల్' బృందంలోని యువతలను అక్కడి కస్టమ్స అధికారులు సెక్స్ వర్కర్లను తమ దేశంలోకి అనుమతించబోమని చెప్పారు. దీంతో నిర్ఘాంతపోయిన యువతులు తాము సెక్స్ వర్కర్లం కామని, దక్షిణ కొరియాకు చెందిన పాప్ బృందం 'ఓ మై గర్ల్' సభ్యులమని, ఆల్బం చిత్రీకరణ కోసం ఇక్కడికి వచ్చామని చెప్పినా వినిపించుకోలేదు.

K-Pop Band Oh My Girl Mistaken for Sex Workers and Detained at LAX

అలా వారిని సుమారు 15 గంటలపాటు విమానాశ్రయంలోనే నిర్భంధించారు. చివరికి అన్ని ఆధారాలు చూపించాకే వారిని విడిచిపెట్టారు. ఈ సందర్భంగా పాప్ బృందం రికార్డు కంపెనీ డబ్ల్యూఎం ఎంటర్‌టైన్‌మెంట్ సంస్థ అధికారులు మాట్లాడుతూ అధికారులు పొరపాటున వారిని సెక్స్ వర్కర్లుగా భావించారని తెలిపారు.

ఈ ఘటనపై తాము చట్టపరంగా చర్యలు తీసుకునేందుకు ఆలోచిస్తున్నామని పేర్కొన్నారు. కస్టమ్స్ అధికారులు 'ఓ మై గర్ల్' బృందం సభ్యులను విడిచి పెట్టిన తర్వాత దక్షిణ కొరియా రాజధాని సియోల్‌కు చేరుకున్నారు. అయితే తిరిగి వారు మళ్లీ ఆల్బం చిత్రీకరణ కోసం లాస్ ఏంజెల్స్ వెళ్తారా లేదా అన్న విషయాన్ని మాత్రం స్పష్టం చేయలేదు.

కాగా దక్షిణ కొరియాకు చెందిన ఈ 'ఓ మై గర్ల్' బృందంలో ఎనిమిది మంది యువతలు ఉన్నారు. ఏప్రిల్ 20, 2015లో అరంగేట్రం చేసిన వీరు చిన్ని ఆల్బమ్ ద్వారా వీరు ప్రపంచ వ్యాప్తంగా గుర్తుంపుని తెచ్చుకున్నారు.

English summary
After heading to America to shoot their album cover this week, Korean pop band Oh My Girl had to cancel both the photo shoot and a planned performance when they were detained at Los Angeles International Airport under suspicion of being sex workers.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X