షాక్: ట్రంప్‌తో భేటీకి టాయ్‌లెట్ వెంట తెచ్చుకున్న కిమ్, ఆ భయమే కారణమా?

సింగపూర్ సిటీ: ఉత్తర కొరియా అధినేత కిమ్‌ జోంగ్ ఉన్‌ ఏది చేసినా సంచలనమే. తాజాగా, మరోసారి తన విలక్షణమైన వ్యక్తిత్వంతో వార్తల్లోకి ఎక్కారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌తో శిఖరాగ్ర సమావేశాల కోసం సింగపూర్‌ వచ్చిన కిమ్‌ వెంట ఓ మొబైల్‌ టాయ్‌లెట్‌ తెచ్చుకోవడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.

ప్రత్యేక టాయ్‌లెట్

ప్రత్యేక టాయ్‌లెట్

ఆ టాయ్‌లెట్ కిమ్‌ కోసమే ప్రత్యేకంగా తయారుచేయించినది కావడం గమనార్హం. అయితే దీనిపై మీడియా కథనాల ప్రకారం.. కిమ్‌ తన ఆరోగ్య రహస్యాలను పశ్చిమ దేశాలు కనిపెట్టకుండా ఈ జాగ్రత్త తీసుకున్నట్లు తెలుస్తోంది.

కిమ్‌కు ఆరోగ్య సమస్యలు

కిమ్‌కు ఆరోగ్య సమస్యలు

‘కిమ్‌ కొన్ని ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. స్థూలకాయుడైన ఆయనకు స్వతహాగా ఫాటీ లీవర్‌ ఉంది. మధుమేహం, అధిక రక్తపోటు, కీళ్ల వాతం కూడా ఉన్నాయి' అని అని దక్షిణ కొరియాకు చెందిన వార్తాపత్రిక తన కథనంలో పేర్కొనడం గమనార్హం.

అదే కిమ్ భయమా?

అదే కిమ్ భయమా?

‘ఈ కారణంగానే తన మల, మూత్రాదులను పరీక్షించి పశ్చిమ దేశాలు తన ఆరోగ్య సమస్యను అంచనా వేస్తుందన్నది ఆయన భయం. అందుకు తావివ్వకుండా ఎటువంటి పరీక్షలకు లొంగని రీతిలో విసర్జనను డిస్పోజ్‌ చేయగల అత్యాధునికమైన టాయ్‌లెట్‌ను తన కోసం ఆయన తయారు చేయించుకున్నారు' వెల్లడించింది. కాగా, ట్రంప్‌కు అవసరమైన సామాగ్రిని ఓ ట్రాన్స్ పోర్టు విమానంలో సింగపూర్ తీసుకెళ్లినట్లు తెలిపింది.

ఊహించని భేటీ

ఊహించని భేటీ

మంగళవారం ఉదయం ట్రంప్-కిమ్ భేటీ అయ్యారు. అరుదైన ఈ భేటీకి సింగపూర్‌లోని కేపెల్లా హోటల్‌ వేదికగా మారింది. సుమారు 45 నిమిషాలపాటు ఈ భేటీ జరిగింది. కీలక ఒప్పందాలపై సంతకాలు కూడా చేశారు. ఎంతో కాలంగా అమెరికాకు కొరకరాని కొయ్యగా మిగిలిన ఉత్తరకొరియా నియంత కిమ్‌తో ట్రంప్ శాంతి చర్చలు జరపడం ప్రపంచ దేశాలకు ఊహించని విషయంగానే చెప్పుకోవచ్చు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+