కరాచీ విమానాశ్రయంపై మరోసారి ఉగ్రవాదుల దాడి
ఇస్లామాబాద్: పాకిస్థాన్‌లోని కరాచీ విమానశ్రయంపై ఉగ్రవాదులు మరోసారి దాడికి తెగబడ్డారు. విమానాశ్రయంలోని భద్రతా దళాల హాస్టల్‌పై ఉగ్రవాదులు మెరుపుదాడి చేశారు. ఈసారి వైమానిక రక్షణ దళ వసతి గృహం లక్ష్యంగా దాడి చేశారు. వెంటనే అప్రమత్తమైన భద్రతాదళాలు ప్రతిదాడికి దిగాయి. ఐదు నుంచి పది మంది ఉగ్రవాదులు దాడిలో పాల్గొన్నట్లు సమాచారం.
భద్రతాదళాలు ఉగ్రవాదల మధ్య హోరాహోరీ కాల్పులు జరుగాయి. ఐదుగురు ఉగ్రవాదులను భద్రతాదళాలు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. ఉగ్రవాదుల దాడులతో అధికారులు విమానాల రాకపోకలను నిలిపివేశారు. విమానశ్రయం వద్ద ఎదురుకాల్పులు కొనసాగుతున్నాయి.

24 గంటల్లో కరాచీ ఎయిర్‌పోర్టుపై రెండు సార్లు ఉగ్రవాదులు దాడికి పాల్పడ్డారు. చివరి ఉగ్రవాదిని మట్టుబెట్టే వరకు ఆపరేషన్ కొనసాగుతుందని పాక్ సైన్యం తెలిపింది. సోమవారం విమానాశ్రయంపై జరిగిన దాడిలో పది మంది ఉగ్రవాదులతో సహా 29 మంది మృతి చెందారు.
కాగా, మంగళవారం ఉదయం తీరాహ్ లోయ ప్రాంతంలో మిలిటరీ అధికారులు ఉగ్రవాద స్థావరాలపై వైమానిక దాడులు చేశారు. ఈ దాడుల్లో 15 మంది ఉగ్రవాదులు మృతి చెందారని, తొమ్మిది ఉగ్రవాద స్థావరాలు ధ్వంసమయ్యాయని అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు.












Click it and Unblock the Notifications