న్యూయార్క్‌లో ‘కిమ్ జోంగ్ ఉన్’.. వైరల్ గా మారిన వీడియో!
ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ న్యూయార్క్ వీధుల్లో నడిచాడు.. ఎక్కడా మీ ప్రెసిడెంట్ ట్రంప్ అంటూ ఒకరిద్దరిని అడిగాడు. అలా నడుచుకుంటూ ట్రంప్ టవర్స్ లోకి వెళ్లిపోయాడు.
న్యూయార్క్: ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ న్యూయార్క్ వీధుల్లో నడిచాడు.. ఎక్కడా మీ ప్రెసిడెంట్ ట్రంప్ అంటూ ఒకరిద్దరిని అడిగాడు. అలా నడుచుకుంటూ ట్రంప్ టవర్స్ లోకి వెళ్లిపోయాడు.
అదేంటి? అమెరికా అంటేనే మండిపడే ఉత్తరకొరియా అధినేత కిమ్ జోంగ్ ఉన్ అమెరికా రావడమేమిటి? ట్రంప్ ను కలుసుకోవడానికి ట్రంప్ టవర్స్ లోకి వెళ్లడమేమిటి.. అదీ రోడ్లపై వాకబు చేసుకుంటూ.. అని ఆశ్చర్యపోతున్నారా..!
మరీ అంత ఆశ్చర్యపోకండి. ప్రపంచంలో మనుషుల్ని పోలిన మనుషులు ఏడుగురు ఉంటారంటారు కదా? అలాగే అచ్చు ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్‌ని పోలిన వ్యక్తి న్యూయార్క్‌లో ఉన్నాడు.
అంతేకాదు, ఈయన క్రాఫ్, దుస్తులు.. అన్నీ అచ్చం కిమ్‌లాగే ఉంటాయి. ఇటీవల ఈ 'కిమ్ డూప్' న్యూయార్క్ వీధుల్లోకి వచ్చాడు. అతడి వెనుక ఒక పోలీసు అధికారి కూడా ఉండడంతో అమెరికా పౌరులు బిత్తరపోయారు.
వారంతా అతడ్ని నిజంగానే ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ అనుకున్నారు. అతడు అచ్చంగా కిమ్‌లానే హావభావాలు పలికిస్తూ సుమారు 10 గంటల పాటు న్యూయార్క్ రోడ్లపై తిరిగాడు.
కొంతమంది అమెరికన్లు అయోమయానికి గురయ్యారు. అమెరికాలో ఏం జరగబోతోందో అనే భయాందోళనకు గురయ్యారు. మరికొందరు మాత్రం అతడు కిమ్ జోంగ్ ఉన్ కాదని, కాకపోతే అచ్చు అలాగే ఉన్నడని తెలుసుకుని తమ కెమెరాలకు పనిచెప్పారు.
అతడు మాత్రం ప్రజలను ఏమాత్రం పట్టించుకోకుండా అలా నడుచుకుంటూ నేరుగా ట్రంప్ టవర్‌లోనికి వెళ్లిపోయాడు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ స్వయంగా అతనికి 'రాకెట్ మ్యాన్' అని ముద్దు పేరు పెట్టారు.
కిమ్ జోంగ్ ఉన్ మాదిరిగా ఉన్న ఆ వ్యక్తి అమెరికా వీధుల్లో నడుస్తున్న ఆరు నిమిషాల వ్యవధి ఉన్న వీడియో ఒకదానిని క్యూపార్క్ పోస్ట్ చేయగా నిమిషాల వ్యవధిలోనే దాదాపు 9 లక్షల మంది దానిని వీక్షించారు.












Click it and Unblock the Notifications