వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

Kim Jong-un: చిక్కిపోయిన 'కిమ్'-లీకైన ఫోటోల్లో సన్నగా-ఉ.కొరియా అధినేతకు ఏమైనట్లు-అనారోగ్యమే కారణమా?

|
Google Oneindia TeluguNews

నియంతలకే నియంతగా ముద్రపడ్డ ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ గురించి ఎప్పుడు ఏ వార్త బయటకొచ్చినా ప్రపంచమంతా ఆసక్తిగా గమనిస్తుంది. ఉత్తర కొరియా గురించైనా.. ఆ దేశాధినేత కిమ్ గురించైనా బాహ్య ప్రపంచానికి అత్యంత అరుదుగా మాత్రమే సమాచారం అందుతుంటుంది. తాజాగా కిమ్‌కి సంబంధించిన బాహ్య ప్రపంచానికి లీకైన ఓ సమాచారం చాలామందిని ఆశ్చర్యానికి గురిచేస్తోంది. కిమ్ జోంగ్ ఉన్ బరువు తగ్గి చిక్కిపోయినట్లుగా అంతర్జాతీయ మీడియాలో కథనాలు వస్తున్నాయి. అనారోగ్య సమస్యల కారణంగానే కిమ్ చిక్కిపోయారా... లేక కావాలనే బరువు తగ్గారా అన్నది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.

Recommended Video

Kim Jong Un : North Koreaలో సీక్రెట్ Lockdown.. ఆంక్షల్ని ఉల్లంఘించిన ఇద్దరికి మరణశిక్ష!
తాజా సమావేశంలో స్లిమ్‌గా కిమ్...

తాజా సమావేశంలో స్లిమ్‌గా కిమ్...

ఉత్తరకొరియాలో ఇటీవల కిమ్ జోంగ్ ఉన్ అధ్యక్షతన ఓ కీలక ఆర్థిక సమావేశం జరిగింది. ఈ సమావేశానికి సంబంధించిన ఫోటోలను అక్కడి అధికారిక మీడియా విడుదల చేసింది. దక్షిణ కొరియాలోని సియోల్ మీడియా హౌస్‌ల ద్వారా ఈ ఫోటోలు బయటకొచ్చినట్లు తెలుస్తోంది. ఇందులో కిమ్ జోంగ్ ఉన్ మునుపటిలా బరువైన శరీరంతో కాకుండా స్లిమ్‌గా కనిపించారు. ఆయన చేతికి అత్యంత ఖరీదైన స్విస్ వాచ్ ఆ ఫోటోల్లో కనిపించింది. గతేడాది డిసెంబర్,2020లో లీకైన ఫోటోల్లోనూ ఈ వాచ్ కనిపించింది. అయితే అప్పటితో పోలిస్తే ఇప్పుడు ఆ వాచ్ ఆయన చేతికి అంత టైట్‌గా కనిపించలేదు. ఆయన బరువు తగ్గారని చెప్పేందుకు అంతర్జాతీయ మీడియాలో దీన్నో ఉదాహరణగా చెబుతున్నారు.

గతంలో 140 కేజీల బరువు...

గతంలో 140 కేజీల బరువు...

కిమ్ జోంగ్ ఉన్ నవంబర్,2021లో 140 కేజీల బరువుతో ఉన్నట్లు తెలుస్తోంది. 2011లో ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత 50 కేజీల బరువు పెరిగారు. అప్పటినుంచి ఆయన్ను అనేక ఆరోగ్య సమస్యలు చుట్టుముట్టాయన్న ప్రచారం ఉంది. గతేడాది కొద్ది నెలల పాటు ఆయన కనిపించకుండా పోయిన సమయంలో.... తీవ్ర అనారోగ్యమే ఇందుకు కారణమన్న ప్రచారం జరిగింది. ఒకానొక దశలో కిమ్ జోంగ్ ఉన్ చనిపోయారన్న ఊహాగానాలు కూడా వినిపించాయి. కానీ ఆ ఊహాగానాలు,సందేహాలను పటాపంచలు చేస్తూ గతేడాది జూన్ 6న ఆయన మళ్లీ ప్రత్యక్షమయ్యారు.

కిమ్ చైన్ స్మోకర్, అనారోగ్య సమస్యలు...

కిమ్ చైన్ స్మోకర్, అనారోగ్య సమస్యలు...

కిమ్ జోంగ్ ఉన్ చైన్ స్మోకర్ అని చెబుతారు. ఊపిరితిత్తులు,హృదయ సంబంధిత సమస్యలతో కిమ్ బాధపడుతున్నారన్న ప్రచారం కూడా ఉంది.2014లోనూ ఆరు వారాల పాటు ఆయన కనిపించకుండా పోయారు. ఆరోగ్యం చెడిపోయిన ప్రతీసారి ఆయన ఇలా నెలల తరబడి ప్రజలకు కనిపించకుండా పోతారన్న ప్రచారం ఉంది. తాజాగా కిమ్ జోంగ్ ఉన్ బరువు తగ్గిన నేపథ్యంలో... ఆయన సర్జరీ ద్వారా బరువు తగ్గారా లేక అనారోగ్య సమస్యల కారణంగా చిక్కిపోయారా అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఎప్పటిలాగే ఈ ప్రశ్నలకు కూడా సమాధానం దొరికే అవకాశం ఎంతమాత్రం లేదు. అయితే కిమ్ తన హెల్త్‌పై ఫోకస్ చేసినందువల్లే బరువు తగ్గి ఉంటాడన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

English summary
Kim Jong Un appeared noticeably slimmer as he was pictured in North Korean state propaganda this week .the first time in a month that he has been seen in public.with his watch strap in particular giving his weight loss awa
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X