వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

'దుస్తులు విప్పించిన నెట్లోని వీడియో దేవయానిదికాదు'

By Srinivas
|
Google Oneindia TeluguNews

వాషింగ్టన్: భారత దౌత్యాధికారిణి దేవయానిని దుస్తులు విప్పించి తనిఖీలు చేస్తున్నట్లు సోషల్ నెట్ వర్కింగ్ వెబ్‌సైట్లలలో అందుబాటులో ఉన్న సిసిటివి దృశ్యం ఆమెకు సంబంధించినది కాదని అమెరికా తెలిపింది. వెబ్‌సైట్లలోని వీడియో నకిలీదని, అలా నకిలీవి ఉంచడం ప్రమాదకరమన్నారు. రెచ్చగొట్టే రీతిలో సృష్టించిన కల్పితం కాక మరొకటి కాదని అమెరికా విదేశాఖ శాఖ ఉప అధికార ప్రతినిధి మేరీ హార్ఫ్ అన్నారు.

ఆ వీడియో ఎంత మాత్రం దేవయానిది కాదని, ఇది అత్యంత ప్రమాదకరమైన, రెచ్చగొట్టే కథ అని తాము భావిస్తున్నామని హార్ఫ్ పేర్కొన్నారు. కాగా, సోషల్ మీడియాలో సర్క్యులేట్ అయిన ఆ వీడియోలో ఒక మహిళను బట్టలూడదీసి సోదా చేస్తున్నట్లు ఉంది. సోదా చేసేటప్పుడు ఆ మహిళ కేకలు పెడుతున్నట్లుగా కూడా ఆ వీడియోలో ఉంది.

Devyani Khobragade

తన ఇంట్లో పని మనిషి వీసా దరఖాస్తులో తప్పుడు డిక్లరేషన్‌ను ఇచ్చినందుకుగాను న్యూయార్క్‌లోని భారత కాన్సులేట్‌లో డిప్యూటీ కాన్సుల్ జనరల్‌గా పని చేస్తున్న 39 ఏళ్ల దేవయానిని గత నెల అరెస్టు చేయడం తెలిసిందే. ఆమెను ఆ తర్వాత రెండున్నర లక్షల డాలర్ల వ్యక్తిగత బాండ్‌పై విడుదల చేశారు. ఆమెను బట్టలూడదీసి తనిఖీ చేయడంతో పాటు, నేరస్థులతో కలిపి నిర్బంధించడం భారత్, అమెరికాల మధ్య వివాదానికి దారితీసిన విషయం తెలిసిందే. ఈ వీడియో గురించి విదేశాంగ శాఖ అమెరికా మార్షల్ సర్వీస్‌తో మాట్లాడిందని, అది నిజమైంది కాదని అధికారులు ధ్రువీకరించారని హర్ఫ్ చెప్పారు.

భారత దౌత్యవేత్త అరెస్టు భారత్ - అమెరికా సంబంధాల్లో ఇబ్బందులకు కారణమైందన్న ప్రధాని మన్మోహన్ సింగ్ వ్యాఖ్యలతో అమెరికా అంగీకరిస్తూ, ఈ సంబంధాలను తిరిగి మామూలు స్థితికి తీసుకు రావడంపై ఇప్పుడు దృష్టి పెట్టామని తెలిపింది. అమెరికా విదేశాంగ మంత్రి ఒక విషయంపై విచారం వ్యక్తం చేసారంటే అంతా సవ్యంగా లేదనే దాని అర్థమని హర్ఫ్ చెప్పారు.

English summary

 The US has dismissed as a hoax a video purportedly showing CCTV footage of senior Indian diplomat Devyani Khobragade's strip search after her arrest, saying it is a "dangerous and provocative fabrication".
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X