Khamenei: ఖమేని భార్య మృతి..
ఇరాన్ సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనీ భార్య మృతి చెందారు. ఇటీవల ఇరాన్ పై ఇజ్రాయెల్, అమెరికా సంయుక్తంగా దాడులు చేపట్టిన విషయం తెలిసిందే. ఈ దాడుల్లో ఖమేనీ భార్య మన్సూరే ఖోజాస్తే తీవ్రంగా గాయపడ్డారు. ఈ మేరకు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ సోమవారం మృతి చెందినట్లు ఇరాన్ మీడియా వెల్లడించింది. ఇక ఇరాన్ పై ఇజ్రాయెల్- అమెరికా సంయుక్తంగా జరిపిన దాడుల్లో ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ విషయాన్ని ఇరాన్ మీడియా ధృవీకరించింది. అంతేకాక ఈ దాడుల్లో ఖమేనీ కుమార్తె, మనవడు, కోడలు, అల్లుడు మరణించినట్లు వెల్లడించింది. ఇదే దాడుల్లో తీవ్రంగా గాయపడిన ఖమేనీ భార్య తాజాగా మృతి చెందారు.
ఇరాన్ అత్యున్నత నాయకుడు అయతొల్లా అలీ ఖమేనీ సతీమణి మన్సూరే ఖోజాస్తే తాజాగా మరణించారు. ఇటీవల ఇరాన్ పై అమెరికా, ఇజ్రాయెల్ దళాలు నిర్వహించిన వైమానిక దాడుల్లో తీవ్రంగా గాయపడిన ఆమె, చికిత్స పొందుతూ సోమవారం తుది శ్వాస విడిచారు. ఈ విషయాన్ని ఇరాన్ ప్రభుత్వ మీడియా సంస్థ 'ప్రెస్ టీవీ' ధృవీకరించింది. ఇక గతవారం ఖమేనీతోపాటు కుమార్తె, మనవడు, కోడలు, అల్లుడు మరణించారు. అలాగే 30 మందికి పైగా అధికారులు మృతి చెందారు.
ఇక మన్సూరే 1947 లో మషద్ లోని ఓ వ్యాపార కుటుంబంలో జన్మించారు. ఆమె 1964 లో ఆమె అలీ ఖమేనీని వివాహం చేసుకున్నారు. వీరికి నలుగురు కుమారులు, ఇద్దరు కుమార్తెలు సంతానంగా ఉన్నారు. మరోవైపు ఖమేనీ, ఆయన కుటుంబ సభ్యుల మరణం నేపథ్యంలో ఇరాన్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. దేశవ్యాప్తంగా 40 రోజుల పాటు సంతాప దినాలను ప్రకటించింది. ఇక అమెరికా- ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో ఇరాన్ రక్షణ మంత్రి అజీజ్ నసీర్ జాదే, IRGC కమాండర్ మహ్మద్ పక్ పూర్ మరణించినట్లు ఇరాన్ ప్రభుత్వం పేర్కొన్న విషయం తెలిసిందే.
అయితే ఇరాన్ తాత్కాలిక రక్షణ మంత్రిగా మజీద్ ఎబ్ నల్ రజాను నియమిస్తూ ఇరాన్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు మజీద్ ను రక్షణ మంత్రిగా నియమిస్తూ ఇరాన్ అధ్యక్షుడు ఆదేశాలు జారీ చేశారు. ప్రస్తుతం మజీద్ రెవల్యూషనరీ గార్డ్స్ జనరల్ గా ఉన్నారు. ఇక ఇజ్రాయెల్, ఇరాన్, అమెరికా సంయుక్తంగా జరిపిన దాడుల్లో సోమవారం మార్చి 2 నాటికి ఇరాన్ లో 555 మంది మృతి చెందారు. వందలాది మంది గాయపడ్డారు.

అలాగే ఇరాన్ లోని 31 ప్రావిన్స్ లో 24 ప్రావిన్స్ లపై 1200 వరకు క్షిపణులు, డ్రోన్ లతో దాడులకు పాల్పడినట్లు ఇజ్రాయెల్ సైన్యం పేర్కొంది. మరోవైపు మిడిల్ ఈస్ట్ లోని 27 అమెరికన్ బేస్ లపై దాడులు చేసినట్లు ఇరాన్ కు చెందిన ఇస్లామిక్ రెవలూషనరీ గార్డ్స్ కార్ప్స్ స్పష్టం చేసింది. ఇప్పటివరకూ 9 దేశాలపై ఇరాన్ దాడులకు పాల్పడింది. బహ్రెయిన్, ఇరాక్, జోర్డాన్, కువైట్, ఒమన్, ఖతార్, సౌదీ అరేబియా, యూఏఈ ఉన్నాయి.
-
Bay of Pigs: క్యూబాలో అమెరికా ఎలా ఓడిపోయి లొంగిపోయింది ? నెక్ట్స్ ఇరానేనా ? -
భారత్కు ఇరాన్ బంపరాఫర్!.. ప్రధాని మోదీ మాస్టర్ ప్లాన్! -
మోదీ-ట్రంప్ వార్ ఫోన్ కాల్ మధ్యలో మస్క్- షాకింగ్ ట్విస్ట్ -
సంక్షోభం వస్తే మీ సన్నద్ధత ఎంత ? సీఎంల భేటీలో ప్రధాని మోడీ..! -
సాక్షాత్ FBI చీఫ్ కే దిక్కులేదు- ఇరాన్ హ్యాకర్ల పంజా -
LPG పై కేంద్రం మరో గుడ్ న్యూస్ -రాష్ట్రాలకు లేఖలు..! -
దేశంలో పెట్రోల్, గ్యాస్ స్టాక్.. రెండు నెలలే -
మళ్ళీ లాక్డౌన్? కేంద్రం సంచలన ప్రకటన -
యుద్ధం వేళ మోదీ చాణక్యం.. కర్ర విరక్కుండా.. పాము చావకుండా..! -
భారత్లోకి " పైప్డ్ " గ్యాస్ ఎక్కడి నుండి వస్తుంది? ఇది కూడా అయిపోతుందా?? -
PM Modi: సీఎంలకు మోడీ సందేశం ఇదే..! మళ్లీ ఆ కోవిడ్ మోడల్..! -
పెట్రోల్, గ్యాస్ సంక్షోభం తీవ్రం- కేంద్రమంత్రులతో ప్రత్యేకంగా కమిటీ ఏర్పాటు












Click it and Unblock the Notifications