ట్రంప్ మాస్టర్ ప్లాన్.. 30 సెకన్లలోనే ఖమేనీ, 30 మంది అధికారులు హతం..
ఇరాన్ సుప్రీం నాయకుడు అయతొల్లా అలీ ఖమేనీతోపాటు పలువురు సీనియర్ అధికారులు ఇజ్రాయెల్ దాడులు ప్రారంభించిన కేవలం 30 సెకన్లలోనే హతం అయినట్టు సమాచారం. ఇజ్రాయెల్ ఛానెల్ 12 నివేదిక ప్రకారం.. ఇరాన్ సర్వోన్నత నాయకుడు అలీ ఖమేనీ, 30 మంది సీనియర్ ఇరాన్ అధికారులు దాడులు చేపట్టిన నిమిషం లోపే హతమయ్యారు. తాజా ఘర్షణ ప్రారంభమైన కొన్ని క్షణాల్లోనే ఇజ్రాయెల్ వైమానిక దళం వారిని అంతం చేసిందని ఛానెల్ పేర్కొంది.
అయితే, ఇరాన్ ప్రభుత్వ మీడియా నివేదికలు భిన్నంగా ఉన్నాయి. ఇజ్రాయెల్ వైమానిక దాడుల్లో అలీ ఖమేనీ, ఆయన కుమార్తె, మనుమడు, కోడలు, అల్లుడితో సహా పలువురు బంధువులు, 30 మంది సీనియర్ అధికారులు మరణించినట్లు వెల్లడించింది. ఈ దాడులు అమెరికా, ఇజ్రాయెల్ సంయుక్తంగా చేశాయని ఇరాన్ మీడియా పేర్కొంది.
ఇజ్రాయెల్ మీడియా ప్రకారం.. ఈ దాడులు ఘర్షణ ప్రారంభమైన తొలి క్షణాల్లోనే జరిగాయి. దీర్ఘకాల శత్రువైన ఇరాన్‌పై ప్రారంభించిన దాడిలో, ఇజ్రాయెల్ వైమానిక దళం ఖమేనీ సహా 30 మంది సీనియర్ అధికారులను కేవలం 30 సెకన్లలోనే తుదముట్టించిందని ఛానెల్ 12 స్పష్టం చేసింది. ఎన్ 12 ప్లాట్ ఫారమ్ లో ఇజ్రాయెల్ నాయకులు " ఇది కేవలం ఆరంభం మాత్రమే, మన ముందు ఇంకా కనీసం కొన్ని రోజుల పోరాటం మిగిలి ఉంది" అని నొక్కిచెబుతున్నారు. ఇతర వార్తా సంస్థలు అమెరికా బలగాలు, నిఘా విభాగంతో జరిగిన దీర్ఘకాల ఉమ్మడి ప్రణాళిక, సమన్వయంపై దృష్టి సారిస్తున్నాయి.

ఇజ్రాయెల్, అమెరికా మధ్య సన్నిహిత సమన్వయం, లక్ష్య ఛేదన ఖచ్చితత్వంపై ఇజ్రాయెల్ మీడియా విస్తృతంగా వ్యాఖ్యానించింది. అయితే, రక్షణ విశ్లేషకుడు యోవ్ లిమోర్ 'ఇజ్రాయెల్ హయోమ్' పత్రికలో, కార్యకలాపాలు కొనసాగుతున్న కొద్దీ వాషింగ్టన్, టెల్ అవీవ్ మధ్య విభేదాలు విస్తరించవచ్చని రాశారు. ఇది వ్యూహాత్మక ఘర్షణకు దారితీయవచ్చని ఆయన హెచ్చరించారు.












Click it and Unblock the Notifications